అక్రమ కేసులు ఎత్తేయాలని జర్నలిస్టుల బైక్ ర్యాలీ | the journalists bike rally for withdraw cases | Sakshi
Sakshi News home page

అక్రమ కేసులు ఎత్తేయాలని జర్నలిస్టుల బైక్ ర్యాలీ

Published Sun, May 8 2016 4:08 PM | Last Updated on Sun, Sep 3 2017 11:41 PM

the journalists bike rally for withdraw cases

జర్నలిస్టులపై అక్రమంగా బనాయించిన పోలీస్ కేసును వెంటనే ఎత్తివేయాలంటు చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఆదివారం జర్నలిస్టులు నల్లబ్యాడ్జిలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. నారాయణఖేడ్ ఐన్యూస్ రిపోర్టర్ వాజిద్‌పై పెట్టిన పోలీస్‌లు పెట్టిన కేసును వెంటనే ఎత్తివేయాలంటు వారు డిమాండ్ చేశారు.

చిన్నశంకరంపేట చౌరస్తా నుంచి తహశిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నశంకరంపేట ప్రెస్‌క్లబ్ (టీయూడబ్లుజే)అధ్యక్షుడు రాజాగౌడ్,సీఎస్‌జేయూ క్లబ్ అధ్యక్షుడు శ్వామ్, సీనియర్ జర్నలిస్టులు వెంకన్న, చంద్రంగౌడ్, వెంకట్‌రెడ్డి,యాదగిరి, క్రిష్ణాగౌడ్, నరేందర్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement