మరో మూడు నెలల్లో విద్యా సంవత్సరం ముగుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంపై స్పష్టమైన నిర్ణయం
రాంనగర్ : మరో మూడు నెలల్లో విద్యా సంవత్సరం ముగుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంపై స్పష్టమైన నిర్ణయం వెలువరించకపోవడం దుర్మార్గమైన చర్య అని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు గండిచెర్వు వెంకన్న పేర్కొన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బుధవారం కలెక్టర్‌రేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉపకారవేతనాలకు సంబంధించి దరఖాస్తు తేదీ కూడా ప్రకటించకపోవడం ప్రభుత్వ మొండి వైఖరిని తేటతెల్లం చేస్తుందని విమర్శించారు.
ఫాస్ట్ పథకం ప్రవేశపెట్టి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నీరుగార్చేం దుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. పెరిగిన ధరలకు అనుగణంగా మెస్ చార్జీలు, ఉపకారవేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలపై నిర్లక్ష్యం వీడకపోతే మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటనలను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీఆర్వో నిరంజన్‌కు అందజేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఐతగోని జనార్దన్, జిల్లా కార్యదర్శి బొల్లం సతీష్‌యాదవ్, బాడిగల శ్రవణ్, నాగరాజు, మనోహర్, ప్రవీణ్, మహేష్, ఆంజనేయులు, అశోక్ పాల్గొన్నారు.