సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జర్నలిస్టులెదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే–హెచ్143) ఐటీ శాఖమంత్రి కేటీఆర్‌కు విన్నవించింది. ఈమేరకు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరిగిన సెమినార్‌కు హాజరైన కేటీఆర్‌ను కలిసి టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందం వినతిపత్రం అందించింది. చిన్న పత్రికల గ్రేడింగ్ అంశాన్ని పరిష్కరించాలని కోరింది.
అలాగే వచ్చే ఏడాది జనవరి 8, 9, 10 తేదీల్లో హైదరాబాద్ కేంద్రంగా జరగనున్న ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) ప్లీనరీకి హాజరుకావాలని మంత్రిని ఆహ్వానించింది. రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ నేతృత్వంలో కేటీఆర్‌ను కలిసిన వారిలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతీసాగర్, తెమ్జూ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శి రమణకుమార్, చిన్న పత్రికల సంఘం అధ్యక్షుడు బిజిగిరి శ్రీనివాస్, కార్యదర్శి అగస్టీన్, హైదరాబాద్ జిల్లా టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు యోగానంద్, ప్రధాన కార్యదర్శి యారా నవీన్‌కుమార్, సుదర్శన్, అమిత్ భట్టు తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment