TUWJ
-
జర్నలిస్టుల పెండింగ్ సమస్యలను పరిష్కరించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జర్నలిస్టులెదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే–హెచ్143) ఐటీ శాఖమంత్రి కేటీఆర్‌కు విన్నవించింది. ఈమేరకు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరిగిన సెమినార్‌కు హాజరైన కేటీఆర్‌ను కలిసి టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందం వినతిపత్రం అందించింది. చిన్న పత్రికల గ్రేడింగ్ అంశాన్ని పరిష్కరించాలని కోరింది. అలాగే వచ్చే ఏడాది జనవరి 8, 9, 10 తేదీల్లో హైదరాబాద్ కేంద్రంగా జరగనున్న ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) ప్లీనరీకి హాజరుకావాలని మంత్రిని ఆహ్వానించింది. రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ నేతృత్వంలో కేటీఆర్‌ను కలిసిన వారిలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతీసాగర్, తెమ్జూ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శి రమణకుమార్, చిన్న పత్రికల సంఘం అధ్యక్షుడు బిజిగిరి శ్రీనివాస్, కార్యదర్శి అగస్టీన్, హైదరాబాద్ జిల్లా టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు యోగానంద్, ప్రధాన కార్యదర్శి యారా నవీన్‌కుమార్, సుదర్శన్, అమిత్ భట్టు తదితరులున్నారు. -
ఢిల్లీలో తెలుగు జర్నలిస్ట్‌కు కరోనా
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో తెలుగు మీడియా ప్రతినిధి ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇక్కడి అపోలో ఆస్పత్రిలో శుక్రవారం పరీక్ష జరపగా.. శనివారం ఉదయానికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. సహచర తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) ప్రతినిధులు తోడుగా వెళ్లి ఆస్పత్రిలో చేర్చగా.. వెంటనే వైద్యులు చికిత్స ప్రారంభించారు. టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి మారుతీసాగర్ ఢిల్లీ టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్‌తో మాట్లాడి పలు సూచనలు చేశారు. (53 మంది జర్నలిస్టులకు కరోనా) మీడియా అకాడమీ నుంచి బాధితుడి చికిత్సకు, కుటుంబ అవసరాల నిమిత్తం రూ.20 వేలు డిపాజిట్ చేయనున్నట్టు తెలిపారు. తోటి జర్నలిస్టులు క్వారంటైన్‌కు వెళ్లాల్సి వస్తే రూ.10 వేలు డిపాజిట్ చేస్తామని భరోసా ఇచ్చారు. టీయూడబ్ల్యూజే ప్రతినిధుల అభ్యర్థన మేరకు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కూడా అపోలో ఆసుపత్రి వర్గాలతో మాట్లాడారు. జర్నలిస్టు పనిచేస్తున్న టీవీ చానల్ యాజమాన్యం తక్షణ సాయంగా రూ.లక్ష ఆస్పత్రిలో జమ చేసింది. టీయూడబ్ల్యూజే సభ్యులు, ఢిల్లీ ఆంధ్రా జర్నలిస్ట్ అసోసియేషన్ (ఆజాద్) సభ్యులు తక్షణ చర్యలపై, జర్నలిస్టుల సంక్షేమంపై శనివారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై చర్చించారు. (మీడియా మిత్రులకు కేజ్రీవాల్ ‘గుడ్‌న్యూస్’) ఉప రాష్ట్రపతి ఆరా అపోలో ఆస్పత్రి యాజమాన్యం, డాక్టర్లతో ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడి మీడియా ప్రతినిధి క్షేమంపై ఆరా తీశారు. ఉప రాష్ట్రపతి జర్నలిస్టు కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి భరోసా ఇచ్చారు. కాగా జర్నలిస్టుల అభ్యర్థన మేరకు ఢిల్లీ తెలుగు మీడియా ప్రతినిధులందరికీ కోవిడ్ టెస్ట్ చేయించేందుకు తగిన చర్యలు తీసుకోనున్నట్టు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. -
తూటాలతో రక్తం పారించిన ఘనత కేసీఆర్‌ది
సాక్షి, హైదరాబాద్ : నక్సలైట్ల ఎజెండానే తమ ఎజెండా అని అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. అమాయక గిరిజన ప్రజలను అటవి ప్రాంతంలోకి తీసుకెళ్లి తూటాలతో హతమార్చారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ బిడ్డలైన శృతి, సాగర్, వివేక్‌ను టీఆర్ఎస్ ప్రభుత్వం హతమార్చి .. అమాయకుల ఎన్కౌంటర్లతో ఈనేలను రక్తంతో తడిపారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు ఆశించిన విధానానికి వ్యతిరేకంగా నేడు రాష్ట్రంలో పాలనలో సాగుతోందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని పలు కీలక అంశాలపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి తీరుతుందని.. తమ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలను సంక్షేమం దిశగా మార్చే విధంగా పాలన ఉంటుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ నాయకత్వాన్ని నేరుగా ఎదుర్కొలేక టీఆర్ఎస్ నాయకులు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆయన పేర్కొన్నారు. తన ఒక్కగానొక్క బిడ్డ వివాహానికి కూడ తనను హాజరుకాకుండా అడ్డుకోవాలని టీఆర్ఎస్ నేతలు తనను జైల్లో పెట్టించారని గుర్తుచేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా చివరివరకు తాను ప్రజలు పక్షాన పోరాడుతానని రేవంత్ తేల్చిచెప్పారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘రాజకీయంగా నాకు అనుభవం లేదని చాలామంది అంటున్నారు. గత పదేళ్లకుపైగా వివిధ రకాలుగా ప్రజల పక్షాన పోరాడుతున్న. మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించని అనుభవం లేకున్నా ప్రజలకు ఎలాంటి పాలనలో కావాలో నాకు విజన్ ఉంది. గతంలో ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని ఎన్టీ రామారావు.. పార్టీ స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే సీఎం అయ్యారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హఠాత్తుగా ప్రాణాలు కోల్పేతే అప్పటివరకు రాజకీయ అనుభం లేని రాజీవ్ గాంధీ ఏకంగా దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. సంక్షేమ పాలనకు రాజకీయ అనుభవం అవసరంలేదు. ప్రజలకు మంచి చేయలనే తపన ఉంటే చాలు. వచ్చే కాంగ్రెస్ పాలనలో అద్భుతమై పాలన అందిస్తాం. దానికొరకు భవిష్యత్తు ప్రణాళికను కూడా రూపొందించాను. రేవంత్ ప్రసంగాన్ని కొనసాగిస్తూ..‘‘రాష్ట్రంలోని రైతులు, నిరుద్యోగులు, సామన్య ప్రజలు ఇలా అన్ని వర్గాల ప్రజలు సంక్షేమం గురించి ప్రణాళికలను సిద్దం చేశాం. ముఖ్యంగా రైతులకు కేవలం రుణమాఫీ లాంటి విముక్తి కాకుండా పంటలకు గిట్టుబాటు ధరకు కల్పిస్తాం. ప్రతీ ఏడాది ఉద్యోగాల క్యాలెండర్‌ను విడుదల చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నెలలోనే అని శాఖల నుంచి ఖాళీలను తెప్పించుకుని.. వచ్చే జూన్2 తెలంగాణ రాష్ట్ర దినోత్సవం సందర్భంగా కొత్త నియామకాలను చేపడతాం. జర్నలిస్టుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అని అన్నారు. -
రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే
-
ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్‌లో TUWJ ధర్నా
-
220 మంది మృతి.. జర్నలిస్ట్‌లను కాపాడండి..!
