హైదరాబాద్ : రామ్‌నగర్‌లో ఓ చిన్నారి అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. రామ్‌నగర్‌కు చెందిన వెంకట్, పల్లవి దంపతుల కూతురు మానస(4) ఈ నెల 14 వ తేదీన ఇంట్లో మెట్లపై నుంచి జారిపడింది. గాయపడిన పాపను పలు ఆసుపత్రులకు తీసుకెళ్లారు. చిన్నారి చికిత్స పొందుతూ సోమవారం చనిపోయింది. ప్రమాదం వల్లే చనిపోయిందని తల్లిదండ్రులు చెబుతుండగా స్థానికులు మాత్రం తల్లిదండ్రులే చంపారని ఆరోపిస్తున్నారు. దీంతో ముషీరాబాద్ పోలీసులు అనుమానాస్పద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.