Raja Babu
-
చంద్రబాబుకు పొలిటికల్ షాక్ విశాఖ టీడీపీలో వర్గ విభేదాలు
-
కూచిపూడి నాట్యాన్ని.. విశ్వవ్యాప్తం చేసిన మహనీయులు - 'పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చిన సత్యం'
సాక్షి, పత్రికా ప్రకటన: మచిలీపట్నం అక్టోబర్ 15: పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చిన సత్యం కూచిపూడి నాట్య సాంప్రదాయ పరిరక్షణకి, పునరుద్ధరణకి, ప్రాచుర్యానికి ఎంతో కృషి చేశారని మంత్రి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన అభ్యుదయ శాఖ మంత్రివర్యులు జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు ఆర్కే రోజా కొనియాడారు. ఆదివారం కృష్ణాజిల్లా మొవ్వ మండలం కూచిపూడి గ్రామంలోని శ్రీ సిద్ధేంద్ర యోగి కళాక్షేత్రంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, జిల్లా యంత్రాంగం, సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్, కూచిపూడి అకాడమీ చెన్నై, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, జయహో భారతీయం సంయుక్త ఆధ్వర్యంలో పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ వెంపటి చిన సత్యం గారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆలరించాయి. ముఖ్యంగా అక్షర, ఇమాంసి, అన్షికలు టెంపుల్ నృత్యం, కూచిపూడి ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో డాక్టర్ వెంపటి చినసత్యం మనవరాలు కామేశ్వరి బృందం చెన్నై వారి ఆధ్వర్యంలో మహిషాసుర మర్దిని నృత్యం ఎంతో అద్భుతంగా కమనీయంగా ప్రదర్శించారు. అలాగే నాలుగవ ప్రపంచ కూచిపూడి దినోత్సవం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వెయ్యి మంది విద్యార్థులు డాక్టర్ వెంపటి చిన సత్యం రూపొందించిన బ్రహ్మాంజలి మహా బృంద నృత్యం ఆహుతులను మంత్రముగ్ధుల్ని చేసింది. తొలుత ఇంచార్జి మంత్రివర్యులు వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొని శ్రీ సిద్ధేంద్ర యోగి కళాక్షేత్రం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డాక్టర్ వెంపటి చినసత్యం జీవిత విశేషాలను తెలిపే చిత్ర ప్రదర్శనను ప్రారంభించారు అనంతరం జ్యోతి ప్రకాశనం చేసి డాక్టర్ వెంపటి చినసత్యం వేడుకలను ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక సమితి సీఈవో ఆర్ మల్లికార్జున రావు రూపొందించిన డాక్టర్ వెంపటి చినసత్యం చిత్రపటాన్ని మంత్రులు ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఆర్కే రోజా మాట్లాడుతూ మన సంస్కృతి, కళలను సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.. డాక్టర్ వెంపటి చినసత్యం కూచిపూడి నాట్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహనీయులని అన్నారు. ఈ వేడుకలతో కూచిపూడి ప్రాంతమంతా అంగరంగ వైభవంతో పండుగ వాతావరణం నెలకొంది అన్నారు. డాక్టర్ వెంపటి చినసత్యం కూచిపూడి గ్రామంలో పుట్టి ఆ గ్రామానికి పరిమితం కాకుండా కూచిపూడి నృత్యాన్ని ప్రపంచంలో మారుమోగేలా కృషి చేశారన్నారు. ఏ రాష్ట్రానికి వెళ్లిన, ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఏ కార్యక్రమంలోనైనా మొదట తెలుగు నేలను తెలుగు ఖ్యాతిని ప్రతిబింబించే విధంగా కూచిపూడి నృత్యంతో ప్రారంభిస్తారన్నారు. డాక్టర్ వెంపటి చిన సత్యం మరణించి 13 సంవత్సరాల అయినప్పటికీ వారి శిష్యులు ప్రదర్శించే హావభావాలు,, నృత్యంలో సజీవమై కనిపిస్తున్నారన్నారు. సినిమా పరిశ్రమలో కూడా వైజయంతి మాల, హేమమాలిని, జయలలిత, ప్రభ ,చంద్రకళ, మంజు భార్గవి వంటి ఎందరో నటీమణులు వారి వద్ద శిష్యరికం చేశారన్నారు. 