సాక్షి, న్యూఢిల్లీ : గతకొంత కాలంగా తెలంగాణలో జరుగుతున్న జర్నలిస్ట్‌ల మరణాలపై ఢిల్లీలో టీయూడబ్య్లూజే ధర్నాను నిర్వహించింది. ‘జర్నలిస్ట్‌లను కాపాడండి’ అంటూ ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్‌లో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి వామపక్ష పార్టీల నేతలు.. సురవరం సుధాకర్ రెడ్డి, సీతారా ఏచూరి, డీ రాజా హాజరై సంఘీభావం తెలిపారు. ఎన్‌యూజే నేత రాజ్ బిహారీ, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పెంటపాటి పుల్లారావు, ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, ఐజేయూ నేత శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో గత నాలుగేళ్ల కాలంలో మరణించిన 220 మంది జర్నలిస్టులపై పుస్తకాన్ని విడుదల చేశారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన జర్నలిజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదని, ఇంత పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు ఏ రాష్ట్రంలో కూడా మరణించలేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. జర్నలిజం కత్తిమీద సాములాంటి వృత్తని.. జర్నలిస్ట్‌ల సమస్యలను కారుణ్య దృష్టితో చూడొద్దని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. జర్నలిస్ట్‌ల సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని.. అందుకే 31 జిల్లాల జర్నలిస్టులు వచ్చి ఢిల్లీలో ధర్నా చేపట్టారని ఐజేయూ సెక్రటరీ జనరల్ అమర్ విమర్శించారు. తెలంగాణలో చనిపోయిన 220 మంది జర్నలిస్టులవి అసహజ మరణాలని, శ్రమ దోపిడి కారణంగానే వారు చనిపోయారని అన్నారు. కేసీఆర్ ఎవరితో మాట్లాడకుండా ఓ గడీని నిర్మించుకున్నారని, తెలంగాణలో నిరసన తెలిపే అవకాశం లేకుండా ధర్నాచౌక్‌ను ఎత్తివేశారని ఆయన మండిపడ్డారు. వందలాది జర్నలిస్టులు చనిపోయినా ప్రభుత్వంలో చలనం లేదని.. వారికి తగిన గుణపాఠం చెప్పాలని ఐజేయూ నేత శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. -
భయభ్రాంతులకు గురిచేస్తున్నారు: ఐజేయూ
సాక్షి, హైదరాబాద్ : పుణే పోలీసులు విచారణ పేరుతో హైదరాబాద్‌లో జర్నలిస్టులు, ప్రజాసంఘాల నేతల ఇళ్లపై దాడులు జరపడమే కాకుండా, అక్రమ అరెస్టులకు పాల్పడటం సహించరానిదని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) సెక్రటరీ జనరల్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు దేవులపల్లి అమర్ అన్నారు. పీసీఐ కమిటీ పర్యటనలో భాగంగా ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలో ఉన్న అమర్ ఈ సంఘటనపై స్పందించారు. పౌర హక్కుల నాయకులను, జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేసి మీడియా స్వేచ్ఛను, భావప్రకటనా స్వేచ్ఛను హరించడానికే పోలీసులు పథకం ప్రకారం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు అమర్ స్పష్టం చేశారు. పోలీసుల చర్యను ఖండిస్తున్నాం: టీయూడబ్ల్యూజే మోదీపై హత్య కుట్రను ఆరోపిస్తూ మహారాష్ట్ర పోలీసులు గతంలో చేసిన ప్రకటనపై విశ్వాసం లేకుండా పోయినందువల్లే, తమ ఉనికిని చాటుకోవడానికి ప్రజాసంఘాల ప్రముఖులు వరవరరావు, కూర్మనాథ్, టేకుల క్రాంతి ఇళ్లపై పుణే పోలీసులు దాడులకు పాల్పడ్డారని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్లూజే) అధ్యక్షులు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి కె.విరాహత్‌అలీలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది పౌర హక్కులు, పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే చర్యలు అని పేర్కొన్నారు. పోలీసు చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని వారు తెలిపారు. అరెస్టులు సరికాదు: టీయూడబ్ల్యూజే మోదీ హత్యకు కుట్ర పేరుతో పుణే పోలీసులు విరసం నేత వరవరరావును అక్రమంగా అరెస్టు చేయడం సరికాదని, జర్నలిస్టులు కూర్మనాథ్, క్రాంతి ఇళ్లలో అక్రమంగా సోదాలు చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) ఒక ప్రకటనలో తెలిపింది. సెర్చ్ వారంట్ లేకుండా సోదాలు నిర్వహించడం అక్రమమని యూనియన్ అధ్యక్షుడు అల్లం నారాయణ, క్రాంతి పేర్కొన్నారు. -
'కమిటీ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం'
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అందరికీ అక్రెడిటేషన్, హెల్త్‌కార్డులు ఇస్తారని అనుకున్న జర్నలిస్టులకు... అధికారుల తాత్సారం అయోమయాన్ని స్పష్టించిందని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూ జే) మండిపడింది. అక్రిడిటేషన్ కమిటీలో ఉత్సవ విగ్రహాలుగా ఉండలేమని కమిటీ సమావేశాన్ని బహిష్కరిస్తూ.. ఇకపై జరిగే సమావేశాలకు కూడా తమ యూనియన్ ప్రతినిధులు హాజరుకారని ప్రధాన కార్య దర్శి క్రాంతి కిరణ్, ఉపాధ్యక్షుడు పల్లె రవికుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కట్ట కవిత సోమవారం ఒక ప్రకటనలో పేర్కొ న్నారు. డిగ్రీ ఉంటేనే అక్రెడిటేషన్ కార్డులు ఇస్తామనడం మంచి దికాదన్నారు. అదేవిధంగా ఉమ్మ డి రాష్ట్రంలో ఏసీ బస్ సౌకర్యం ఉండేదని, ఇప్పుడు అది కూడా ఇవ్వని పరిస్థితి ఏర్ప డిందన్నారు. తెలం గాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్న జర్నలిస్టుల సంక్షేమం పట్ల అధికారుల వివక్ష కొనసాగుతున్నట్లు కనిపిస్తోందన్నా రు. అక్రెడిటేషన్‌తో సంబంధం లేకుండా హెల్త్ కార్డులు ఇవ్వాలని జీవోలో ఉన్నా.... అది వారికి టిష్యూ పేపర్లా అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
