అనంతపురం సెంట్రల్ : రాంనగర్ 80 అడుగుల రోడ్డు శివారుప్రాంతంలో ప్రేమ జంటలకు నాల్గవపట్టణ ఎస్‌ఐ శ్రీరామ్ కౌన్సెలింగ్ నిర్వహించారు. సమీపంలో చిల్డ్రన్‌పార్కును కొన్ని ప్రేమ జంటలు అడ్డాగా చేసుకున్నాయి. దాదాపు 15 ప్రేమజంటలు పోలీసులకు తారసపడ్డారు. తెలిసీతెలియని వయస్సులో ప్రేమ అంటూ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. అలాగే ఇంట్లో తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళుతున్నారనే విషయంపై జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
ప్రేమ జంటలకు కౌన్సిలింగ్
Published Mon, Nov 14 2016 11:28 PM | Last Updated on Sun, Sep 2 2018 5:06 PM
Advertisement
Advertisement