సాక్షి, హైదరాబాద్: వర్కింగ్ జర్నలిస్టులకు మేడే కానుకగా ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 5 లక్షలు ప్రమాద బీమా ప్రకటించడంపై తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(టీయూడబ్ల్యూజే) హర్షం వ్యక్తం చేసింది. దేశంలో మరెక్కడా ఇలాంటి పథకం లేదని యూనియన్ నాయకులు తెలిపారు.
సంపాదకుల కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు, అక్రెడిటేషన్ కార్డులను కూడా వెంటనే జారీ చేయాలని జర్నలిస్ట్ సంఘాల నేతలు దేవులపల్లి అమర్, కె. శ్రీనివాస్‌రెడ్డి, అమర్‌నాథ్, వై.నరేందర్‌రెడ్డి, దాసరి కృష్ణారెడ్డి, నగునూరి శేఖర్, కె. విరాహత్ అలీ, కోటిరెడ్డి, వెలిజాల చంద్రశేఖర్‌లు ప్రభుత్వాన్ని కోరారు.