అనంతపురం: గొంతునులిమి భార్యను హత్య చేసి... అనంతరం ఆమె మృతదేహన్ని రైల్వే ట్రాక్పై పడేశాడు భర్త. ఆ తర్వాత అతడు కూడా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం రామ్నగర్లో ఈ దారుణం చోటు చేసుకుంది. స్థానికులు రైల్వే ట్రాక్పై మృతదేహాలు ఉన్నట్లు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో పోలీసులు రైల్వే ట్రాక్ వద్దకు చేరుకుని మృతదేహలను స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన దంపతులు స్రవంతి, నాగేంద్రలుగా స్థానికులు గుర్తించి పోలీసులకు వెల్లడించారు. కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.