Journalists Problems
-
జర్నలిస్టుల పెండింగ్ సమస్యలను పరిష్కరించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జర్నలిస్టులెదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే–హెచ్143) ఐటీ శాఖమంత్రి కేటీఆర్‌కు విన్నవించింది. ఈమేరకు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరిగిన సెమినార్‌కు హాజరైన కేటీఆర్‌ను కలిసి టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందం వినతిపత్రం అందించింది. చిన్న పత్రికల గ్రేడింగ్ అంశాన్ని పరిష్కరించాలని కోరింది. అలాగే వచ్చే ఏడాది జనవరి 8, 9, 10 తేదీల్లో హైదరాబాద్ కేంద్రంగా జరగనున్న ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) ప్లీనరీకి హాజరుకావాలని మంత్రిని ఆహ్వానించింది. రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ నేతృత్వంలో కేటీఆర్‌ను కలిసిన వారిలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతీసాగర్, తెమ్జూ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శి రమణకుమార్, చిన్న పత్రికల సంఘం అధ్యక్షుడు బిజిగిరి శ్రీనివాస్, కార్యదర్శి అగస్టీన్, హైదరాబాద్ జిల్లా టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు యోగానంద్, ప్రధాన కార్యదర్శి యారా నవీన్‌కుమార్, సుదర్శన్, అమిత్ భట్టు తదితరులున్నారు. -
జర్నలిస్టుల సమస్యలపై వేగంగా స్పందించాలి
సాక్షి, న్యూఢిల్లీ: సమాజంలో ఫోర్త్ ఎస్టేట్‌గా పరిగణిస్తున్న జర్నలిజాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. తెలంగాణలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని, ఆరోగ్య, నివాస భద్రత కల్పించాలని టీయూడబ్ల్యూజే, ఐజేయూ ఆధ్వర్యంలో మంగళవారం పార్లమెం టు స్ట్రీట్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో నాలుగేళ్లలో అసహజ కారణాలతో మరణించిన 220 మంది జర్నలిస్టులపై రాసిన పుస్తకాన్ని విడుదల చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు వేగంగా స్పందించాలని ఏచూరి సూచించారు. తెలంగాణలో చోటుచేసుకుంటున్న జర్నలిస్టుల అసహజ మరణాలు దేశంలో ఎక్కడా ఇంత పెద్ద సంఖ్యలో లేవన్నారు. జర్నలిజం కత్తిమీద సాములాంటిదని, వారి సమస్యలను కారుణ్య దృష్టితో చూడరాదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. పని ఒత్తిడితో అనారోగ్యం బారిన పడి, ప్రభుత్వం ఇచ్చిన ఆరోగ్య కార్డులు పనిచేయక, సరైన వైద్యం అందకపోవడంతో 220 మంది జర్నలిస్టులు చనిపోయారని ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ అన్నారు. జర్నలిస్టుల సమస్యలను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ధర్నాచౌక్ ఎత్తేయడం వల్ల ఢిల్లీకి వచ్చి ధర్నా చేయాల్సి వచ్చిందన్నారు. జర్నలిస్టుల వైద్య సదుపాయాలపై ప్రభు త్వ ప్రకటనలు బూటకంగా కనిపిస్తున్నాయని ఐజేయూ నేత కె.శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత కల్పించాలని, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ధర్నాకు సీపీఐ జాతీయ నేత డి.రాజా సంఘీభావం తెలిపారు. ధర్నాలో ఐజేయూ అధ్యక్షుడు ఎస్ఎన్ సిన్హా, ఐఎఫ్‌జే ఉపాధ్యక్షురాలు సబీనా ఇంద్రజిత్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.శేఖర్, ప్రధాన కార్యదర్శి అలీ, ఐజేయూ కౌన్సిల్ సభ్యుడు పి.