ramnagar
-
ఆటిట్యూడ్ స్టార్ 'చంద్రహాస్' సినిమా ఫస్ట్ లుక్
ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా నటిస్తున్న సినిమా 'రామ్ నగర్ బన్నీ'. విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, పొడకండ ప్రభాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్‌లో 'రామ్ నగర్ బన్నీ' సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ గ్రాండ్ ఈవెంట్ హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి తన వంతుగా హీరో చంద్రహాస్ ఆర్థిక సహాయాన్ని ప్రకటించి ఆ మొత్తాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి అందజేశారు .తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ..'ప్రభాకర్ నాకు సుపరిచితులు. ఆయన రామ్ నగర్ బన్నీ సినిమా గురించి నాకు చెప్పారు. ఆయన పిలుపుమేరకు ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంది. ఇందులో హీరోగా నటిస్తున్న చంద్రహాస్ మా అమ్మాయి క్లాస్ మేట్. తెలంగాణలో వరద బాధితులను ఆదుకునేందుకు చంద్రహాస్ తన వంతు సహాయాన్ని అందించడం సంతోషంగా ఉంది. మొదటి సినిమాకు హీరోలు అంతగా ఆకట్టుకోరు. కానీ చంద్రహాస్ బాగున్నాడు. ఫస్ట్ లుక్, గ్లింప్స్ తో ఆకట్టుకున్నాడు. అతన్ని రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నా.' అని స్పీకర్ తెలిపారు.'ఆటిట్యూడ్ స్టార్' చంద్రహాస్ మాట్లాడుతూ .. మా "రామ్ నగర్ బన్నీ" ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. రెండేళ్ల క్రితం ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఆటిట్యూడ్ చూపిస్తున్నాడు అని కామెంట్స్ చేశారు. నేను సినిమాల్లో ఒకలా, బయట మరొకలా బిహేవ్ చేయను. నా మనసులో ఏముందో అదే మాట్లాడుతుంటా. అది కొందరికి నచ్చలేదు. ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయాలనే కోరికతో హీరోగా మారాను. అందుకు మా అమ్మా నాన్నలు ఎంతో సపోర్ట్ చేశారు. మా నాన్న ప్రభాకర్ పేరు నిలబెట్టేలా కష్టపడతాను. నా ప్రతిభను నా సినిమాల రిజల్ట్ ద్వారానే తెలియజేయాలని భావిస్తున్నా. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నా. వాటిలో ఫస్ట్ మూవీగా రామ్ నగర్ బన్నీ మీ ముందుకు రాబోతోంది. ఈ సినిమా కలెక్షన్స్ లో 10 శాతం వరద బాధితుల సహాయార్థం అందిస్తాం.' అని ఆయన తెలిపారు. -
HYD: రాంనగర్ కూల్చివేతలు..‘హైడ్రా’ కమిషనర్ స్పందన ఇదే..
సాక్షి,హైదరాబాద్: రాజధాని హైదరాబాద్‌లోని రాంనగర్ మణెమ్మ గల్లీలో కూల్చివేతలపై హైడ్రా స్పందించింది. మణెమ్మ గల్లీలోని రోడ్డు ను ఆక్రమించి సర్వే నెంబర్ 20,21 ను కళ్ళు కాంపౌండ్, గ్రౌండ్‌ఫ్లోర్ ప్లస్ రెండు అంతస్తులు కట్టారని రికార్డులు పరిశీలించి వాటిని కూల్చివేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అక్రమ నిర్మాణాల కారణంగా మణెమ్మ గల్లీలో ఉండే వారు నిరంతరం డ్రైనేజీ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాంనగర్ సర్వే నెంబర్ 20,21లో పలు అక్రమ నిర్మాణాలను శుక్రవారం(ఆగస్టు30)న కూల్చివేశామని రంగనాథ్ తెలిపారు. -
హైడ్రా దూకుడుతో ఆందోళనలో ప్రజలు
-
