రాష్ట్రంలో 55శాతం ఉన్న బీసీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. బీసీ కార్పొరేషన్‌కు రూ.20వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్‌లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పలువురిని అరెస్టు చేశారు.
రాంనగర్ :రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్‌కు రూ. 20 వేల కోట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు డిమాండ్ చేశారు. బడ్జెట్‌లో బీసీలకు రూ. 2,022 కోట్లు మాత్రమే కేటాయించినందుకు నిరసనగా మంగళవారం ఆ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్‌లో బీసీలకు నిధుల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రంలో 55 శాతం జనాభా ఉన్న బీసీలకు కేవలం 2 శాతం మా త్రమే నిధులు కేటాయించిందని తెలిపారు. అన్ని రంగాలలో వెనుకబడిన బీసీల సంక్షేమంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. బీసీ సంక్షేమ శాఖకు మంత్రిని నియమించి, ఆ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భ ర్తీ చేయాలన్నారు.
సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వైద్యుల సత్యనారాయణ మాట్లాడుతూ బీసీలకు పెద్ద పీట వేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిధుల కేటాయింపులో వివక్ష చూపడం శోచనీయమన్నారు. అనంతరం సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టరేట్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. బీసీనేతలను అరెస్ట్ చేసి రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించి సొంత పూచికత్తుపై వదిలిపెట్టారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జేసీ ప్రీతిమీనాకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు కంది సూర్యనారాయణ, బోళ్ల కరుణాకర్, గండి చెర్వు వెంకన్నగౌడ్, కాసోజు విశ్వనాథం, వైద్యం వెంకటేశ్వర్లు, దుడుకు లక్ష్మీనారాయణ, జనగాం అంజ య్యగౌడ్, జువాజి ఇంద్రయ్య, వెంకటేశ్వర్లు, అయితగోని జనార్దన్, చొల్లేటి రమేష్, చిక్కుళ్ల రాములు, అరవింద్, మైనం నారాయణ, లింగయ్య, శ్యాంసుం దర్ తదితరులు పాల్గొన్నారు.
బీసీ కార్పొరేషన్‌కు రూ.20వేల కోట్లు కేటాయించాలి
Published Wed, Nov 19 2014 3:33 AM | Last Updated on Sat, Sep 2 2017 4:41 PM
Advertisement
Advertisement