నూతన జిల్లాల్లోని భవనాల్లో ఏర్పాట్లు పూర్తి చేయాలి
Published
Sat, Oct 8 2016 10:45 PM
| Last Updated on Mon, Sep 4 2017 4:40 PM
నూతన జిల్లాల్లోని భవనాల్లో ఏర్పాట్లు పూర్తి చేయాలి
రాంనగర్ : నూతన జిల్లాలోని భవనాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి తగిన సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అన్నారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, జేసీలతో నూతన జిల్లాల భవనాలు, సదుపాయాలపై సమీక్షించి మాట్లాడారు. నూతన జిల్లాలకు ఆర్డర్లు తీసుకున్న ఉద్యోగులందరూ 11వ తేది ఉదయం 10.30గంటలకు ఆయా కార్యాలయాల్లోని రిజిష్టర్‌లో సంతకం చేయాలని ఆదేశించారు. ప్రతి కార్యాలయంలో జెండా వందనం నిర్వహించాలని సూచించారు. కొత్త జిల్లాలకు వెళ్లిన ఉద్యోగులందరు సంబంధిత కార్యాలయాల్లో గ్రూపు ఫొటోలు దిగాలని అన్నారు. కొత్త మండలాలు, నూతన డివిజన్‌లకు కేటాయించే ఉద్యోగుల వివరాలను ఈనెల 10వ తేదీన ఉదయం జిల్లా కలెక్టర్‌లకు పంపిస్తామని అన్నారు. నూతన జిల్లాలు, డివిజన్లు, మండలాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి, జేసి సత్యనారాయణ, ఏజేసి వెంకట్రావు, డీఆర్వో రవి, జెడ్పీ సీఈఓ మహేందర్‌రెడ్డి, తదితరులున్నారు.