Published
Tue, Aug 9 2016 9:20 PM
| Last Updated on Mon, Sep 4 2017 8:34 AM
ఆదివాసీల హక్కులను కాపాడాలి
రాంనగర్: ఆదివాసీల హక్కులను కాపాడాలని కోరుతూ సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వి.కోటేశ్వర్‌రావు మాట్లాడుతూ ఆదివాసీల హక్కులను కాలరాస్తే సహించేది లేదని, ఆదీవాసీలపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి బండారు డేవిడ్‌కుమార్, జిల్లా నాయకులు రాయి కృష్ణ, రాచకొండ జనార్దన్, ఇందూరి సాగర్, బాదె రాము, పలస యాదగిరి, లక్ష్మయ్య, శంకర్‌రెడ్డి, జానయ్య, సతీశ్ పాల్గొన్నారు.