రాంనగర్లో హైడ్రా కూల్చివేతలు.. ఘర్షణ వాతావరణం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆస్తులు, చెరువుల పరిరక్షణకు హైడ్రా చేపట్టిన చర్యలు అక్రమార్కులకు వణుకు పుట్టిస్తోంది. రాంనగర్ చౌరస్తాలోని మనమ్మ బస్తీలో నాలాపై అక్రమంగా నిర్మించిన ఇళ్లను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ఇవాళ(శుక్రవారం) ఉదయం నుంచే కూల్చివేతలు మొదలయ్యాయి. ఆక్రమణకు గురైన చెరువులు, కాలువలు, పార్కుల గురించి హైడ్రాకు ప్రతిరోజూ కనీసం 60 నుంచి 70 ఫిర్యాదులు అందుతున్నాయి. రాంనగర్ లోని మల్లెమ్మ గల్లీలోని 1-9-189 నెంబర్ గల స్థలం తమదని విక్రం యాదవ్ పేర్కొనగా, ఈ స్థలంలో అక్రమంగా కల్లు కాంపౌండ్ కొనసాగుతుందని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ అక్రమ నిర్మాణాలపై రెండు రోజుల క్రితం హైడ్రా కమిషనర్ కు స్థానికుల ఫిర్యాదులు అందాయి. దీంతో హైడ్రా కమిషనర్ ఎవీ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఆక్రమణలపై నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అక్రమ కట్టడాలని తేలడంతో ఈ రోజు కూల్చివేతలు మొదలయ్యాయి. నాలాను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చేస్తున్నారు. హైడ్రా కమీషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించిన 24 గంటలకే చర్యలు ప్రారంభించింది. కూల్చివేతలను భవన యజమానులు అడ్డుకుంటున్నారు. స్థానిక పోలీసులు వారిని నిలువరిస్తున్నారు. ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీస్ బలగాలు భారీగా మొహరించాయి. -
మృగశిర కార్తె ఎఫెక్ట్ : కిక్కిరిసిన రాంనగర్ చేపల మార్కెట్ (ఫొటోలు)
-
రామ్ నగర్ అఖిల్ పహిల్వాన్ ఆధ్వర్యంలో వ్యభిచారం
-
హైదరాబాద్ అబిడ్స్ లో వ్యభిచారం ముఠా అరెస్ట్
-
వ్యభిచార కేసులో అఖిల్ పహిల్వాన్ అరెస్ట్
-
అబిడ్స్ వ్యభిచారం కేసు.. రాంనగర్ అఖిల్ పహిల్వాన్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచారం ముఠా గుట్టు రట్టైంది. ఓ హోటల్లో వ్యభిచారం చేస్తూ ముఠా పట్టుబడింది. రామ్‌నగర్‌కు చెందిన అఖిల్ పహిల్వాన్ ఆధ్వర్యంలో ఈ దందా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. టాస్క్‌ఫోర్స్ పోలీసుల తనిఖీల్లో 16 మంది అమ్మాయిలు, ఆరుగురు కస్టమర్లు, ఇద్దరు ఆర్గనైజర్లు పట్టుబడ్డారు. వారి నుంచి 22 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి ఉద్యోగాల పేరుతో బలవంతంగా వ్యభిచారం చేస్తున్నట్లు సమాచారం. రామ్‌నగర్ అఖిల్ పహల్వాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. రాంనగర్ అఖిల్ వ్యభిచారం కేసు పోలీసుల దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. అఖిలేష్ పూర్వ ట్రాక్ రికార్డ్లను పోలీసులు బయటికి తీయగా.. అతడి మొబైల్లో జాతీయ, అంతర్జాతీయ వ్యభిచారం ముఠా నిర్వాహకుల ఫోన్ నెంబర్లు ఉన్నట్లు గుర్తించారు. అఖిల్ రోజుకి 20 నుంచి 30 కాల్స్ నిర్వాహకులతో మాట్లాడుతున్నట్లు తేలింది. పశ్చిమబెంగాల్ నుంచి 16 మంది అమ్మాయిలను ఫార్చ్యూన్ హోటల్లో 25 రోజులుగా వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. ఎలాంటి ప్రూఫ్స్ ఇవ్వకుండా 25 రోజులుగా అమ్మాయిలను హోటల్లో ఉంచిన అఖిల్.. ఈ 25 గదుల్లో 16 రూములను వ్యభిచారం కోసం ఉపయోగిస్తున్నట్లు విచారణలో తేలింది. సినీ ప్రముఖులకు అమ్మాయిలను సరాఫరా చేస్తున్నట్లు అఖిల్‌పై పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో సలువడి అఖిలేష్, పక్కల రఘుపతి, అభిషేక్ బాటి, కేశవ్ వ్యాస్, అబ్దుల్ ఖలీద్, సంతోష్ అరెస్ట్ చేసి లోతుగా విచారిస్తున్నారు. చదవండి: పన్నూ హత్యకు కుట్ర.. నిఖిల్ గుప్తా అప్పగింతకు కోర్టు ఓకే -
నేడు అయోధ్యలో 51 ఘాట్లలో 24 లక్షల దీప కాంతులు!
అయోధ్యలో దీపావళిని మరింత దేదీప్యమానం చేసేందుకు ఈసారి కూడా రామనగరిని అందంగా ముస్తాబు చేస్తున్నారు. అయోధ్యలోని 51 ఘాట్లలో నవంబరు 11న(నేడు) 24 లక్షల దీపాలు వెలిగించి, సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత 6 సంవత్సరాలుగా అయోధ్యలో జరుగుతున్న దీపోత్సవం ప్రపంచ రికార్డులను సృష్టిస్తోంది. ఈ సంప్రదాయం ఈసారి కూడా కొనసాగనుంది. దీపావళి సందర్భంగా అయోధ్యలోని సరయూ నది ఒడ్డున లేజర్ షో ద్వారా శ్రీరాముని జీవిత సంగ్రహావలోకనాన్ని ప్రదర్శించనున్నారు. మనదేశానికి చెందిన కళాకారులతో పాటు రష్యా, శ్రీలంక, సింగపూర్, నేపాల్‌కు చెందిన కళాకారులు కూడా ఈ దీపోత్సవ్‌లో రామలీలను ప్రదర్శించనున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా దీపావళి నాడు అయోధ్యలో త్రేతాయుగం కళ్లకు కట్టినట్లు చూపేందుకు కళాకారులు సన్నద్ధమవుతున్నారు. రామ మందిర నిర్మాణం పూర్తవుతున్న తరుణంలో ఈసారి అయోధ్యలో దీపావళి వేడుకలు అంబరాన్ని అంటనున్నాయి. ఈసారి యూపీతో పాటు పలు రాష్ట్రాల సంస్కృతులను ప్రదర్శనల్లో చూపనున్నారు. ఇప్పటికే అయోధ్యానగరి దీప కాంతులతో మెరిసిపోతోంది. రోడ్లు, ఇళ్లు, వీధులు జనాలతో రద్దీగా మారిపోయాయి. కాగా అయోధ్యలో జనవరి 22న రామాలయంలో రాముని విగ్రహ ప్రతిష్ఠ జరగనుంది. ఇందుకోసం ఇప్పటినుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది కూడా చదవండి: ‘సరి- బేసి’తో ఎంత ప్రయోజనం? గతంలో ఏం తేలింది? #WATCH | Ayodhya is all set to hold a grand Deeptosav on the eve of Diwali with over 24 lakh diyas at 51 ghats set to illuminate the city pic.twitter.com/p4cEjJQiCd — ANI (@ANI) November 11, 2023 -
గాయత్రి ఇల్లు కబ్జాకు కుటుంబీకుల యత్నం
గచ్చిబౌలి: సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతిపట్ల అమానుషంగా ప్రవర్తించిన గాయత్రి ఇల్లును కబ్జా చేయడానికి ఆమె కుటుంబీకులు యత్నించారు. ఆమె భర్త శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు తల్లి కృష్ణవేణి, సోదరి సౌజన్యసహా మరికొందరిపై ఆదివారం కేసు నమోదు చేశారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న స్థిరాస్తులకు సంబంధించి గాయత్రికి, ఆమె తల్లి కృష్ణవేణి, సోదరి సౌజన్య మధ్య కొన్నేళ్లుగా వివాదాలు నడుస్తున్నాయి. వీటిలో కొన్ని ఆస్తులకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఒకరి పేరిట ఉండగా, పొజిషన్లో వేరొకరు ఉన్నారు. యువతిపై లైంగిక దాడి ఘటనలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం గాయత్రిసహా ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ సైతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయి ఉంటాడని భావించిన కుటుంబసభ్యులు ఆదివారం మధ్యాహ్నం తల్లి, సోదరి, సోదరుడు ప్రదీప్ రాజు, సమీప బంధువులు మల్లికార్జున్, అఖిల్ తదితరులు గాయత్రి ఇంటి వద్దకు వచ్చారు. ఆ సమయంలో వాచ్‌మన్ గేటుకు తాళం వేయగా అతడిపై దాడి చేసి తాళం పగులకొట్టారు. కృష్ణవేణి, సౌజన్య లోపలికి వెళ్లగా, మిగిలినవారు గేటు వద్దే ఉన్నారు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న శ్రీకాంత్‌ను అక్కడి నుంచి వెళ్లిపోవాలని బెదిరించారు. దీంతో