2011లో 1800 మంది చిన్నారులతో ప్రదర్శించిన కూచిపూడి నృత్యం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదయిందన్నారు.. తల్లిదండ్రులు తమ ఆడపిల్లలను కూచిపూడి నృత్యం నేర్చుకునేందుకు ప్రోత్సహించాలని తద్వారా వారికి వ్యాయామంతో పాటు ఆరోగ్యం కూడా పొందవచ్చు అన్నారు మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ డాక్టర్ వెంపటి చినసత్యం కూచిపూడి గ్రామంలో పుట్టి కూచిపూడి నాట్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయులని ప్రశంసించారు. గతంలో విజయవాడ చెన్నై లో జరిగే వారి జయంతి వేడుకలను మంత్రి ఆర్కే రోజా చొరవతో ఈరోజు వారు జన్మించిన కూచిపూడి గ్రామంలోనే జరుపుకోవడం ఎంతో గొప్ప విషయం అన్నారు. కూచిపూడి నృత్యం వంటి కళారూపాలను మరిచిపోతున్న తరుణంలో డాక్టర్ వెంపటి చినసత్యం వారి శిష్య బృందం ప్రపంచవ్యాప్తంగా కూచిపూడి నృత్యానికి ప్రాచుర్యం కల్పిస్తూ ఆరాధిస్తుండడం వారిని వారి తల్లిదండ్రులు ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు మాట్లాడుతూ ప్రతి రాష్ట్రానికి ఏదో ఒక కళారూపం ముఖ్యంగా చెప్పుకుంటున్నామని, ఆ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూచిపూడి నృత్యం, ఒరిస్సాకు ఒడిస్సి, ఉత్తరప్రదేశ్ కు కథాకళి, కేరళ కు మోహిని అట్టం వంటి కళారూపాలు ఎంతగానో ప్రాముఖ్యత సంతరించుకున్నాయన్నారు. మరుగున పడిపోతున్న కూచిపూడి నృత్యానికి డాక్టర్ వెంపటి చిన సత్యం జీవం పోసి విశ్వవ్యాప్త ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేశారన్నారు. వివిధ ప్రాంతాల్లోని నాట్యాచారులను, విద్యార్థులను ఒక చోట చేర్చి ఇలాంటి పెద్దయెత్తున వేడుకలు నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. పామర్రు శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ తాను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం పరిధిలో మహానుభావులు డాక్టర్ వెంపటి చినసత్యం జన్మించిన కూచిపూడి గ్రామం ఉండటం వారి ద్వారా కూచిపూడి నృత్యం ప్రపంచానికి పరిచయం కావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అలాగే మన జాతీయ పతాకం రూపకర్త పింగళి వెంకయ్య గారు జన్మించిన ప్రాంతం బాట్ల పెనుమర్రు కూడా తన పరిధిలోనే ఉండటం సంతోషకర విషయం అన్నారు. శ్రీ సిద్ధేంద్ర యోగి కళాశాలను అన్ని విధాల అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రిని, మంత్రిని కోరుతున్నానన్నారు. రాష్ట్రంలో రెండు కళాశాలలు ఉన్నాయని తెలుగు విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని కూచిపూడి లో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ప్రముఖ నర్తకి కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత మంజు భార్గవికి డాక్టర్ వెంపటి చినసత్యం జయంతి పురస్కారాన్ని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెండు లక్షల రూపాయల నగదు బహుమతిని మంత్రులు అతిథులు అందజేసి ఘనంగా సత్కరించారు. డాక్టర్ వెంపటి చినసత్యం జీవిత విశేషాలను తెలియజేసే