ఆంజనేయులు, తెలంగాణలోని 31 జిల్లాల యూనియన్ అధ్యక్షులు, ప్రతినిధులు పాల్గొన్నారు. వాస్తవాలపై దృష్టి సారించాలి: ఉపరాష్ట్రపతి మీడియా సంచలనాలపై కాకుండా వాస్తవాలున్న వార్తలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. ధర్నా అనంతరం ఐజేయూ, టీయూడబ్ల్యూజే నేతలు ఉపరాష్ట్రపతిని కలసి జర్నలిస్టుల సమస్యలను ఆయ న దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి కేంద్ర సమాచార మంత్రిని పిలిపించి చర్చిస్తానని ఆయన హామీనిచ్చా రు. జర్నలిస్టుల సంక్షేమంపై యాజమాన్యాలూ దృష్టి సారించాలని, అప్పుడే వారు నిజాయితీగా స్వేచ్ఛగా పనిచేయగలుగుతారన్నారు. గ్రామ స్వరాజ్య స్థాపనకు ప్రభుత్వాలే కాకుండా మీడియా కూడా గ్రామాలు, వ్యవసాయంపై దృష్టి సారించాలన్నారు. ఉపరాష్ట్రపతిని కలసినవారిలో ఎస్ఎన్ సిన్హా, దేవులపల్లి అమర్, కె.శ్రీనివాస్‌రెడ్డి, సబీనా ఇంద్రజిత్, నారాయణరెడ్డి, ఎంఎ మజీద్, కృష్ణారెడ్డి తదితరులున్నారు. -
జర్నలిస్టుల నిరసనలపై కేటీఆర్ ఆగ్రహం
* ఉనికి చాటుకునేందుకే ధర్నాలు, నిరసనలు * త్వరలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం * సభ్యత, సంస్కారం మరచి వార్తల ప్రచురణ సరికాదు * ఉత్తమ ఫొటోగ్రాఫర్లకు బహుమతుల ప్రదానోత్సవంలో కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: మాట్లాడి పరిష్కరించుకునే సమస్యలను ఆందోళనల దాకా తీసుకెళ్లడం ఏమిటని జర్నలిస్టు నేతలపై రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉనికి చాటుకునే ఆరాటంతో ధర్నాలు, నిరసనలు చేయటం ఇకనైనా మానుకోవాలని సూచించారు. తాము చేసే సంక్షేమ కార్యక్రమాలను ఇప్పటికైనా గుర్తించాలన్నారు. రాష్ట్రంలోని జర్నలిస్టులకు న్యాయం చేస్తామని, హెల్త్‌కార్డులు, అక్రిడిటేషన్లు, పెన్షన్లు, ఇళ్ల స్థలాల సమస్యల పరి ష్కారంపై సమాచార శాఖ కమిషనర్‌తో మాట్లాడి త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఫొటో జర్నలిస్టు అసోసియేషన్, భాషా సాంస్కృతిక శాఖల ఆధ్వర్యం లో శుక్రవారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో ఫొటోగ్రాఫర్స్‌కు బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘కొన్ని పత్రికలు సభ్యత, సం స్కారం మరిచి పోతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కొంత మంది అదేపనిగా చేస్తున్న చౌకబారు విమర్శలకు ప్రాధాన్యత ఇస్తున్నా యి. వాటిని స్వీయ సెన్సార్ లేకుండా యథాతథంగా ప్రచురిస్తున్నారు. పత్రికలకు ఇది ఏమాత్రం తగదు’ అని చెప్పారు. సీఎం కేసీఆర్‌పై ఎవరేం మాట్లాడినా ఎడిటింగ్ లేకుం డా మెయిన్ పేజీలో పెడతారని, అదే పొరుగు రాష్ట్ర పాలకులపై హైకోర్టు మొట్టికాయలు వేసినావాటికి ప్రాధాన్యత ఇవ్వరని ఆక్షేపిం చారు. కేసీఆర్‌ను ఇతరులు తిడితే యథాతథంగా ప్రచురించే సంస్కృతికి కొన్ని పత్రికలు వచ్చేశాయన్నారు. ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ ఇప్పటికీ బాలారిష్టాలు అధిగమించే దశలోనే ఉన్నాయని, ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న తెలంగాణలో కొన్ని సమస్యలుం టాయని, వాటిని అర్థం చేసుకోవాలని జర్నలి స్టులను కోరారు. ఉద్యమం చూడని ఓ పెద్దాయన పదవీ విరమణ తర్వాత పాలకులపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. జస్టిస్ చంద్రకుమార్ ఎవరు..? ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ జస్టిస్ చంద్రకుమార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసలు చంద్ర కుమార్ ఎవరని ప్రశ్నించారు. ఉద్యమంలో ఆయన పాత్రే లేదని, జర్నలిస్టుల గురించి ఆయనకు ఏం తెలుసన్నారు. జస్టిస్ అన్న విష యం మరచి ఆయన మాట్లాడటం తగదన్నారు. తమ జోలికి రావొద్దని, వస్తే బాగోదని ఆయనకు తెలియజేస్తున్నామని చెప్పారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. బెస్ట్ న్యూస్ పిక్చర్ కింద మహబూబ్‌నగర్ జిల్లా సాక్షి ఫొటోగ్రాఫర్ వడ్ల భాస్కర్‌కు మొదటి బహుమతి దక్కింది. హైదరాబాద్ సాక్షి ఫొటోగ్రాఫర్ ఠాకూర్ సన్నీసింగ్‌కు మూడో బహుమతి లభించింది. అనంతరం వారిని సత్కరించి, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ డెరైక్టర్ మామిడి హరికృష్ణ, ఫొటో జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్, కాంత్రి కిరణ్, పల్లె రవి తదితరులు పాల్గొన్నారు. -
జర్నలిస్టుల సమస్యలకై 22న ధర్నా
హిమాయత్‌నగర్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో జర్నలిస్టులు పోషించిన పాత్ర ఏ ఇతర వర్గానికి తీసిపోదని ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. జర్నలిస్టుల సమస్యల సాధనకై ఈ నెల 22న తలపెట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో చలో కలెక్టరేట్‌కు సంబంధించిన పోస్టర్లను టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహట్ అలీ, హెచ్‌యూజే ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్.శంకర్‌గౌడ్, ఉపాధ్యక్షులు శివప్రసాద్రెడ్డిలతో కలసి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. కాసింత ఇంటి జాగా దొరుకుతుందని ఆశించిన జర్నలిస్టులకు రెండేళ్లుగా నిరాశ ఎదురవుతోందన్నారు. గ్రామీణ జర్నలిస్టులకు శిక్షణ ఇచ్చేందుకు ఉద్దేశించిన ప్రెస్‌అకాడమీ తన బాధ్యతలను నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్రంలో కనీసం అక్రిడిటేషన్లకు కూడా దిక్కులేదని మండిపడ్డారు. అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు అందేవిధంగా జీఓ239ను సవరించాలని, హెల్త్‌కార్డులు మంజూరు చేసి, ప్రతి కార్పొరేట్ ఆసుపత్రిలో హెల్త్ స్కీము అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వర్కింగ్ జర్నలిస్టులకు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పిన సీఎం తన హామీని తక్షణం అమలు చేయాలని, సబ్ ఎడిటర్లకు వెంటనే అక్రిడిటేషన్‌కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఎలక్ట్రానిక్ మీడియాలో న్యూస్ప్రెజెంటర్లను వర్కింగ్ జర్నలిస్టులుగా గుర్తించి వారికి అన్ని సంక్షేమ పథకాలూ వర్తింపచేయాలన్నారు. ఎలక్ట్రానిక్ మీడియాలో తెర వెనుక రాత్రింబవళ్ళు శ్రమిస్తూ వాయిస్ ఓవర్ బాధ్యతలు నిర్వహిస్తున్న వారిని కూడా వర్కింగ్ జర్నలిస్టులుగా గుర్తించాలని, అధికారపక్షం మేనిఫెస్టోలో వర్కింగ్ జర్నలిస్టులకు ప్రకటించిన అన్ని పథకాలూ అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో గోషామహల్ నియోజకవర్గ వర్కింగ్ జర్నలిస్టు అసొసియేషన్ అధ్యక్షులు జి.వీరేశ్, ప్రధాన కార్యదర్శి గోపాల్, నాయకులు గోపీనా«ద్, సుభాష్, ఖాజా, బాలకృష్ణ, చక్రవర్తి, వెంకట స్వామి, సుధీర్‌రెడ్డి, శ్రీధర్, రాఖేష్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల సాధనకు పోరాటాలే శరణ్యం
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ ఏర్పడి రెండేళ్లు గడిచిపోయినా జర్నలిస్టుల సమస్యలు అలాగే ఉండిపోయాయని, వాటి పరిష్కారానికి ఈనెల 22న రాష్ట్ర వ్యాప్తంగా చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి కె. విరాహత్ అలీ తెలిపారు. సోమవారం బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్ హెచ్‌యూజే ఆధ్వర్యంలో ఈ నెల 22న చేపట్టే ‘చలో కలెక్టరేట్’ సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికార రాజకీయ పక్షం జర్నలిస్టుల సంక్షేమాన్ని ఎన్నికల ప్రణాళికలో ఉంచినా ఏ ఒక్కటీ అమ లు పరచటం లేదన్నారు. అందుకే ఓపిక నశించి ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు సోదరులందరూ చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్లు అందే విధంగా జీఓ 239 సవరించి, తక్షణమే కొత్త రాష్ట్రం అక్రెడిటేషన్లు జారీ చేయాలన్నారు. అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ హెల్త్‌కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్పొరేట్ ఆస్పత్రిలో హెల్త్ స్కీము అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర రాజధానితో పాటు అన్ని జిల్లాల్లో వర్కింగ్ జర్నలిస్టులకు డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి ఇస్తామన్న సీఎం హామీని తక్షణం అమలు చేయాలని కోరారు. ఐజేయూ జాతీయ కార్యదర్శి వై నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సబ్ ఎడిటర్లకు వెంటనే అక్రిడిటేషన్ కార్డులు జారీ చే యాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఇంకా ఆంధ్రా అక్రెడిటేషన్లే కొనసాగుతున్నాయని చెప్పారు. అనంతరం ప్రచార కరపత్రాలను విరాహత్ అలీ విడుదల చేశారు. హెచ్‌యూజే ప్రధాన కార్యదర్శి వి. చంద్రశేఖర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, హెచ్‌యూజే ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్. శంకర్ గౌడ్, సహయ కార్యదర్శి కోన సుధాకర్ రెడ్డి నాయకులు సంపత్, గౌస్, అక్తర్ తదితరులు పాల్గొన్నారు. -
జర్నలిస్టులందరికీ హెల్త్‌కార్డులు
ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ నిజామాబాద్ సిటీ: జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బస్వాగార్డెన్‌లో నిర్వహించిన తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు యూనియన్ (టీఈఎంజేయూ) జిల్లా మహాసభలో ఆయన ప్రసంగించారు. జర్నలిస్టులందరికీ హెల్త్‌కార్డులు వస్తాయన్నారు. రాను న్న రోజుల్లో యువ నాయకత్వానికి బాధ్యతలు అప్పగించి తాను తప్పుకుంటానని, అప్పటివరకు మీ సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంటానని చెప్పారు. ఎమ్మెల్సీలు వి.గంగాధర్‌గౌడ్, డాక్టర్ భూపతిరెడ్డి, టీఈఎం జేయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణ, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతి, ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్, జమల్పూర్ గణేశ్, మధుసూదన్‌రావు, కోశాధికారి సాగర్, రాష్ట్ర నాయకులు శివాజీ, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు బాలార్జున్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు. టీఈఎంజేయూ జిల్లా నూతన కమిటీ తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు యూనియ న్ జిల్లా కమిటీని రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణ ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా పంచరెడ్డి శ్రీకాంత్, ప్రధా న కార్యదర్శిగా రవీందర్‌గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా భాస్కర్, కోశాధికారిగా కిషోర్, ఉపాధ్యక్షులుగా ఆంజనేయులు, రాము, హరీశ్, రామకృష్ణ, ఆనంద్‌పాల్, నవీన్, యూనస్, సతీశ్, అనిల్, వజి య్, తారాచంద్, సహాయ కార్యదర్శులుగా నాందేవ్, మురళి, కృష్ణాచారి, సతీష్‌గౌడ్, తారాచాంద్, బస్వారాజు, సదానంద్, శ్రీనివాస్, సయ్యద్ జకీర్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా మధుసూదన్‌రెడ్డి, గోపాల్, సాయి, రమేశ్, నవీన్, అర్షద్, రాము, శ్రీనివాస్‌రెడ్డి, ఎగ్జిక్యూటీవ్ మెంబర్లుగా వేణు, ప్రమోద్, నవీన్, విజయ్, అఫ్సర్, శ్రీనివాస్, నవీన్, కిషోర్ నియమితులయ్యారు. -