రేపు టీయూడబ్ల్యూజే సమావేశం
న్యూశాయంపేట : ఐజేయూ అనుబంధ టీయూడబ్ల్యూజే జిల్లా సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం ఏర్పాటుచేసినట్లు జిల్లా కన్వీనర్ తుమ్మ శ్రీధర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో ఉదయం 10గంటలకు ప్రారం¿ý మయ్యే ఈ సమావేశంలో ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, మాజీ సెక్రటరీ జనరల్ కె.శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, విరాహత్ అలీ హాజరవుతారని పేర్కొన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడంతో పాటు జిల్లా నూతన కమిటీని ఎన్నుకునేందుకు ఏర్పాటుచేసిన ఈ సమావేశానికి జిల్లాలోని జర్నలిస్టులు హాజరుకావాలని కోరారు. -
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
రాంనగర్: ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పని చేసే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు పి. ప్రభాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గార్లపాటి కృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆసంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటినా నేటికి జర్నలిస్టుల సమస్య ఒక్కటి కూడా పరిష్కారం కాలేదన్నారు. ప్రభుత్వం కొంత మంది జర్నలిస్టులకు హెల్త్ కార్డులు జారీ చేసినా ఏ ఒక్కరికి ప్రయోజనం లేదన్నారు. ఇళ్లు, ఇళ్ల స్థలాల కేటాయింపులు మాటలకే పరిమితమైందని విమర్శించారు. కార్యక్రమంలో జర్నలిస్టులు కోటగిరి ౖ§ð వాదీనం, చలసాని శ్రీనివాసరావు, పులిమామిడి మహేందర్‌రెడ్డి, దాసు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
వరంగల్ లో జర్నలిస్టుల ధర్నా
జర్నలిస్టుల సమస్యలపై టియుడబ్ల్యూజే(ఐజేయు) ఆద్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ కార్యాలయం ఎదుట వంటావార్పు చేసి జర్నలిస్టుల ధర్నా లో పాల్గొన్నరు ఈ కార్యక్రమనికి టియుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు తుమ్మ శ్రీధర్ రెడ్డి అధ్యక్షత వహించగా జాతీయ ,రాష్ట్ర నాయకులూ దాసరి కృష్ణారెడ్డి వెంకటరమణ కుమారస్వామీ పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా వందలాది మంది విలేఖరులు హాజరయ్యారు. జర్నలిస్టులు చేపట్టిన నిరసనకు కాంగ్రెస్ నాయకులు ఎర్రబెల్లి స్వర్ణ ,కట్ల శ్రీను బిజేపి జిల్లా అద్యక్షులు అశోక్ రెడ్డి టీడీపీ నాయకురాలు సీతక్క సిపిఐ, సిపిఎం జిల్లా కార్యదర్శులు శ్రీనివాసరావు వాసుదేవరెడ్డిలు సంఘీభావం తెలిపారు. జీవో 239 ను సవరించి తక్షణమే అర్హులైన జర్నలిస్టులకు అందరికీ కొత్త అక్రిడిటేషన్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు. వర్కింగ్ జర్నలిస్టులందరికి హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, డబుల్ బెడ్ రూం ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని కోరారు. -
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
తెలకపల్లి: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని టీయూడబ్ల్యూజే నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రెడ్డెపాకుల రమేష్, శంకర్లు అన్నారు. ఆదివారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జర్నలిస్టులు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. జర్నలిస్టులకు తెలంగాణవ్యాప్తంగా అక్రిడిటేషన్లు ఇవ్వాలని, 239 జీఓ ప్రకారం జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లతోపాటు హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో జర్నలిస్టు కుటుంబాలకు ఉచితంగా వైద్యం అందించేలా హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జర్నలిస్టులందరికీ 300 గజాల స్థలంలో రూ.7లక్షల 50వేలతో ట్రిపుల్ బెడ్రూం నిర్మించి ఇవ్వాలన్నారు. సంక్షేమ నిధిని కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శంకర్, చిలుక శేఖర్‌రెడ్డి, రవి, తదితరులు పాల్గొన్నారు. -
‘అల్లం’ లక్ష్యంగానే ధర్నాలు
టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకుడు పరశురాం సాక్షి, సంగారెడ్డి: తెలంగాణ ఉద్యమంలో జాడలేని కొంతమంది జర్నలిస్టు సంఘాల నాయకులు.. ఇప్పుడు ప్రెస్‌అకాడమీ చైర్మన్ లక్ష్యంగా «చేసుకుని ధర్నాలకు దిగటం సరికాదని టీయుడబ్ల్యూజే(హెచ్-143) రాష్ట్ర నాయకుడు పరశురాం అన్నారు. గురువారం సంగారెడ్డిలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణను లక్ష్యంగా చేసుకుని ధర్నాలకు దిగటాన్ని తప్పుబట్టారు. గతంలోని అకాడమీ చైర్మన్లు జర్నలిస్టుల సంక్షేమాన్ని విస్మరించారని ఆరోపించారు. కానీ, అల్లం నారాయణ జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. గతంలో అందజేసిన హెల్డ్కార్డులకు లక్ష రూపాయల వరకు మాత్రమే పరిమితి ఉండేదని, ప్రస్తుతం పరిమితి లేదని చెప్పారు. ఇళ్ల స్థలాలతో పాటు డబుల్‌బెడ్‌రూమ్‌లు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ సముఖత వ్యక్తం చేశారని, అది ప్రెస్ అకాడమీ చైర్మన్ నారాయణ ఘనత అని అన్నారు. ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ప్రెస్ అకాడమీకి రూ.10 కోట్ల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. పాత్రికేయుల పిల్లల విద్య కోసం రూ.10 లక్షల వరకు రుణ సౌకర్యం కల్పిస్తున్నట్లు వివరించారు. ఇలాంటి విషయాలు గమనించకుండా ప్రెస్ అకాడమీని నిర్వీర్యం చేసేలా ఐజీయూ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ధర్నాలు చేస్తామనటం సరికాదన్నారు. సమావేశంలో సంఘం నాయకులు సునీల్, మోహన్, సత్తార్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ కేసులు ఎత్తేయాలని జర్నలిస్టుల బైక్ ర్యాలీ
