స్మార్ట్‌ఫోన్‌ల నుంచి నోకియా బ్రాండ్ మాయం | Nokia's Chennai plant shutdown a descent into darkness for some, new path for others | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ఫోన్‌ల నుంచి నోకియా బ్రాండ్ మాయం

Published Sun, Nov 9 2014 9:48 AM | Last Updated on Sat, Sep 2 2017 4:06 PM

స్మార్ట్‌ఫోన్‌ల నుంచి నోకియా బ్రాండ్ మాయం

స్మార్ట్‌ఫోన్‌ల నుంచి నోకియా బ్రాండ్ మాయం

ముంబై: నోకియా స్మార్ట్‌ఫోన్‌ల శకం ముగిసింది. కనెక్టింగ్ పీపుల్ ట్యాగ్‌తో కొన్నేళ్లపాటు మొబైల్ ఫోన్ల ప్రపంచంలో రాజ్యమేలిన నోకియా బ్రాండ్ ఇక ఫీచర్ ఫోన్లకే పరిమితం కానున్నది. నోకి యా అంటే ఒక బ్రాండ్ కాదని, అదొక సంస్కృతి అని, నిజాయితీకి నిదర్శనమని ఇప్పటికీ ఎంతో మంది విశ్వసిస్తారు.

నోకియా బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌ల నుంచి నిష్ర్కమణపై  ప్రత్యేక కథనం..
 ప్రపంచం వేగంగా స్మార్ట్‌ఫోన్‌ల వైపు పరుగులు పెడుతోంది. ఫీచర్ ఫోన్లను, అనేక ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను కూడా అందించి ఫోన్ అంటే నోకియాగా ప్రాచుర్యం పొందిన నోకియా బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌ల నుంచి నిష్ర్కమించనున్నది. నోకియా డివైస్‌ల వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్ కంపెనీ  750 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా మైక్రోసాఫ్ట్ కంపెనీ నోకియా లూమియా రేంజ్ ఫోన్లను మైక్రోసాఫ్ట్ లూమియాగా రీ బ్రాండ్ చేయాలని నిర్ణయించింది, దీంతో నోకియా స్మార్ట్‌ఫోన్‌ల శకం ముగిసినట్లయింది.

 మన్నికలో అగ్రతాంబూలం
  పెట్టిన ప్రతి పైసాకు తగిన విలువ కావాలనుకునే భారతీయుల వినియోగదారుల మనసులను నోకియా గెల్చుకుంది. భారతీయులు విశ్వసించదగ్గ బ్రాండ్‌గా నోకియా నిలిచిందని, ఇలా నిలవడానికి తగిన సమయంలో తగిన చర్యలు తీసుకుందని నిపుణులంటారు. రిటైలర్లు, కంటెంట్ అందించేవారు, డీలర్లతో ఒప్పందాలు కుదుర్చుకుంది.  ఇలా పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి పలు ప్రయత్నాలు చేసింది. నెలకొక కొత్త మోడల్‌ను మార్కెట్లోకి తెచ్చింది.

అన్ని రంగుల్లో ఉండే స్క్రీన్ ఫోన్‌ను మొదటగా నోకియానే తెచ్చింది.  వివిధ ధరల్లో ఫోన్‌లను అందించి, అన్ని రకాల ఆదాయ వర్గాల వారికి తగిన ఫోన్‌లను అందించింది. ఇక మన్నిక విషయంలో నోకియాకు తిరుగులేదు. ఎన్నిసార్లు కిందపడినా నోకియా ఫోన్‌లు పనిచేస్తాయనేది వినియోగదారుల అభిప్రాయం.  ఇక నోకియాను కొనుగోలు చేసిన మైక్రోసాఫ్ట్ బ్రాండ్ కూడా భారతీయులకు పరిచితమైన బ్రాండే.

గతంలో నోకియా ప్రయారిటీగా ఉన్న స్టోర్స్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ రిటైల్ స్టోర్స్‌గా మారాయి. అయితే లూమియా ఫోన్లను ఉపయోగించేవాళ్లు ఆ ఫోన్లను మైక్రోసాఫ్ట్ లూమియా ఫోన్లుగా కాక నోకియా లూమియా ఫోన్లగానే వ్యవహరిస్తారని అంచనా. నోకియా ఈ సిరీస్, ఎన్ సిరీస్ స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేసి, వాడిన వాళ్లు మాత్రం ఎప్పటికీ నోకియా బ్రాండ్‌ను మరచిపోలేరు.

 నోకియా ప్లాంట్ మూత
 నోకియా కంపెనీ భారత్‌లో తొలి మొబైల్ తయారీ కేంద్రాన్ని చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూర్‌లో 2009లో ప్రారంభించింది. ఇప్పటివరకూ విక్రయమైన నోకియా ఫోన్లలో 25 శాతం ఫోన్‌లను, (ఇది ప్రపంచంలో అమ్ముడైన 11 శాతం ఫోన్‌లకు సమానం) ఈ ఫ్యాక్టరీయే తయారు చేసింది. ఈ నెల 1 నుంచి ఈ ఫ్యాక్టరీలో ఉత్పత్తి ఆగిపోయింది.

 ఏదీ శాశ్వతం కాదు
 టెక్నాలజీ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదని నోకియా నిష్ర్కమణ నిరూపిస్తోంది. అయితే భవిష్యత్తులో నోకియా ప్రాభవం మరింత పెరిగినా ఆశ్చర్యం లేదని వారంటున్నారు.  ఎందుకంటే నోకియా కంపెనీ హియర్ మ్యాపింగ్ డివిజన్‌ను మైక్రోసాఫ్ట్‌కు విక్రయించలేదు. మైక్రోసాఫ్ట్‌తో కుదిరిన ఒక ఒప్పందం ప్రకారం ప్రస్తుతం నోకియా కంపెనీ టెలికాం పరికరాలు, హియర్ మ్యాప్స్, టెక్నాలజీస్ వ్యాపారాలను నిర్వహిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement