Sarpavaram police station
-
సంచలనం రేపిన ఎస్సై గోపాలకృష్ణ ఆత్మహత్య.. అదే కారణమా..?
కాకినాడ సిటీ/నవాబుపేట (పెనుగంచిప్రోలు): సర్పవరం ఎస్సై ముత్తవరపు గోపాలకృష్ణ ఆత్మహత్య సంఘటన జిల్లాలో శుక్రవారం తీవ్ర సంచలనం కలిగించింది. మృదుస్వభావిగా పోలీసు శాఖలో ముద్ర వేసుకున్న ఆయన తన సర్వీసు పిస్టల్‌తో కాల్చుకుని విషాదకర రీతిలో జీవితానికి ముగింపు పలకడం దారుణమని సహచర ఉద్యోగులు దిగ్భ్రమ చెందారు. గోపాలకృష్ణ మరణ వార్త తెలియగానే కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ సంఘటనపై వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించామని, ప్రత్యేకంగా స్పెషల్ బ్రాంచి డీఎస్పీ వెంకటేశ్వరరావును విచారణాధికారిగా నియమించామని జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు వెల్లడించారు. కాకినాడ జీజీహెచ్ మార్చురీ వద్ద ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎస్సై గోపాలకృష్ణ ఆత్మహత్య చాలా బాధాకరమన్నారు. ఎంసీఏ చదివి, కొన్నాళ్లు వీఆర్వోగా పని చేసి, తరువాత ఎస్సైగా ఎంపికైన ఈయన సున్నిత మనస్కుడని అన్నారు. తన స్వభావానికి పోలీస్ ఉద్యోగం సరికాదని, ఇది మానేసి వ్యాపారం చేసుకుంటే బాగుంటుందనే ఆలోచనలో ఉండేవారని తెలిపారు. ఆ డిప్రెషన్లోనే ఉన్న ఎస్సైకి కొందరు అధికారులు కౌన్సెలింగ్ కూడా ఇచ్చారన్నారు. పోలీసు ఉద్యోగం ఇష్టం లేదంటూ ముభావంగానే ఉండేవారని భార్య కూడా చెప్పారని ఎస్పీ వివరించారు. విలేకర్లతో మాట్లాడుతున్న ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు విలపించిన బంధువులు ఎస్సై గోపాలకృష్ణ భార్య పావని, తల్లిదండ్రులు శ్రీనివాసరావు, భారతమ్మతో పాటు బంధువులు కాకినాడ జీజీహెచ్‌కు తరలివచ్చారు. మార్చురీ వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు. గోపాలకృష్ణ 36 ఏళ్లకే తనువు చాలించడం దారుణమంటూ రోదించారు. ఆసుపత్రి వద్ద గోపాలకృష్ణ మృతదేహాన్ని ఏలూరు రేంజి డీఐజీ పాలరాజు, ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, డీఎస్పీ వి.భీమారావు తదితరులు పరిశీలించి, దగ్గరుండి పోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించారు. చదవండి: పామును రక్షించబోయి ఎమ్మెల్యే కారుకు ప్రమాదం కుమారుడి మృతితో రోదిస్తున్న తండ్రి శ్రీనివాసరావు నవాబుపేటలో విషాదం గోపాలకృష్ణ స్వస్థలమైన ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటలో విషాదఛాయలు అలముకున్నాయి. శ్రీనివాసరావు, సరోజని దంపతుల రెండో కుమారుడు గోపాలకృష్ణ, మొదటి కుమారుడు వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు బెంగళూరులోని ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. గోపాలకృష్ణకు భార్య పావని, నాలుగేళ్ల కుమార్తె భవిష్య, రెండేళ్ల కుమారుడు శర్వాన్ ఉన్నారు. ఈయన 2014 బ్యాచ్‌కు చెందిన ఎస్సై. వ్యవసాయ కుటుంబానికి చెందిన గోపాలకృష్ణ మొదటి నుంచీ చదువులో ముందుండేవారు. అందరితో ఎంతో సౌమ్యంగా ఉండేవారని గ్రామస్తులు చెప్పారు. ఎస్సైగా ఉంటూనే ఉన్నత పరీక్షలకు కూడా సిద్ధమవుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గోపాలకృష్ణ అంత్యక్రియలు శనివారం చేయనున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. -
కాకినాడ: సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్య
-
కాకినాడ: సర్పవరం ఎస్ఐ గోపాలకృష్ణ ఆత్మహత్య
సాక్షి, కాకినాడ జిల్లా: సర్పవరం ఎస్ఐ గోపాలకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన ఇంట్లో సర్వీస్ రివ్వాలర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఘటనకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. కాకినాడ జీజీహెచ్ మార్చురీలో ఎస్ఐ గోపాలకృష్ణ మృతదేహన్ని ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు, ఎస్పీ రవీంద్రనాథ్ బాబు పరిశీలించారు. చదవండి: పెళ్లి పీటలపైనే నవ వధువు మృతి.. ఎన్నో అనుమానాలు.. -
పోలీసుల వలలో మోసగాడు
కాకినాడ క్రైం: రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే రూ.10 కోట్లు ఇస్తానని చెప్పి ప్రజలకు రూ.30 లక్షల వరకు టోకరా వేసిన ఘరానా మోసగాడిని తూర్పు గోదావరి జిల్లా పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి కారు, సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి మోసాలను కాకినాడ డీఎస్పీ కరణం కుమార్ సర్పవరం పోలీస్‌స్టేషన్‌లో మీడియాకు మంగళవారం వివరించారు. అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పెద్దాడకు చెందిన షేక్ సర్దార్ హుస్సేన్ అలియాస్ శివాజీ ఇరిడియం కాపర్ బిందెలతో కోట్లు సంపాదించవచ్చని నమ్మించి 15 మందిని మోసం చేసి రూ.30 లక్షలు వసూలు చేశాడు. ఇరిడియం కాపర్ బిందెలను అమ్మకానికి పెట్టి విదేశాల్లో కోట్ల రూపాయలను సంపాదించవచ్చని ప్రజలను నమ్మించాడు. అంతర్జాతీయ అణు సంస్థ, ఆర్కియాలజీ శాఖలో పనిచేస్తోన్న హనుమంతు అనే వ్యక్తి పేరుపై లెటర్‌హెడ్, ఆర్బీఐ గవర్నర్ లెటర్ ప్యాడ్, ప్రధాని మోదీ సంతకంతో ఓ నకిలీ లెటర్ హెడ్లను సృష్టించాడు. ఆర్బీఐ నుంచి రూ.500 కోట్లు కంటైనర్‌లో వస్తుందని, ఇరిడియం అనే కాపర్ వస్తువు 230 ఏళ్ల క్రితందని, గవర్నమెంట్ ఆఫ్ ఆర్కియాలజీ డిపార్టుమెంట్ వారు సర్టిఫై చేసిన నకిలీ పేపర్‌ను చూపించి నమ్మించాడు. తనకు రూ.5 లక్షలు ఇస్తే రూ.10 కోట్లు ఇస్తానని నమ్మించడంతో 2018 డిసెంబర్లో ఏలూరుకు చెందిన ఆదూరి హరిమోహన్ అనే వ్యక్తి రూ.5 లక్షలు హుస్సేన్‌కు ఇచ్చాడు. ఆ తరువాత హరిమోహన్ తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని హుస్సేన్‌ను ఒత్తిడి చేశాడు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట పంచాయతీ రాయుడుపాలెంలో ఓ లాడ్జి వద్దకు వస్తే రెండు రోజుల్లో రూ.500 కోట్లు వస్తున్నాయని అందులో నుంచి రూ.10 కోట్లు ఇస్తానని హరిమోహన్‌కు హుస్సేన్ చెప్పాడు. ఈయన మాటలు నమ్మి అక్కడికి వెళ్లగా అప్పటికే తనలా డబ్బులు ఇచ్చి మోసపోయిన 15 మంది ఉన్నారని, తనను రూమ్‌లోకి తీసుకువెళ్లి డబ్బులు కోసం అడిగితే చంపుతానని బెదిరించి హుస్సేన్ పారిపోయాడని హరిమోహన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారించిన పోలీసులు హుస్సేన్‌తో పాటు అతడికి సహకరించిన విశాఖకి చెందిన పైలా సత్యవతి, సురేష్ అనే వ్యక్తులను అరెస్ట్ చేశారు. -
ఘరానా మోసగాడు షేక్ సర్దార్ హుస్సేన్ అరెస్టు
సాక్షి, కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలో ప్రజలను మోసగించిన ఘరానా మోసగాడు షేక్ సర్దార్ హుస్సేన్ అరెస్టయ్యారు. ఇరిడియం కాపర్ బిందెలతో కోట్లు సంపాదించవచ్చని నమ్మించి 15మంది నుంచి రూ.30 లక్షలు వసూలు చేసి షేక్ సర్దార్ హుస్సేన్ పరారయ్యాడు. ఇరిడియం బిందెల కోసం అంతర్జాతీయ అణుశక్తి సంస్ధ, ఆర్కియాలజీ శాఖ అనుమతులు కూడా ఉన్నాయని అతను నమ్మబలికాడు. అంతేకాకుండా ఆ రెండు సంస్థలతోపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నకిలీ లెటర్ హెడ్లు చూపించి.. ప్రజలను బురిడీ కొట్టించాడు సర్దార్ హుస్సేన్. రిజర్వ్ బ్యాంక్ నుంచి రూ. 500 కోట్లు కంటైనర్‌లో వస్తున్నాయని మోసం చేశాడు. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా సర్పవరం పోలీసులకు అతడు తాజాగా పట్టుబడ్డాడు. -
ఎమ్మెల్యే కొడుకుపై రేప్ కేసు
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీకి చెందిన నాయకుల వారసుల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కొడుకు అత్యాచారం కేసులో ఇరుక్కున్నాడు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు కుమారుడుపై పోలీసు కేసు నమోదు అయింది. తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ సుబ్బారావు కుమారుడు రాజాబాబుపై సర్పవరం పోలీసులకు ఓ గిరిజన యువతి ఫిర్యాదు చేసింది. దీంతో అతడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు రేప్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. అలాగే క్రైం నెంబర్ 323/16 కింద కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. వైద్య పరీక్షల కోసం గిరిజన యువతిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు చెప్పారు. మరోవైపు ఎమ్మెల్యే తనయుడిని కేసు నుంచి బయటపడేసేందుకు తెర వెనుక మంత్రాంగం నడుస్తున్నట్టు బాధితురాలి తరపువారు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
వంటనూనె శుద్ధి కర్మాగారాలపై దాడులు
కాకినాడ: వంటనూనె శుద్ధి కర్మాగారాలపై అగ్మార్క్ అధికారులు శనివారం దాడులు జరిపారు. నకిలీ అగ్మార్క్ వినియోగిస్తున్న లోహియం కంపెనీ నుంచి రూ. 13 లక్షల విలువైన వంటనూనె స్వాధీనం చేసుకున్నారు. నకిలీ శుద్ధి కర్మాగారం యాజమాన్యంపై సర్పవరం పోలీస్ స్టేషన్లో అగ్మార్క్ అధికారులు ఫిర్యాదు చేశారు. వేరుశెనగ, సన్‌ఫ్లవర్ ఆయిల్లో 80శాతం పామాయిల్ కలుపుతున్నారని అధికారులు గుర్తించారు.