జిల్లాలో జనవరి ఒకటి నుంచి గ్యాస్‌పై ఇచ్చే రాయితీ మొత్తం నగదు బదిలీ పథకం ద్వారా అమలు చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ ప్రీతిమీనా తెలిపారు.
రాంనగర్ : జిల్లాలో జనవరి ఒకటి నుంచి గ్యాస్‌పై ఇచ్చే రాయితీ మొత్తం నగదు బదిలీ పథకం ద్వారా అమలు చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ ప్రీతిమీనా తెలిపారు. సోమవారం ఆమె ఇక్కడ ఒక ప్రకటన విడుదల చేశారు. గ్యాస్ నగదు బదిలీకి సంబంధించి ఎల్పీజీ వినియోగదారుల బ్యాంక్ ఖాతాలకు ఆధార్‌నంబర్‌ను అనుసంధానం చేస్తే రాయితీ నేరుగా వారి ఖాతాలో జమ అవుతుందని పేర్కొన్నారు. ఆధార్ లేకున్నా డీలర్‌కు బ్యాంక్ ఖాతానంబర్ ఇస్తే ఆ ఖాతాలోకి రాయితీ జమ కానుందని వివరించారు.
మొదటి మూడు నెలలు పాటు ఈ పథకంలో చేరకపోయినా రాయితీ ధరకే సిలిండర్ ఇస్తారని తెలిపారు. ఆధార్‌పై ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే మీసేవ కేంద్రాలలో సంప్రదించాలని సూచిం చారు. ప్రతి మండల కేంద్రంలో శాశ్వత ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎల్పీజీ డీలర్లు ప్రజల అవగాహన కోసం ప్రధా న కూడళ్లలో గ్యాస్ నగదు బదిలీపై బ్యానర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి డీలరు వారి కార్యాలయంలో ఒక వ్యక్తిని నియమించి ప్రజలకు సహకారం అందించాలని సూచిం చారు. వినియోగదారులు అంద రూ డిసెంబర్ 31లోగా తమ గ్యాస్ కనెక్షన్‌లకు ఆధార్ అనుసంధానం చేసుకొని సహకరించాలని కోరారు.