ప్రతి వ్యక్తికి బ్యాంకు ఖాతా ఉండాలి
రాంనగర్ : బ్యాంకు ఖాతా ప్రతి వ్యక్తి జీవితానికి అనుసంధానంగా మారిందని నల్లగొండ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి జన్‌ధన్ యో జనను గురువారం ఉదయాదిత్య భవన్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాకు మళ్లిస్తూ అనుసంధానం చేసిందన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీలు, ఇతర రాయితీలు దళారుల ప్రమోయం లేకుండా నేరుగా ఖాతాలోకి చేర్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా ఉం డాలనే లక్ష్యంగా పని చేస్తోందన్నారు. ఒక్క రోజే దేశ వ్యాప్తంగా ఎలాంటి డిపాజిట్ లేకుం డా కోటి మందికి పైగా వ్యక్తులకు బ్యాంకు ఖా తాలు ప్రారంభించడం ప్రశంసనీయమన్నారు.
ఖాతాదారుడు జన్‌ధన్ బ్యాంకు ఖాతా తో ఆరునెలల పాటు లావాదేవీలు నిర్వహించిన అనంతరంరూ. 5 వేల వరకు ఓవర్ డ్రాప్టు రుణ సౌకర్యం పొందవచ్చున్నారు. అంతేగాకుండా రూ.లక్ష వరకు ఖాతాదారునికి ప్రమాద బీమా కూడా వర్తిస్తుందన్నారు. పేదలను ఏదో ఒక కార్యక్రమం ద్వారా ఆదుకోవడానికి ప్రభుత్వం బీమా పథకాన్ని ఖాతాకు అనుసంధానం చేసిందన్నారు. రైతు పండించే పంటకు సరైన గిట్టుబాటు ధర లభిస్తే ఎన్నడు కూడా రుణ మాఫీ కోరడని అందువల్ల పండిన పం టకు ప్రభుత్వం గిట్టుబాటు ధర పెంచాల్సిన అవసరం ఉందన్నారు. లబ్ధిదారులందరూ జన్‌ధన్ యోజన కింద బ్యాంకు ఖాతాలను ప్రారంభించి ప్రభుత్వం నుంచి అందే లబ్ధిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా పరిషత్ చైర్మన్ బాలునాయక్ మాట్లాడుతూ బ్యాంకుల జాతీయకరణకు ముందు పేదలు బ్యాంకు మెట్లు ఎక్కలేని పరిస్థితి ఉందన్నారు. బ్యాంకుల జాతీయకరణ వల్ల పేదలకు ఎంతో మేలు చేకూరిందన్నారు.
అన్ని వ ర్గాల ప్రజలు నేడు బ్యాంకుల వద్దకు వెళ్లి నేరు గా లావాదేవీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు మాట్లాడుతూ దేశ ఆర్థిక అభివృద్ధికి బ్యాంకింగ్ వ్యవస్థ కీలకమైందని, ప్రజలకు బ్యాంకింగ్ వ్యవస్థను మరింత చేరు వ చేయడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను నేరుగా బ్యాంకుల ద్వారా అందిస్తోందన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలో ప్ర జలను భాగస్వాములను చేసి అభివృద్ధి సంక్షే మ కార్యక్రమాలను అందించాలని ప్రభుత్వం సంకల్పిం చిదన్నారు. 2014 ఆగస్టు నుంచి 2015 ఆగస్టు 14 నాటికి 10 కోట్ల కుటుంబాలకు 20 కోట్ల బ్యాంకు ఖాతాలు ప్రారంభించాలనే లక్ష్యంతో బ్యాంకులు పని చేయాల్సి ఉందన్నారు. అనంతరం ఖాతాదారులకు కలెక్టర్, ఎంపీ, జెడ్పీ చైర్మన్.. ఖాతా పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీహెచ్ ఏజీఎం ఎస్‌కె. నందా, సూర్యాపేట రీజియన్ ఏజీఎం రామారావు, జిల్లా లీడ్ బ్యాంకు అధికారి శ్రీధర్, నాబార్డు ఏజీఎం దయామృత పాల్గొన్నారు.