ఆయన ‘డయల్–100’కు ఫోన్‌కాల్ చేయడంతో గచ్చిబౌలి ఠాణాకు చెందిన మహిళా ఎస్సై, కానిస్టేబుళ్లు గాయత్రి ఇంటి వద్దకు చేరుకుని అక్కడ ఉన్నవారిని బయటకు పంపేశారు. అద్దెకున్నవారికి బెదిరింపులు గాయత్రి నుంచి ఇల్లు అద్దెకు తీసుకున్న హేమంత్ వద్దకు ఈ ఏడాది మార్చి 30న సౌజన్య వెళ్లారు. ఆ ఇల్లు తనదని వెంటనే ఖాళీ చేయాలని హేమంత్‌ను బెదిరించి కరెంట్ కనెక్షన్ తొలగించడంతో ఆమెపై కేసు నమోదైంది. గాయత్రి తన ఇంటికి సమీపంలో ఉన్న కొన్ని దుకాణాలను అద్దెకు ఇవ్వగా, వీటిల్లో వ్యాపారాలు చేసుకుంటున్న అమిత్‌సింగ్, జేమ్స్, పాండు, మధుసూదన్ల వద్దకు సౌజన్య వెళ్లి హంగామా చేసింది. వారి సామాన్లను పగులకొట్టడంతోపాటు సూసైడ్ నోట్లో వారి పేర్లు రాసి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగడంతో ఆమెపై మరో కేసు నమోదైంది. (చదవండి: సినిమా స్టోరీని తలపిస్తున్న గచ్చిబౌలి గాయత్రి కేసు.. ట్విస్టులే ట్విస్టులు) -
హైదరాబాద్: చికెన్ బిర్యానీలో బల్లి.. కంగుతిన్న కార్పొరేటర్
-
సన్‌రైజర్స్ జట్టులో హైదరాబాదీ
సాక్షి, ముషీరాబాద్: లక్షలాది మంది హైదరాబాద్ క్రికెట్ అభిమానుల ఆకాంక్షలను మూటగట్టుకొని ఐపీఎల్లోఆడేందుకు శుక్రవారం (ఈ నెల 21న)బయలుదేరి వెళ్తున్నాడు రాంనగర్ కుర్రోడు భావనక సందీప్. ఐపీఎల్ మ్యాచ్‌లు సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇటీవల జరిగిన వేలంపాటలో సందీప్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు దక్కించుకుంది. హైదరాబాద్ నుంచి మొదట ముంబై వెళ్లి ఈ నెల 23న మిగతా సన్‌రైజర్స్ జట్టుసభ్యులతో కలిసి యూఏఈకి ప్రత్యేక చాపర్‌లో వెళ్లనున్నాడు. యూఏఈలో ఆరు రోజుల పాటు క్వారంటైన్లో ఉన్న అనంతరం జట్టు సభ్యులు నెట్ ప్రాక్టీస్ ప్రారంభించనున్నారు. సన్‌రైజర్స్ జట్టులో హైదరాబాద్ నుంచిప్రాతినిధ్యం వహిస్తోంది భావనక సందీప్ ఒక్కడే కావడం గమనార్హం. ఈ సందర్భంగా సందీప్ ఏం చెప్పారంటే.. ‘సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో నేనొక్కడినే హైదరాబాద్‌కు చెందినవాడిని ఉండడంతో సహజంగానే తనపై హైదరాబాద్ క్రికెట్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. వారి ఆశలను, ఆకాంక్షలను నేనుతప్పకుండా హైదరాబాద్ క్రికెట్ అభిమానుల మద్దతుతో నెరవేర్చడానికి కృషి చేస్తా. ఇప్పటివరకు రంజీ, దేశవాలీ క్రికెట్ మాత్రమే ఆడాను. ప్రస్తుతం ప్రపంచ మేటి ఆటగాళ్లతో ఐపీఎల్లో ఆడబోతున్నాను. ఈ అవకాశం మూడేళ్లుగా ఎదురుచూస్తున్నా. ముఖ్యంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏబీ డివిల్లియర్స్కు బౌలింగ్ చేయడం నా చిరకాల వాంఛ. భారత జట్టులో స్థానం సంపాదించేందుకు ఇక్కడే పునాదులు వేసుకుంటాను. అవకాశం కల్పించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి, వీవీఎస్ లక్ష్మణ్‌కు, అంబటి రాయుడుకి, కోచ్‌లు జాన్, శ్రీధర్‌లకు, ఫిట్నెస్ సాధించేందుకు గంటల తరబడి నాకు బౌలింగ్ చేసిన మణితేజ, మధుసూదన్‌రెడ్డిలకు, చిన్నప్పటి నుంచే నాలోని క్రికెట్‌ను తట్టిలేపిన నా తల్లిదండ్రులకు రుణపడి ఉంటాను’. సందీప్ రికార్డులివీ.. 2010లో 18 ఏళ్ల వయసులో రంజీతో రంగప్రవేశం చేసిన సందీప్ మొదటి మ్యాచ్‌లోనే ఝార్ఖండ్‌పై సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. 75 ఏళ్ల హైదరాబాద్ రంజీ చరిత్రలో మొదటి మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన 5వ బ్యాట్స్‌మన్‌గా సందీప్ నిలిచాడు. ఇప్పటి వరకు 54 రంజీ మ్యాచ్‌లు ఆడి 48.5 సగటుతో తన ప్రతిభను అజేయంగా కొనసాగిస్తున్నాడు. మొత్తం 7 సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ, 21 హాఫ్ సెంచరీలు తన ఖాతాలో జమ చేసుకున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ రంజీ టీమ్‌కు వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. అంతేకాకుండా ఇతను లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ కూడా. విజయ్ హజారే 50 ఓవర్ల టోర్నమెంట్లో హైదరాబాద్ నుంచి 14 వికెట్లు తీసి ఆల్‌రౌండర్ ప్రతిభను చాటాడు. బీటెక్ పూర్తిచేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో స్పోర్ట్స్ కోటాలో ఇన్స్పెక్టర్గా ఉద్యోగం సంపాదించిన సందీప్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లలో తన నైపుణ్యాన్ని చాటుతూ తన చిరకాల స్వప్నమైన ఐపీఎల్లో స్థానం దక్కించుకున్నాడు. -
ఆటోడ్రైవర్ ఆత్మహత్య
అనంతపురం న్యూసిటీ : రైలుకింద పడి ఆటోడ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసుల కథనం మేరకు... అనంతపురంలోని రాంనగర్లో నివాసముంటున్న చిగిచెర్ల నారపరెడ్డి (50) ఆటో డ్రైవర్. కొన్నేళ్లుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. తరచూ అనారోగ్య సమస్యలు తలెత్తుతుండటంతో బుధవారం హెచ్చెల్సీ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద రైలుకిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
ప్రేమ జంటలకు కౌన్సిలింగ్
అనంతపురం సెంట్రల్ : రాంనగర్ 80 అడుగుల రోడ్డు శివారుప్రాంతంలో ప్రేమ జంటలకు నాల్గవపట్టణ ఎస్ఐ శ్రీరామ్ కౌన్సెలింగ్ నిర్వహించారు. సమీపంలో చిల్డ్రన్పార్కును కొన్ని ప్రేమ జంటలు అడ్డాగా చేసుకున్నాయి. దాదాపు 15 ప్రేమజంటలు పోలీసులకు తారసపడ్డారు. తెలిసీతెలియని వయస్సులో ప్రేమ అంటూ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. అలాగే ఇంట్లో తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళుతున్నారనే విషయంపై జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. -
రాంనగర్ ప్రభుత్వ పాఠశాల ధీనావస్థ
-
నూతన జిల్లాల్లోని భవనాల్లో ఏర్పాట్లు పూర్తి చేయాలి
రాంనగర్ : నూతన జిల్లాలోని భవనాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి తగిన సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అన్నారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, జేసీలతో నూతన జిల్లాల భవనాలు, సదుపాయాలపై సమీక్షించి మాట్లాడారు. నూతన జిల్లాలకు ఆర్డర్లు తీసుకున్న ఉద్యోగులందరూ 11వ తేది ఉదయం 10.30గంటలకు ఆయా కార్యాలయాల్లోని రిజిష్టర్‌లో సంతకం చేయాలని ఆదేశించారు. ప్రతి కార్యాలయంలో జెండా వందనం నిర్వహించాలని సూచించారు. కొత్త జిల్లాలకు వెళ్లిన ఉద్యోగులందరు సంబంధిత కార్యాలయాల్లో గ్రూపు ఫొటోలు దిగాలని అన్నారు. కొత్త మండలాలు, నూతన డివిజన్లకు కేటాయించే ఉద్యోగుల వివరాలను ఈనెల 10వ తేదీన ఉదయం జిల్లా కలెక్టర్లకు పంపిస్తామని అన్నారు. నూతన జిల్లాలు, డివిజన్లు, మండలాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి, జేసి సత్యనారాయణ, ఏజేసి వెంకట్రావు, డీఆర్వో రవి, జెడ్పీ సీఈఓ మహేందర్‌రెడ్డి, తదితరులున్నారు. -