పుస్తకాన్ని ఈ సందర్భంగా మంత్రులు అతిథులు ఆవిష్కరించారు. అలాగే శ్రీ సిద్ధేంద్ర యోగి కళాక్షేత్రం కూచిపూడి ప్రధానాచార్యులు కేంద్ర సంగీత నృత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి గారికి సిద్ధేంద్ర యోగి పురస్కారం, నాట్యాచార్యులు మాధవ పెద్ది మూర్తికి వెంపటి చినసత్యం జీవిత సాఫల్య పురస్కారం, వేదాంతం రాదే శ్యామ్‌కు డాక్టర్ పద్మశ్రీ శోభా నాయుడు జీవిత సాఫల్య పురస్కారం, పార్వతీ రామచంద్రన్ కుమారి లంక అన్నపూర్ణ జీవిత సాఫల్య పురస్కారం, పటాన్ మొహిద్దిన్ ఖాన్ కు వెంపటి వెంకట్ సేవా పురస్కారాలను మంత్రులు అతిధులు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ సభ్యులు డాక్టర్ ఎస్పీ భారతి, రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి చైర్పర్సన్ వంగపండు ఉష, అధికార బాషా సంఘం సభ్యులు డాక్టర్ డి.మస్తానమ్మ, రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి ముఖ్య కార్య నిర్వహణ అధికారి ఆర్ మల్లికార్జున రావు, డిఆర్ఓ పి. వెంకటరమణ, ఉయ్యూరు ఆర్డిఓ విజయ్ కుమార్, డిఆర్డిఎడ్ డ్వామా పీడీలు పిఎస్ఆర్ ప్రసాదు, సూర్యనారాయణ, విద్యుత్ అధికారి భాస్కరరావు, తహసిల్దార్ ఆంజనేయ ప్రసాద్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు కళాకారులు, వారి తల్లిదండ్రులు, కళాభిమానులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. - జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, కృష్ణాజిల్లా, మచిలీపట్నం వారిచే జారీ చేయబడినది. -
చొరబడేందుకు కాచుకు కూర్చున్నారు
శ్రీనగర్/జమ్మూ: గణతంత్ర దినోత్సవాల నేపథ్యంలో దేశంలోకి చొరబడేందుకు దాదాపు 135 మంది మిలిటెంట్లు సరిహద్దు అవతల వేచి చూస్తున్నట్టు సమాచారం అందిందని కశ్మీర్ బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ రాజాబాబు సింగ్ సోమవారం తెలిపారు. చొరబాట్లు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, సరిహద్దు వెంబడి గస్తీ పెంచామని చెప్పారు. నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. తాలిబన్ల ముప్పు, అఫ్గానిస్తాన్ నుంచి కశ్మీర్‌కు ఆయుధాలు సరఫరా అవుతాయనే వార్తలపై స్పందిస్తూ.. ఇప్పటివరకైతే అలాంటి సమాచారమేం లేదన్నారు. అయినా పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని, నిఘా పెంచామని చెప్పారు. కొంత మంది గైడ్లు నియంత్రణ రేఖ దాటి అవతలివైపునకు వెళ్లారని.. ఇటువైపు వచ్చాక వాళ్లపైన, వాళ్ల కుటంబాలపైనా నిఘా పెడతామన్నారు. యాంటీ డ్రోన్ పద్ధతులు వాడుతున్నాం సరిహద్దులో డ్రోన్ల సమస్య ఉందని, గతేడాది కూడా కొన్ని తమకు కనిపించాయని, అయితే మనవైపు రాలేదని ఐజీ వివరించారు. ఈ ఏడాది యాంటీ డ్రోన్ పద్ధతులను వాడుతున్నామని, డ్రోన్లు కూడా సమకూర్చుకుంటున్నామని తెలిపారు. సరిహద్దు అవతలివైపు నుంచి నార్కోటిక్ డ్రగ్స్ పంపేందుకు ప్రయత్నిస్తున్నారని, కొన్నింటిని ఇప్పటికే సీజ్ చేశామని తెలిపారు. సరిహద్దుల్లో 2021లో దాదాపు రూ. 88 కోట్ల విలువైన మందుగుండు సామగ్రి, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. ఆర్మీ, సీఆర్పీఎఫ్తో కలిసి గస్తీ: జమ్మూ ఐజీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు సంఘ విద్రోహక చర్యలకు పాల్పడే అవకాశముందని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించడంతో అప్రమత్తమయ్యామని బీఎస్ఎఫ్ జమ్మూ ఐజీ డీకే బోరా చెప్పారు. సరిహద్దు అవతలి నుంచి చొరబాట్లు జరగొచ్చని.. ఆయుధాలు, పేలుడు పదార్థాలను చేరవేయొచ్చని సమాచారం అందిందన్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి యాంటీ డ్రోన్ ఎక్సర్సయిజ్లు, టన్నెల్స్‌ను గుర్తించడం ముమ్మరం చేశామన్నారు. ఆర్మీ, సీఆర్పీఎఫ్తో కలిసి గస్తీ పెంచామని తెలిపారు. వీలైనంత ఎక్కువ మందిని సరిహద్దులో మోహరించామన్నారు. -
టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత
Senior Actor Rajababu Passed Away : టాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజబాబు(64) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గతరాత్రి మృతి చెందారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు. రాజబాబు స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలంలోని నరసాపురపేట. చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్న ఆయన 1995లో ‘ఊరికి మొనగాడు’సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత సింధూరం, సముద్రం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, మురారి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రమ్మోత్సవం, భరత్ అనే నేను వంటి చిత్రాల్లో నటించారు. దాసరి నారాయణ రావు దర్శకత్వంలో “స్వర్గం -నరకం “,“రాధమ్మ పెళ్లి ”అనే సినిమాలను సైతం నిర్మించారు. సినిమాతో పాటు వసంత కోకిల, అభిషేకం, రాధా మధు, మనసు మమత, బంగారు కోడలు, బంగారు పంజరం, నా కోడలు బంగారం, వంటి సీరియల్స్‌లోనూ నటించారు. ఆయన కెరీర్లో ఇప్పటి వరకు దాదాపు 48 సీరియల్స్‌లో నటించారు. -
ఎమ్మెల్యే కొడుకుపై రేప్ కేసు
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీకి చెందిన నాయకుల వారసుల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కొడుకు అత్యాచారం కేసులో ఇరుక్కున్నాడు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు కుమారుడుపై పోలీసు కేసు నమోదు అయింది. తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ సుబ్బారావు కుమారుడు రాజాబాబుపై సర్పవరం పోలీసులకు ఓ గిరిజన యువతి ఫిర్యాదు చేసింది. దీంతో అతడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు రేప్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. అలాగే క్రైం నెంబర్ 323/16 కింద కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. వైద్య పరీక్షల కోసం గిరిజన యువతిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు చెప్పారు. మరోవైపు ఎమ్మెల్యే తనయుడిని కేసు నుంచి బయటపడేసేందుకు తెర వెనుక మంత్రాంగం నడుస్తున్నట్టు బాధితురాలి తరపువారు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
23 కిలోల గంజాయి స్వాధీనం
రోలుగుంట మండలం బీబీపట్నం వద్ద పోలీసుల తనిఖీల్లో 23 కిలోల గంజాయి పట్టుబడింది. దీని విలువ రూ.46 వేలు ఉంటుంది. గంజాయిని అక్రమ తరలించడానికి ప్రయత్నించిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో రాజబాబు(50) స్థానికుడు కాగా..రేణి రాజా(45) తమిళనాడుకు చెందిన వ్యక్తి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రాజబాబు తమ్ముడిగా పుట్టడం ...
కాకినాడ : సినిమా పండాలన్నా, జీవితం పండాలన్నా హాస్యం ప్రధానమని ప్రముఖ సినీ హాస్య నటుడు అనంత్ అన్నారు. స్థానిక విజయదుర్గా పీఠాధిపతి గాడ్ 80వ జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మంగళవారం విలేకరులతో ముచ్చటించారు. పాతతరం నుంచి నేటివరకూ సినిమాల్లో హాస్యం ప్రధాన పాత్ర పోషిస్తోందని, నేడు హాస్యనటులకు కూడా అగ్రస్థానం లభిస్తోందని అన్నారు. నేటి సాంకేతిక యుగంలో ముఖంపై చిరునవ్వు కూడా కరువవుతోందని, హాస్యం లేని జీవితం నిస్సారమవుతుందని అన్నారు. ఇప్పటివరకూ తాను 500 సినిమాల్లో నటించానని చెప్పారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, ఇంద్రగంటి మోహనకృష్ణ, భీమనేని శ్రీనివాసరావులు దర్శకత్వం వహిస్తున్న సినిమాల్లో ప్రస్తుతం తాను నటిస్తున్నట్లు అనంత్ తెలిపారు. బెల్లంకొండ సురేష్ నిర్మాతగా వస్తున్న సినిమాతోపాటు, హీరో సాయిధరమ్‌తేజ నటిస్తున్న సినిమాలో కూడా నటిస్తున్నానని వివరించారు. స్వాతికిరణం, ఆపద్బాంధవుడు, అసెంబ్లీరౌడీ, అత్తారింటికి దారేది, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ తదితర సినిమాలు తనకు హాస్య నటుడిగా మంచి పేరు తెచ్చాయన్నారు. వెంగమాంబ, అదుర్స్, శ్రీఆంజనేయం తదితర సినిమాల్లో కూడా తాను చేసిన విలన్ పాత్రలు గుర్తింపు తీసుకు వచ్చాయన్నారు. సినీ చరిత్రలో ప్రముఖ హాస్యనటుడు రాజబాబుది సువర్ణాధ్యాయమని అనంత్ అన్నారు. ఆయన తమ్ముడిగా జన్మించడం పూర్వజన్మ సుకృతమని చెప్పారు. రాజబాబు ప్రభావం తనపై పూర్తిగా ఉందని అన్నారు. -
ముగ్గురు రైతుల బలవన్మరణం
వరంగల్: అప్పుల బాధతో కరీంనగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో మంగళవారం ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. కరీంనగర్ జిల్లా కాటారానికి చెందిన గోగుల రాజబాబు(26) గతేడాది మహారాష్ట్రలోని సిరొంచ ప్రాంతానికి వెళ్లి నాలుగెకరాలు కౌలుకు తీసుకుని పత్తి వేశాడు. పెట్టుబడికి రూ.2 లక్షలు అప్పు చేశాడు. కానీ, పంట పండలేదు. ఈ ఏడాది కాటారంలో మూడెకరాలు కౌలుకు తీసుకుని మళ్లీ పత్తి వేశాడు. పెట్టుబడి కోసం రూ.1.50 లక్షలు అప్పు చేశాడు. మెుత్తం అప్పు రూ.3.50 లక్షలకు చేరింది. ఆశించిన మేర రాకపోవడంతో అప్పు ఎలా తీర్చాలని మనోవేదన చెందాడు. రాజబాబు మంగళవారం సమీప అటవీ ప్రాంతంలో ఉరేసుకున్నాడు. అతడికి భార్య శారద, కుమారుడు ఉన్నారు. నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామానికి చెందిన ముక్కాంల లింగమ్మ (48), భర్త లింగయ్యతో కలిసి వ్యవసాయం చే స్తోంది. తమకున్న 5 ఎకరాలతోపాటు మరో 5 ఎకరాలను కౌలుకు తీసుకుని పత్తి, వరిని సాగు చేశారు. పెట్టుబడుల కోసం రూ. 3 లక్షల వరకు అప్పు చేశారు. పంట దిగుబడి ఆశాజనకంగా లేకపోవడంతో మనస్తాపానికి గురైంది. మంగళవారం ఇంట్లోనే పురుగులమందు తాగింది. అలాగే, వరంగల్ జిల్లా ములుగు మండలం జంగాలపల్లికి చెందిన రేగుల ఊర్మిళ(35), సదయ్య దంపతులు భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. భర్త సదయ్య కొన్నేళ్లుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాడు. ఊర్మిళ వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. రబీలో నాలుగెకరాల భూమి కౌలుకు తీసుకుని వరి సాగు చేసింది. పంట చేతికందే సమయంలో అకాల వర్షంతో పంట నేలవాలింది. దీంతో మనస్తాపానికి గురైన ఊర్మిళ సోమవారం రాత్రి వ్యవసాయ బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది. -