జర్నలిస్టులపై అక్రమంగా బనాయించిన పోలీస్ కేసును వెంటనే ఎత్తివేయాలంటు చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఆదివారం జర్నలిస్టులు నల్లబ్యాడ్జిలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. నారాయణఖేడ్ ఐన్యూస్ రిపోర్టర్ వాజిద్‌పై పెట్టిన పోలీస్‌లు పెట్టిన కేసును వెంటనే ఎత్తివేయాలంటు వారు డిమాండ్ చేశారు. చిన్నశంకరంపేట చౌరస్తా నుంచి తహశిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నశంకరంపేట ప్రెస్‌క్లబ్ (టీయూడబ్లుజే)అధ్యక్షుడు రాజాగౌడ్,సీఎస్జేయూ క్లబ్ అధ్యక్షుడు శ్వామ్, సీనియర్ జర్నలిస్టులు వెంకన్న, చంద్రంగౌడ్, వెంకట్‌రెడ్డి,యాదగిరి, క్రిష్ణాగౌడ్, నరేందర్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. -
కలంపై ఖాకీ కుట్ర
సాక్షి విలేకరి అక్రమ అరెస్ట్‌పై భగ్గుమన్న జర్నలిస్టులు జిల్లావ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు ముత్తారం విలేకరిపై కేసు ఎత్తివేయాలని డిమాండ్ టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా పోలీసుల అతిజోక్యంపై జర్నలిస్టు నేతల మండిపాటు టవర్‌సర్కిల్ టవర్‌సర్కిల్ : ముత్తారం మండల సాక్షి విలేకరి పొన్నం శ్రీనివాస్‌గౌడ్‌పై అక్రమ కేసు బనాయించడాన్ని నిరసిస్తూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే హెచ్-143), తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా సంఘం(టెమ్జు) ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. తప్పుడు కేసు బనాయించిన గోదావరిఖని ఏఎస్పీ విష్ణు ఎస్.వారియర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని 57 మండల కేంద్రాల్లోనూ విలేకరులు నిరసన తెలపడంతోపాటు తహసీల్దార్లు, ఆర్డీవోలు, పోలీసు అధికారులకు వినతిపత్రాలను సమర్పించారు. టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట గంటన్నరపాటు ధర్నా నిర్వహించిన అనంతరం కలెక్టర్ నీతూప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు. సాక్షి విలేకరిపై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయడంతోపాటు గోదావరిఖని ఏఎస్పీపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు పసునూరు మధు మాట్లాడుతూ... సాక్షి రిపోర్టర్‌పై అక్రమ కేసు బనాయించి, అరెస్టు చేయడంలో గోదావరిఖని ఏఎస్పీ అత్యుత్సాహం ప్రదర్శించారన్నారు. తనపై పెట్టిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పూర్తిగా కుట్రపూరితమని శ్రీనివాస్ వేడుకున్నా, అందుకు తగిన ఆధారాలను సమర్పించినా ఏఎస్పీ వినిపించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించారని అన్నారు. విలేకరి పోలీసుల తప్పిదాలను ఎత్తి చూపుతున్నారనే అక్కసుతో ఎస్టీ, ఎస్టీ కేసును అస్త్రంగా ఉపయోగించుకోవడం అప్రజాస్వామికమన్నారు. శ్రీనివాస్‌గౌడ్‌కు న్యాయం జరిగే వరకు జిల్లా జర్నలిస్టులు అండగా నిలువాలని కోరారు. కేసు పూర్వాపరాలను, ఏఎస్పీ వైఖరిని డీఐజీ మల్లారెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మ దృష్టికి తీసుకెళ్లడంతో ప్రెస్ అకాడమీ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి పూదరి వెంకటేశ్ మాట్లాడుతూతక్షణమే పోలీసు ఉన్నతాధికారులు స్పందించి కేసుపై సమగ్ర విచారణ జరపడంతోపాటు ఏకపక్షంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిపక్షంలో ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని యూనియన్ జిల్లా నాయకులు బోనాల తిరుమల్, జేరిపోతుల సంపత్, చిప్పరి వెంకట్రాజు హెచ్చరించారు. సాక్షి టీవీ జిల్లా కరస్పాండెంట్ విజేందర్‌రెడ్డి మాట్లాడుతూ... ఎటువంటి సరైన విచారణ జరుపకుండా కేసుపెట్టి, అరెస్టు చేయడాన్ని తప్పుబట్టారు. గతంలో ముత్తారంలోని హోటల్ యాజమాని మల్యాల రాజయ్య భూకబ్జాలపై శ్రీనివాస్‌గౌడ్ పలుమార్లు వార్తా కథనాలు రాశాడని, దానిని మనసులో పెట్టుకున్న రాజయ్య కక్షగట్టి తన వద్ద పనిచేసే మీనుగు రాములు చేత అక్రమ కేసు పెట్టించాడని అన్నారు. కేసుపై సమగ్ర విచారణ జరిపించి శ్రీనివాస్‌గౌడ్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలతో దద్దరిల్లిన పోలీస్ స్టేషన్లు... శ్రీనివాస్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా జిల్లావ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోని పోలీస్ స్టేషన్ల ముందు జర్నలిస్టులు, ప్రజా సంఘాల నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నాలు నిర్వహించారు. అనంతరం అక్రమ కేసు ఎత్తివేయాలని ఎస్‌హెచ్‌వోలతోపాటు స్థానిక తహసీల్దార్లు, ఆర్డీవోలకు వినతిపత్రాలు అందజేశారు. మంథనిలో పోలీసుల తీరును నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. -