చిన్నారి అనుమానాస్పద మృతి
హైదరాబాద్ : రామ్‌నగర్‌లో ఓ చిన్నారి అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. రామ్‌నగర్‌కు చెందిన వెంకట్, పల్లవి దంపతుల కూతురు మానస(4) ఈ నెల 14 వ తేదీన ఇంట్లో మెట్లపై నుంచి జారిపడింది. గాయపడిన పాపను పలు ఆసుపత్రులకు తీసుకెళ్లారు. చిన్నారి చికిత్స పొందుతూ సోమవారం చనిపోయింది. ప్రమాదం వల్లే చనిపోయిందని తల్లిదండ్రులు చెబుతుండగా స్థానికులు మాత్రం తల్లిదండ్రులే చంపారని ఆరోపిస్తున్నారు. దీంతో ముషీరాబాద్ పోలీసులు అనుమానాస్పద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
రాంనగర్ : వివిధ శాఖల్లో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎన్.సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి సోమవారం ప్రజలు ఇచ్చే వినతులకు అధికారులు అధిక ప్రాధాన్యతమిచ్చి సత్వరమే పరిష్కరించాలని, పరిష్కరించలేని, ఆస్కారం లేని ఫిర్యాదులు బాధితులకు తెలియజేయాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న అర్జీలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. జిల్లాలో 15 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు. వివిధ శాఖలకు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ తెలంగాణకు హరితహారం కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నందున నూరు శాతం జియో ట్యాగింగ్ లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. జిల్లా పునర్వి విభజన ఉన్నందు వల్ల తెలంగాణకు హరితాహారం జిల్లాల వారీగా విభజిస్తామన్నారు. సమావేశంలో ఏజేసీ వెంకట్రావు, పులిచింతల స్పెషల్ కలెక్టర్ నిరంజన్, డీఆర్వో రవి, వివిధ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
కాళోజీకి ఘన నివాళి
రాంనగర్ : కాళోజి నారాయణరావు జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించాలని కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి అన్నారు. కాళోజి నారాయణరావు జయంతి సందర్భంగా శుక్రవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసిన ప్రారంభించారు. అనంతరం కాళోకి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళోజి జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా అన్ని జిల్లాలో నిర్వహించుకోవాలని ఆదేశించిందని, అందుకే కాళోజి జయంతిని ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. కాళోజి తెలంగాణ ఉద్యమానికి మూలపురుషుడని, తాను నమ్మిన సిద్ధాంతంపై చివరి వరకు నిలబడిన వ్యక్తి అని కొనియాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే, ఇక్కడి ప్రజలకు నీరు, నిధులు, నియామకాలు సక్రమంగా అందుతాయని నమ్మిన వ్యక్తి కాళోజి అని, అందుకే తెలంగాణ ఉద్యమం మొదలు కాకముందే ప్రజల్లో ప్రత్యేక రాష్ట్రం ఆకాంక్షను మేలుకొల్పారన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్.సత్యనారాయణ, ఏజేసి వెంకట్రావు, డీఆర్ఓ రవి, డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి పాల్గొన్నారు. -
డ్రెస్సింగ్ టేబుల్ మీదపడి చిన్నారి మృతి
-
డ్రెస్సింగ్ టేబుల్ మీదపడి చిన్నారి మృతి
హైదరాబాద్: డ్రెస్సింగ్ టేబుల్ మీదపడి తొమ్మిది నెలల చిన్నారి మృతిచెందాడు. ఈ సంఘటన నగరంలోని ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంనగర్లో గురువారం చోటుచేసుకుంది. స్థానిక అభయాంజనేయస్వామి దేవాలయం వీధిలో నివాసముంటున్న ప్రవీణ్, అనూష దంపతుల రెండో కుమారుడు అయాన్ ఇంట్లో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు డ్రెస్సింగ్ టేబుల్ మీదపడింది. దీంతో అయాన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
రుణమాఫీ నిధులను ఒకేసారి విడుదల చేయాలి
రాంనగర్ : 3వ, 4వ విడత రుణమాఫీ నిధులను ప్రభుత్వం ఒకేసారి విడుదల చేయాలని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి సాగర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. రైతులకు రుణమాఫీ చేస్తామని ఆర్భాటంగా ప్రకటించి మూడో విడత డబ్బులు నేటì కీ విడుదల చేయకపోవడం కేసీఆర్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. ఖరీఫ్ ప్రారంభమై మూడు నెలలు దాటుతున్నా రుణమాఫీపై ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా సాగర్ ఎడమకాల్వ, ఏఎమ్మార్పీ, ఎస్ఆర్ఎస్పీ కాల్వల ద్వారా చెరువులు, కుంటలు నింపి పంటలకు నీరిచ్చి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జున్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బండ శ్రీశైలం, జహంగీర్, దండ వెంకటరెడ్డి, మందడి రాంరెడ్డి, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, వి.నారాయణరెడ్డి, వి.వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌రెడ్డి, కావలి కృష్ణ, మందడి నర్సింహ, ఇంద్రారెడ్డి ఉన్నారు. -
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
రాంనగర్: ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పని చేసే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు పి. ప్రభాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గార్లపాటి కృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆసంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటినా నేటికి జర్నలిస్టుల సమస్య ఒక్కటి కూడా పరిష్కారం కాలేదన్నారు. ప్రభుత్వం కొంత మంది జర్నలిస్టులకు హెల్త్ కార్డులు జారీ చేసినా ఏ ఒక్కరికి ప్రయోజనం లేదన్నారు. ఇళ్లు, ఇళ్ల స్థలాల కేటాయింపులు మాటలకే పరిమితమైందని విమర్శించారు. కార్యక్రమంలో జర్నలిస్టులు కోటగిరి ౖ§ð వాదీనం, చలసాని శ్రీనివాసరావు, పులిమామిడి మహేందర్‌రెడ్డి, దాసు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
ఆదివాసీల హక్కులను కాపాడాలి
రాంనగర్: ఆదివాసీల హక్కులను కాపాడాలని కోరుతూ సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వి.కోటేశ్వర్రావు మాట్లాడుతూ ఆదివాసీల హక్కులను కాలరాస్తే సహించేది లేదని, ఆదీవాసీలపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి బండారు డేవిడ్‌కుమార్, జిల్లా నాయకులు రాయి కృష్ణ, రాచకొండ జనార్దన్, ఇందూరి సాగర్, బాదె రాము, పలస యాదగిరి, లక్ష్మయ్య, శంకర్‌రెడ్డి, జానయ్య, సతీశ్ పాల్గొన్నారు.