స్మార్ట్ఫోన్ల నుంచి నోకియా బ్రాండ్ మాయం
ముంబై: నోకియా స్మార్ట్ఫోన్ల శకం ముగిసింది. కనెక్టింగ్ పీపుల్ ట్యాగ్‌తో కొన్నేళ్లపాటు మొబైల్ ఫోన్ల ప్రపంచంలో రాజ్యమేలిన నోకియా బ్రాండ్ ఇక ఫీచర్ ఫోన్లకే పరిమితం కానున్నది. నోకి యా అంటే ఒక బ్రాండ్ కాదని, అదొక సంస్కృతి అని, నిజాయితీకి నిదర్శనమని ఇప్పటికీ ఎంతో మంది విశ్వసిస్తారు. నోకియా బ్రాండ్ స్మార్ట్ఫోన్ల నుంచి నిష్ర్కమణపై ప్రత్యేక కథనం.. ప్రపంచం వేగంగా స్మార్ట్ఫోన్ల వైపు పరుగులు పెడుతోంది. ఫీచర్ ఫోన్లను, అనేక ఫీచర్లతో కూడిన స్మార్ట్ఫోన్లను కూడా అందించి ఫోన్ అంటే నోకియాగా ప్రాచుర్యం పొందిన నోకియా బ్రాండ్ స్మార్ట్ఫోన్ల నుంచి నిష్ర్కమించనున్నది. నోకియా డివైస్ల వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్ కంపెనీ 750 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా మైక్రోసాఫ్ట్ కంపెనీ నోకియా లూమియా రేంజ్ ఫోన్లను మైక్రోసాఫ్ట్ లూమియాగా రీ బ్రాండ్ చేయాలని నిర్ణయించింది, దీంతో నోకియా స్మార్ట్ఫోన్ల శకం ముగిసినట్లయింది. మన్నికలో అగ్రతాంబూలం పెట్టిన ప్రతి పైసాకు తగిన విలువ కావాలనుకునే భారతీయుల వినియోగదారుల మనసులను నోకియా గెల్చుకుంది. భారతీయులు విశ్వసించదగ్గ బ్రాండ్‌గా నోకియా నిలిచిందని, ఇలా నిలవడానికి తగిన సమయంలో తగిన చర్యలు తీసుకుందని నిపుణులంటారు. రిటైలర్లు, కంటెంట్ అందించేవారు, డీలర్లతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇలా పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి పలు ప్రయత్నాలు చేసింది. నెలకొక కొత్త మోడల్‌ను మార్కెట్లోకి తెచ్చింది. అన్ని రంగుల్లో ఉండే స్క్రీన్ ఫోన్‌ను మొదటగా నోకియానే తెచ్చింది. వివిధ ధరల్లో ఫోన్లను అందించి, అన్ని రకాల ఆదాయ వర్గాల వారికి తగిన ఫోన్లను అందించింది. ఇక మన్నిక విషయంలో నోకియాకు తిరుగులేదు. ఎన్నిసార్లు కిందపడినా నోకియా ఫోన్లు పనిచేస్తాయనేది వినియోగదారుల అభిప్రాయం. ఇక నోకియాను కొనుగోలు చేసిన మైక్రోసాఫ్ట్ బ్రాండ్ కూడా భారతీయులకు పరిచితమైన బ్రాండే. గతంలో నోకియా ప్రయారిటీగా ఉన్న స్టోర్స్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ రిటైల్ స్టోర్స్‌గా మారాయి. అయితే లూమియా ఫోన్లను ఉపయోగించేవాళ్లు ఆ ఫోన్లను మైక్రోసాఫ్ట్ లూమియా ఫోన్లుగా కాక నోకియా లూమియా ఫోన్లగానే వ్యవహరిస్తారని అంచనా. నోకియా ఈ సిరీస్, ఎన్ సిరీస్ స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేసి, వాడిన వాళ్లు మాత్రం ఎప్పటికీ నోకియా బ్రాండ్‌ను మరచిపోలేరు. నోకియా ప్లాంట్ మూత నోకియా కంపెనీ భారత్‌లో తొలి మొబైల్ తయారీ కేంద్రాన్ని చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూర్‌లో 2009లో ప్రారంభించింది. ఇప్పటివరకూ విక్రయమైన నోకియా ఫోన్లలో 25 శాతం ఫోన్లను, (ఇది ప్రపంచంలో అమ్ముడైన 11 శాతం ఫోన్లకు సమానం) ఈ ఫ్యాక్టరీయే తయారు చేసింది. ఈ నెల 1 నుంచి ఈ ఫ్యాక్టరీలో ఉత్పత్తి ఆగిపోయింది. ఏదీ శాశ్వతం కాదు టెక్నాలజీ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదని నోకియా నిష్ర్కమణ నిరూపిస్తోంది. అయితే భవిష్యత్తులో నోకియా ప్రాభవం మరింత పెరిగినా ఆశ్చర్యం లేదని వారంటున్నారు. ఎందుకంటే నోకియా కంపెనీ హియర్ మ్యాపింగ్ డివిజన్‌ను మైక్రోసాఫ్ట్‌కు విక్రయించలేదు. మైక్రోసాఫ్ట్‌తో కుదిరిన ఒక ఒప్పందం ప్రకారం ప్రస్తుతం నోకియా కంపెనీ టెలికాం పరికరాలు, హియర్ మ్యాప్స్, టెక్నాలజీస్ వ్యాపారాలను నిర్వహిస్తోంది. -
నవ్వుల లెజెండ్
-
గోవాడ సుగర్స్‌లో తప్పిన ఘోర ప్రమాదం
=గోడౌన్లో మీదపడ్డ పంచదార బస్తాలు =ఆరుగురు కార్మికులకు తీవ్ర గాయాలు =ముగ్గురి పరిస్థితి విషమం చోడవరం, న్యూస్‌లైన్ : గోవాడ చక్కెర కర్మాగారంలో భారీ ప్రమాదం తప్పింది. గోడౌన్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులపై పంచదార బస్తాలు పడిపోవడంతో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. యాజమాన్యం సకాలంలో స్పందించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. గోవాడ చక్కెర కర్మాగారంలో శుక్రవారం ఎ షిప్ట్‌లో కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. రెండో నంబర్ గోడౌన్లో వేరేచోటికి తరలించేందుకు బస్తాలను మోస్తున్న 8మంది కార్మికులపై ప్రమాదవశాత్తు నిట్టలో ఉన్న బస్తాలు వచ్చి మీదపడ్డాయి. ఒకేసారి వందలాది బస్తాలు పడిపోవడంతో ఆరుగురు వాటికింద చిక్కుకుపోయారు. ఇంతలో అక్కడే ఉన్న తోటి కార్మికులు హుటాహుటిన అక్కడికి వచ్చి వారిని బయటికి తీశారు. వీరిలో శానాపతి దాలిబాబు, గోవాడ అప్పారావు, గొర్లె రాజాబాబులు తీవ్రంగా గాయపడగా పొట్నూరి గోవింద, పూతి అర్జున, చల్లా శేషగిరిరావులకు స్పల్ప గాయాలయ్యాయి. వీరందరికీ కర్మాగారంలోని ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురు పంచదార బస్తాల కింద బాగా నలిగిపోవడంతో శ్వాస ఆడలేదు. ఇద్దరికి చేతులు విరిగిపోయాయి. దీంతో వీరిని మెరుగైన వైద్యానికి విశాఖలోని ప్రయివేటు ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలించారు. ప్రమాదం జరిగిందని సైరన్ మోగడంతో కార్మికులంతా పరుగులు తీశారు. కర్మాగారం చైర్మన్ గూనూరు మల్లునాయుడు, మేనేజింగ్ డైరక్టర్ మజ్జి సూర్యభగవాన్ హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. యూనియన్ అధ్యక్షుడు బాస్కరరావు, అధికారులు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. కార్మికులు ప్రమాదానికి గురయ్యారని తెలియడంతో గోవాడ, అంబేరుపురం పరిసర ప్రాంతాల నుంచి కార్మికుల కుటుంబ సభ్యులు, ప్రజలు, వివిధ పార్టీల నేతలు చేరుకున్నారు. ఆ ప్రాంతమంతా ఆర్తనాదాలతో నిండిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హస్యనటుడు రాజబాబు బర్త్‌డే స్పెషల్