Published
Mon, Aug 22 2016 11:50 PM
| Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
రాంనగర్: ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పని చేసే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు పి. ప్రభాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గార్లపాటి కృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆసంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటినా నేటికి జర్నలిస్టుల సమస్య ఒక్కటి కూడా పరిష్కారం కాలేదన్నారు. ప్రభుత్వం కొంత మంది జర్నలిస్టులకు హెల్త్ కార్డులు జారీ చేసినా ఏ ఒక్కరికి ప్రయోజనం లేదన్నారు. ఇళ్లు, ఇళ్ల స్థలాల కేటాయింపులు మాటలకే పరిమితమైందని విమర్శించారు. కార్యక్రమంలో జర్నలిస్టులు కోటగిరి ౖ§ð వాదీనం, చలసాని శ్రీనివాసరావు, పులిమామిడి మహేందర్‌రెడ్డి, దాసు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.