కాళోజీకి ఘన నివాళి
కాళోజీకి ఘన నివాళి
Published Fri, Sep 9 2016 11:31 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
రాంనగర్ : కాళోజి నారాయణరావు జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించాలని కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి అన్నారు. కాళోజి నారాయణరావు జయంతి సందర్భంగా శుక్రవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసిన ప్రారంభించారు. అనంతరం కాళోకి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళోజి జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా అన్ని జిల్లాలో నిర్వహించుకోవాలని ఆదేశించిందని, అందుకే కాళోజి జయంతిని ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. కాళోజి తెలంగాణ ఉద్యమానికి మూలపురుషుడని, తాను నమ్మిన సిద్ధాంతంపై చివరి వరకు నిలబడిన వ్యక్తి అని కొనియాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే, ఇక్కడి ప్రజలకు నీరు, నిధులు, నియామకాలు సక్రమంగా అందుతాయని నమ్మిన వ్యక్తి కాళోజి అని, అందుకే తెలంగాణ ఉద్యమం మొదలు కాకముందే ప్రజల్లో ప్రత్యేక రాష్ట్రం ఆకాంక్షను మేలుకొల్పారన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్.సత్యనారాయణ, ఏజేసి వెంకట్రావు, డీఆర్‌ఓ రవి, డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి పాల్గొన్నారు.
Advertisement