ఆటోడ్రైవర్ ఆత్మహత్య
అనంతపురం న్యూసిటీ : రైలుకింద పడి ఆటోడ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసుల కథనం మేరకు... అనంతపురంలోని రాంనగర్‌లో నివాసముంటున్న చిగిచెర్ల నారపరెడ్డి (50) ఆటో డ్రైవర్. కొన్నేళ్లుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. తరచూ అనారోగ్య సమస్యలు తలెత్తుతుండటంతో బుధవారం హెచ్చెల్సీ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద రైలుకిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.