వలసవాదులతో నిండిన టీఆర్ఎస్
టీయూడబ్ల్యూజే మీట్ ది ప్రెస్‌లో ఎల్.రమణ, కిషన్‌రెడ్డి ధ్వజం సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఇతర పార్టీల నుంచి చేరిన వలసవాదులతోనే నిండిపోయిం దని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. అధికార పార్టీకి అభ్యర్థులు లేక టీడీపీ సహా ఇతర పార్టీల నుంచి అప్రజాస్వామికంగా వలసలను ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్(టీయూడబ్ల్యూజే) హైదరాబాద్ లో శుక్రవారం నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో ఎల్.రమణ, కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఎంఐఎం తో టీఆర్ఎస్ కుమ్మక్కైందని, ఇరు పార్టీల రాజకీయ ప్రయోజనాల కోసం డివిజన్ల స్వరూపాన్ని ఇష్టారాజ్యంగా మార్చుకున్నారన్నారు. టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా అధికారమే పరమావధిగా రాజ్యాం గాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయన్నారు. పాతబస్తీని ఓవైసీ కుటుంబం, కొత్త పట్నాన్ని కేసీఆర్ కటుంబం పంచుకొన్నాయన్నారు. టీఆర్ఎస్ నేతలు జీహెచ్ఎంసీ నిధులను దారి మళ్లిస్తున్నారని, మిగులు బడ్జెట్, ధనిక రాష్ట్రం అంటున్నా హైదరాబాద్‌లో చేసిన అభివృద్ధి ఏమిటో కేటాయించిన నిధులెన్నో చెప్పాలన్నారు. రెండు పడక గదుల ఇళ్లు ఇచ్చినట్టు, వాటి ముందు ముగ్గులేసినట్టు రంగుల కలలను అరచేతిలో టీఆర్ఎస్ నేతలు చూపిస్తున్నారన్నారు. స్కైవేల ప్రచారం తప్ప నిధులు మంజూరు చేయలేదన్నారు. టీఆర్ఎస్, మజ్లిస్ కంటే తమ కూటమి ఎక్కువ సీట్లు సాధిస్తుందని, 100 సీట్ల లక్ష్యంతో వ్యూహాత్మకంగా పనిచేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటే హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. హైదరాబాద్ డిజిటైజేషన్‌ను పూర్తిచేసి స్మార్ట్ సిటీగా చేస్తే అవినీతి లేని నగరం అవుతుందన్నారు. సోనియాపై కేసు ఎందుకు పెట్టలేదు.. వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ మాజీ ఎంపీ రాజయ్య ఇంట్లో జరిగిన సంఘటనకు సంబంధించి ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై పోలీసులు కేసు ఎందుకు నమోదు చేయలేదని బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఆ కుటుంబాన్ని రాహుల్ గాంధీ ఎందుకు పరామర్శించలేదన్నారు. ఆత్మహత్యలపై కేసులు సూసైడ్‌నోట్ చుట్టూ తిరుగుతాయని, రోహిత్ విషయంలోనే కొత్త సంప్రదాయాన్ని అనుసురిస్తున్నారని ఆయన ఆరోపించారు. రోహిత్ లేఖలో కేంద్రం, దత్తాత్రేయ, బీజేపీ ప్రస్తావన లేదన్నారు. ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ ఉత్తరంపై ఉన్నతస్థాయి విచారణ జరిగితే వాస్తవాలు తేలిపోతాయన్నారు. ఐజేయూ మాజీ సెక్రెటరీ జనరల్ కె.శ్రీనివాస్‌రెడ్డి, సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, ప్రెస్ కౌన్సిల్ సభ్యుడు కె.అమర్నాథ్, ఐజేయూ నేతలు నరేందర్‌రెడ్డి, కె.విరాహత్ అలీ, యాదగిరి, కోటిరెడ్డి పాల్గొన్నారు. -
ప్రెస్‌క్లబ్ ఉత్సవాలకు టీయూడబ్ల్యూజే దూరం
జర్నలిస్టుల ఐక్యతను దెబ్బతీసే విధంగా ప్రెస్ క్లబ్ కార్యవర్గంలో ఉన్న కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని.. ఈ తీరును జీర్జించుకోలేక ప్రెస్ క్లబ్ స్వర్ణోత్సవాలకు దూరంగా ఉంటున్నట్లు టీయూడబ్ల్యూ జే నేతలు తెలిపారు. శనివారం విలేకరులతో మాట్లాడిన ఐజేయూ నేతలు కే.శ్రీనివాస్ రెడ్డి, దేవుల పల్లి అమర్ బషీర్ బాగ్ లో ఉన్న ప్రెస్ క్లబ్ కు సోమాజీ గూడలో ఉన్న ప్రభుత్వ భవనాన్ని కేటాయిస్తూ.. 1995లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారని.. యూనియన్ వారసత్వంగా ఉన్న ప్రెస్ క్లబ్ రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటైన టీయూడబ్ల్యూ జేకి అనుబంధంగానే కొనసాగాల్సి ఉంటుందని అన్నారు. కార్యవర్గంలోని కొందరు వ్యక్తులు జర్నలిస్టుల మధ్య చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. చట్టబద్దంగా ప్రెస్ క్లబ్ కు సంక్రమించిన అధికారాలను కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రెస్‌క్లబ్ పాలకమండలి పదవీకాలం ముగియగా, స్వర్ణోత్సవాల పేరుతో మూడు రోజుల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారన్నారు. 50 సంవత్సరాలు ప్రెస్‌క్లబ్‌ను తీర్చిదిద్దిన వారిని కనీసం సంప్రదించకుండా, ప్రెస్‌క్లబ్‌కు మాతృసంస్థగా ఉన్న యూనియన్ నేతలను పరిగణలోకి తీసుకోకుండా స్వర్ణోత్సవాలు ఎలా జరుపుతారని ప్రశ్నించారు. 1965 మే 25న ఏర్పాటైన ప్రెస్‌క్లబ్‌కు ఆరునెలల తరువాత స్వర్ణోత్సవాలు నిర్వహించ డాన్ని తప్పుపట్టారు. ఈ సమావేశంలో ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు అమరనాథ్, ఐజేయూ కార్యదర్శి నరేందర్ రెడ్డి, టీయూడబ్ల్యుజె ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ, హెచ్‌యూజే అధ్యక్షుడు కోటిరెడ్డి పాల్గొన్నారు. -
ప్రెస్‌క్లబ్ ఉత్సవాలకు టీయూడబ్ల్యూజే దూరం
-