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు సోమవారం సచివాలయంలో మంత్రిని కలసి వినతిపత్రం సమర్పించారు. అర్హులైన వారికి వెంటనే అక్రెడిటేషన్లు మంజూరు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే తమకు కూడా ఆరోగ్యబీమా వర్తింపచేయాలని, జస్టిస్ గురుభక్ష్ నివేదిక ప్రకారం వేతన సవరణ, అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలనే డిమాండ్లను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కేటీఆర్ అధికారులతో తన ఛాంబర్లో సమావేశమై జర్నలిస్టుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సూచించారు. అక్రెడిటేషన్లకు సంబంధించి ఈ నెల 24న ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన కమిటీ సమావేశమవుతుందన్నారు. అదే విధంగా జిల్లా స్థాయిలో కలెక్టర్ల అధ్యక్షతన జిల్లా అక్రెడిటేషన్ల కమిటీలు కూడా ఏర్పాటుచేస్తామన్నారు. జర్నలిస్టులకు ఆరోగ్యబీమా కార్డులు జారీ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డా.కెవీ రమాణాచారి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సమాచార పౌరసంబంధాల కమిషనర్ బీపీ ఆచార్య, వైద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్‌చంద, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్‌మిశ్రా, రాష్ట్ర సమాచారశాఖ డెరైక్టర్ వి.సుభాష్ లతో పాటు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తా : మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. సోమవారం జర్నలిస్టు సంఘాల నేతలు సచివాలయంలో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. దీనిపై వెంటనే మంత్రి కేటీఆర్ స్పందించి అధికారులతో తన ఛాంబర్లో సమావేశం నిర్వహించారు. జర్నలిస్టులకు సంబంధించి వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సూచించారు. అక్రెడిటేషన్లకు సంబంధించి ఈనెల 24న ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన రాష్ట్రస్థాయి కమిటీ సమావేశమవుతుందన్నారు. అదే విధంగా జిల్లా స్థాయిలో కలెక్టర్ల అధ్యక్షతన జిల్లా అక్రెడిటేషన్ల కమిటీలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. జర్నలిస్టులకు ఆరోగ్య భీమా కార్డులు జారీ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టు సంఘాల నాయకులు మాట్లాడుతూ.. అర్హులైన వారికి వెంటనే అక్రెడిటేషన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే తమకు కూడా ఆరోగ్యభీమా వర్తింపచేయాలని, జస్టిస్ గురుభక్ష్ నివేదిక ప్రకారం వేతన సవరణ, అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలనే డిమాండ్లను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డా.కెవీ రమాణాచారి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సమాచార పౌర సంబంధాల కమిషనర్ బీపీ ఆచార్య, వైద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్‌చంద, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్‌మిశ్రా, రాష్ట్ర సమాచారశాఖ డెరైక్టర్ వి.సుభాష్ లతో పాటు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.