చెరువును దత్తత తీసుకున్న టీయూడబ్ల్యుజే
మెదక్: టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమంలో రాజకీయ నాయకులు, అధికారులు పాలు పంచుకుంటున్నారు. తాజాగా గురువారం మెదక్ జిల్లా సంగారెడ్డి మండలంలోని కవలంపేట చెరువును టీయూడబ్ల్యుజే (తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్) దత్తత తీసుకుంది. ఈ చెరువులో పూడికతీత పనులను గురువారం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చింతా ప్రభాకర్, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్బొజ్జలు పాల్గొన్నారు. -
రూ.5 లక్షల బీమాపై జర్నలిస్టు నేతల హర్షం
సాక్షి, హైదరాబాద్: వర్కింగ్ జర్నలిస్టులకు మేడే కానుకగా ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 5 లక్షలు ప్రమాద బీమా ప్రకటించడంపై తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(టీయూడబ్ల్యూజే) హర్షం వ్యక్తం చేసింది. దేశంలో మరెక్కడా ఇలాంటి పథకం లేదని యూనియన్ నాయకులు తెలిపారు. సంపాదకుల కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు, అక్రెడిటేషన్ కార్డులను కూడా వెంటనే జారీ చేయాలని జర్నలిస్ట్ సంఘాల నేతలు దేవులపల్లి అమర్, కె. శ్రీనివాస్‌రెడ్డి, అమర్నాథ్, వై.నరేందర్‌రెడ్డి, దాసరి కృష్ణారెడ్డి, నగునూరి శేఖర్, కె. విరాహత్ అలీ, కోటిరెడ్డి, వెలిజాల చంద్రశేఖర్‌లు ప్రభుత్వాన్ని కోరారు. -
జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు
⇒ రూ. 2 లక్షల వరకు ఆరోగ్య బీమా.. అందరికీ అక్రిడిటేషన్ కార్డులు ⇒ పాత్రికేయ వృత్తి శిక్షణ కోసం యూనివర్శిటీ ఏర్పాటు ⇒ టీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభలో మహమూద్ అలీ, హరీశ్‌రావు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కీలకప్రాత పోషించిన జర్నలిస్టుల రక్షణ, సంక్షేమం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, హెల్త్‌కార్డులు, కేజీ టూ పీజీ ఉచిత విద్య పథకాలను జర్నలిస్టు కుటుంబాలకు సైతం వర్తింపజేస్తామన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు, విద్యార్థులతో పాటు జర్నలిస్టులు ముఖ్యపాత్ర పోషిం చారని నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు ప్రశంసించారు. జర్నలిస్టులకు మెరుగైన ప్యాకేజీని ప్రకటించేందుకు సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తుండటం వల్లే కొంత ఆలస్యమవుతోందని చెప్పారు. ఆదివారం లళిత కళాతోరణంలో జరిగిన తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు(టీయూడబ్ల్యూజే) ప్రథమ మహాసభలో మంత్రులిద్దరూ పాల్గొని జర్నలిస్టుల సమస్యలపై పలు హామీలిచ్చారు. మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ జర్నలిస్టులకు రూ. 2 లక్షల వరకు ఆరోగ్య బీమా సదుపాయం కల్పించడంతో పాటు రూ. 4 లక్షలతో డబుల్ బెడ్ రూమ్ గృహాలను నిర్మించి ఇస్తామన్నారు. గ్రామాల్లో వ్యక్తిగత గృహాలు, పట్టణాల్లో ఒక అంతస్తు(జీ+1) పద్ధతిలో ఇళ్లను నిర్మించి ఇస్తామన్నారు. ప్రతీ జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు మంజూరు చేస్తామన్నారు. వృత్తిలో కొనసాగుతూనే నైపుణ్యాల పెంపుదల, ఉన్నత విద్య అభ్యసించాలనుకునే జర్నలిస్టుల కోసం విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాలనే ఆలోచన ఉందన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల వేజ్ బోర్డు అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కార్మిక శాఖ చర్యలు తీసుకోవాలని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, సీపీఐఎల్పీ నేత రవీంద్రకుమార్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. జర్నలిస్టులు వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడమే ఉద్యోగ భద్రతకు అసలు పరిష్కారమని ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి అన్నారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్‌కార్డులు తదితర అంశాలపై తన అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందన్నారు. జర్నలిస్టులందరికీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వైద్య సదుపాయాలతో హెల్త్ కార్డులు, రాష్ట్ర, జిల్లా స్థాయి కేటగిరీలుగా అక్రిడిటేషన్ కార్డులను మంజూరు చేయాలని సిఫారసు చేశామన్నారు. జర్నలిస్టుల వేజ్ బోర్డు సిఫారసులు అమలు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కార్మిక శాఖ చర్యలు తీసుకోవాలని ఐజేయూ అధ్యక్షుడు ఎస్ఎన్ సిన్హా కోరారు. ఈ కార్యక్రమంలో ఐజేయూ నేతలు దేవులపల్లి అమర్, కె.శ్రీనివాసరెడ్డి, ప్రెస్ కౌన్సిల్ స భ్యులు అమర్నాథ్, టీయూడబ్ల్యూజే అధ్యక్ష, కార్యదర్శులు నగనూరి శేఖర్, కె.విరాహత్ అలీ, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు నల్లి ధర్మారావు, టీఎన్జీవోల అధ్యక్షుడు కె.రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ మహాసభకు తెలంగాణ జిల్లాల నుంచి జర్నలిస్టులు తరలిరావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. నిజాం నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ వార్తలు రాసి హత్యకు గురైన జర్నలిస్టు షోయబుల్లాఖాన్ పేరును సభాప్రాంగణానికి పెట్టారు. సభ ప్రారంభానికి ముందు తెలంగాణ అమరవీరులకు సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. కాగా, జర్నలిస్టుల సాక్షిగా ఈ సభలో టీడీపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటలయుద్ధం సాగింది. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు సంకెళ్లు వేస్తోందని, తెలంగాణ కోసం పోరాడిన జర్నలిస్టులు తమ హక్కుల కోసం ప్రభుత్వం ముందు చేతులు చాచి అడుక్కోవాల్సి రావడం బాధాకరమని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి ఆరోపించారు. దీనిపై శాసనసభ అంచనాల కమిటీ చెర్మైన్ సోలిపేట రామలింగారెడ్డితో పాటు తెలంగాణ రచయితల ఫోరం అధ్యక్షులు నందిని సిధారెడ్డి తీవ్ర స్థాయిలో ప్రత్యారోపణలు చేశారు. -
జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం
- మంత్రి తన్నీరు హరీష్‌రావు - టీయూడబ్ల్యూజే జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక సంగారెడ్డి రూరల్: జర్నలిస్టులందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. సంగారెడ్డి పట్టణ పరిధిలోని హైదరాబాద్ ఫంక్షన్ హాల్లో బుధవారం ‘తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్’ జిల్లా మహాసభ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ప్రత్యేక ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైందన్నారు. ఎన్నో ఒత్తిళ్లను అధిగమించి తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్ట్‌లు భాగస్వాములయ్యారని కొని యాడారు. జర్నలిస్ట్‌ల సమస్యల పరి ష్కారం, డిమాండ్ల సాధన, హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ.. జర్నలిస్ట్‌లు కొవ్వొత్తుల్లాంటి వారని తాము కరిగిపోతూ సమాజానికి వెలుగునిచ్చేవారని తెలిపా రు. తమపై యాజమాన్యాల ఒత్తిడి ఉన్నప్పటికీ ఉద్యమ తీరును తెలియజేసేందుకు శతవిధాలా ప్రయత్నించారని పేర్కొన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలన్నింటిలో జర్నలిస్ట్‌లకు స్థానం కల్పిం చేందుకు కృషిచేస్తామన్నారు. అక్రెడిటేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి అందేలా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. జర్నలిస్ట్‌లు రాసే వార్తలు సమాజంలో మార్పు తెచ్చేలా ఉండాలని, ప్రపంచాన్ని మార్చే శక్తి కలానికి మాత్రమే ఉందని తెలిపారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడు తూ.. ఉద్యమ పోరాటంలో ముందుండి జర్నలిస్ట్‌లు పోరాటంలో నెత్తురు చిందించారన్నారు. 2001లో టీయూడ బ్ల్యూ జేను స్థాపించామని, తమ యూనియన్‌పై ఇతర యూనియన్ కుట్రలు కుతంత్రాలు చేస్తే మర్యాద దక్కదని హెచ్చరించారు. జర్నలిస్టుల సమస్యలపై పోరా డి పరిష్కరించాలని సూచించారు. హైదరాబాద్‌పై గవర్నర్ గిరీని వ్యతిరేకిస్తూ తమ సంఘం ఆధ్వర్యంలో వంద చోట్ల ధర్నాలు చేశామని గుర్తుచేశారు. జర్నలిస్ట్ లందరికి ఇళ్ల స్థలాలు, క్యాష్ లెస్ హెల్త్ కార్డులు అందజేసే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యమంలో భాగస్వామ్యులైన జర్నలిస్ట్‌లు భవిష్యత్‌లో తెలంగాణ పున ర్ నిర్మాణంలో కూడా పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. పాత్రికేయుల అభివృద్ధికి సీఎం కృత నిశ్చయంతో ఉన్నారని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తెలిపారు. జర్నలిస్టులకు ఎల్లప్పుడు తమ యూనియన్ అండగా ఉంటుందని టీఎన్జీఓల రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్ తెలిపారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచే సే జర్నలిస్ట్‌ల సంక్షేమానికి ప్రభుత్వం కృషిచేయాలన్నారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లె రవి, కార్యదర్శి అబ్దుల్లా, భిక్షపతి, జానకీరామ్, సాగర్, యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజు, జర్నలిస్ట్‌లు పాల్గొన్నారు. -
ఆ చానళ్ల ప్రసారాలను పునరుద్ధరించాలి
ఐజేయూ, టీయూడబ్ల్యూజే టీవీ9 కార్యక్రమంపై ఖండన సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానళ్ల ప్రసారాలను నిలిపివేస్తూ తెలంగాణ ఎంఎస్ఓల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని ఇండియన్ జర్నలిస్టుల యూనియన్(ఐజేయూ), తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (టీయూడబ్ల్యూజే) ఖండించాయి. ఈ నిర్ణయం భావ ప్రకటనా స్వేచ్ఛకు, సమాచారాన్ని తెలుసుకునే హక్కుకు విఘాతం కలిగిస్తున్నదని ఐజేయూ ప్రధాన కార్యదర్శి దేవులపల్లి అమర్, టీయూడబ్ల్యూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్. శేఖర్, విరాహత్ అలీలు సోమవారం సంయుక్త ప్రకటనలో తెలిపారు. టీవీ చానళ్లలో ప్రసార నాణ్యత, మంచీ చెడ్డలను నిర్ణయించే అధికారాలను సొంతం చేసుకునే ప్రయత్నాలను ఎంఎస్ఓలు విరమించుకొని, తక్షణమే ప్రసారాలను పునరుద్ధరించాలని కోరారు. ప్రజాప్రతినిధుల పట్ల టీవీ-9 ప్రసారం చేసిన కార్యక్రమాన్ని ఐజేయూ, టీయూడబ్ల్యూజే ఖండిస్తున్నాయని పేర్కొన్నారు. -
పోలవరం.. భూకంప ప్రాంతం
భారీ ప్రాజెక్టు వల్ల విపత్తులొస్తే నష్టం సీమాంధ్ర ప్రజలకే.. టీయూడబ్ల్యూజే ఆవిర్భావ సభలో కేసీఆర్ ముంపు ప్రాంతాల్లోని గిరిజనుల సంక్షేమానికి సీమాంధ్ర సర్కారుతో చర్చిస్తా తెలంగాణలో జర్నలిస్టులకు పక్కాఇళ్లు, అక్రిడేషన్లు, బస్‌పాసులు ఇస్తాం ఉద్యమకాలంలో జర్నలిస్టులపై పెట్టిన కేసులు ఎత్తివేస్తామని హామీ సాక్షి,హైదరాబాద్: దేశంలో అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో పోలవరం ఒకటని టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. విద్వేషంతోనో, ఊహించో తాను ఈ మాట చెప్పడంలేదని, భూకంపాలు వచ్చే ప్రాంతాలపై కేంద్రం రూపొందించిన జాబితాలో పోలవరం ప్రాంతమూ ఉందన్నారు. భారీప్రాజెక్టు నిర్మాణం వల్ల భవిష్యత్తులో ఏవైనా విపత్తులు సంభవిస్తే అందరికన్నా ఎక్కువ నష్ట పోయేది సీమాంధ్ర ప్రజలేనని చెప్పారు. సీమాంధ్ర రైతులు, ప్రజలకు తాము వ్యతి రేకం కాదన్నారు. గోదావరి మిగులు జలాలు సీమాంధ్ర ప్రజలు వాడుకోవాల్సిందేనని చెప్పారు. పోలవరం ముంపుప్రాంతాల్లోని గిరిజనుల సంక్షేమం, సంరక్షణ కోసం సీమాంధ్రలో ఏర్పడబోయే ప్రభుత్వంతో చర్చించి, వారికి అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) ఆవిర్భావ సభ ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగింది. టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు అల్లం నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. టీయూడబ్ల్యూజే లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు ఎంతో కీలకపాత్ర పోషించారని చెప్పారు. జర్నలిస్టు మిత్రులంతా బలహీనవర్గాల జాబితా కిందకే వస్తారన్నారు. మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వారందరినీ జర్నలిస్టులుగా గుర్తిస్తామని, వారికి ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇస్తామని, పక్కాఇళ్లు నిర్మిస్తామని ప్రకటించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు, బస్‌పాసులు ఇప్పిస్తామన్నారు. జర్నలిస్టులకు రెండు బెడ్ రూమ్‌లు, ఒక హాలుతో కూడిన ఇంటిని నిర్మించి ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఉద్యమ సమయంలో జర్నలిస్టులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తామని చెప్పారు. తెలంగాణ జర్నలిస్టుల సంఘానికి హైదరాబాద్‌లో అన్ని హంగులతో అధునాతన భవనాన్ని నిర్మిస్తామన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి మినహా తెలంగాణలోని మిగిలిన జిల్లాలు నేటికీ వెనుకబడే ఉన్నాయని తెలిపారు. కేంద్రం ప్రకటించిన ఐటీఐఆర్‌ను సమర్థంగా అభివృద్ధిచేస్తే హైదరాబాద్ పరిధి, ఖ్యాతి మరింత విస్తరిస్తాయని, వ చ్చే ఇరువై ఏళ్లలో 50 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. కొన్ని మీడియా సంస్థలు ఇంకా వాటి ధోరణి మార్చుకోలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో హైదరాబాద్‌లోని పరిశ్రమలన్నీ సీమాంధ్రకు తరలిపోయే అవకాశం ఉందంటూ కనీసం బిల్లు పూర్తిగా చదవకుండానే ఇష్టం వచ్చినట్లు కథనాలు వండివార్చుతున్నాయ ని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం సీమాంధ్రకు ఇచ్చిన రాయితీలు తెలంగాణకు కూడా వర్తిస్తాయని తెలిపారు. తెలంగాణ కోసం ఎన్నో అవమానాలు భరించానని, ఇక ఆంక్షలు లేని తెలంగాణ కోసం పోరాడతానని చెప్పారు. ఇకపై ఢిల్లీలో వచ్చేవన్నీ సంకీర్ణ ప్రభుత్వాలేనన్నారు. వచ్చే ఎన్నికల్లో 17ఎంపీ సీట్లు సాధించి కేంద్రంనుంచి మరిన్ని నిధులు తెప్పించుకుని అభివృద్ధి చేసుకోవచ్చని చెప్పారు. అధికారం కోసం ప్రత్యేక రాష్ట్రం తేలేదు: జానారెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వెనుక అనేక మంది త్యాగాలు, పోరాటాలు, కష్టాలు, నష్టాలు ఉన్నాయని మాజీమంత్రి కె.జానారెడ్డి చెప్పారు. అధికారం కోసమే తాము ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నట్లు సీమాంధ్రకు చెందిన కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇది సరైనది కాదని అన్నారు. జర్నలిస్టులు ఉద్యమంలో చూపిన తెగువే రాష్ట్ర పునర్నిర్మాణంలోనూ చూపాలని ఆయన కోరారు. ఉద్యమకారుడు విచ్ఛిన్నకారుడెలా అవుతాడు?: అల్లం ఏపీయూడబ్ల్యూజేకు చెందిన కొందరు పాత్రికేయులు తనను విచ్ఛిన్నకారునిగా ప్రచారం చేస్తున్నారని, తెలంగాణ ఉద్యమాన్ని ఏకం చేసిన ఉద్యమకారుడు విచ్ఛిన్నకారుడెలా అవుతాడని టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు అల్లం నారాయణ ప్రశ్నించారు. ఏ వ్యక్తికో, సంఘానికో తాను వ్యతిరేకం కాదని, సంఘాలను చీల్చాల్సిన అవసరం తెలంగాణ పాత్రికేయులకు లేదని చెప్పారు. తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడేందుకే టీయూడబ్ల్యూజేను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో టీ-జేఏసీ చైర్మన్ కోదండరామ్, ఎంపీలు కేశవరావు, రాపోలు ఆనందభాస్కర్, ప్రజాగాయకుడు గద్దర్, సీపీఐ కార్యదర్శి నారాయణ, బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి, హెచ్ఎంటీవీ ఎడిటర్ రామచంద్రమూర్తి, ఎడిటర్ టంకసాల అశోక్, ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్, సీనియర్ పాత్రికేయుడు పాశం యాదగిరి, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు దేవీప్రసాద్, విఠల్, శ్రీనివాస్‌గౌడ్, కృష్ణయాదవ్, కళాకారులు విమలక్క, రసమయి బాలకిషన్, గోరంటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.