సాక్షి, అనంతపురం : రాష్ట్ర విభజనకు నిరసనగా ఎన్జీఓలు గురువారం నుంచి సమ్మె బాట పట్టడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో పాలన స్తంభించింది. పార్లమెంటులో విభజన బిల్లు పెడితే ఎలాంటి త్యాగాలకైనా సిద్దంగా వున్నామంటూ ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరించారు. రెవెన్యూ ఉద్యోగులు, ఇరిగేషన్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తదితర కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులందరూ రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు.
అనంతపురం జిల్లాలో వున్న 22 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల సిబ్బంది సమ్మెలో వెళ్లడంతో రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారు వెనుదిరిగి వెళ్లారు. వీటి వల్ల రూ. అర కోటి ఆదాయానికి బ్రేక్ పడింది. ఎన్జీఓలు అనంతపురం నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ, డీపీఓ, మున్సిపల్ కార్పొరేషన్, డ్వామా, జెడ్పీ తదితర ప్రభుత్వ కార్యాలయాల గేట్లకు తాళాలు వేసి అక్కడే బైఠాయించి నినాదాలు చేశారు.
= కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్‌ను అడ్డుకొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఐసీడీఎస్ పీడీ జుబేదాబేగం, సిబ్బందిని బయటకు పంపారు. కలెక్టర్ కార్యాలయంలో ఒక్క ఫైల్ కూడా ముందుకు కదలలేదు. ట్రెజరీ కార్యాలయం నుంచి వెళ్లాల్సిన బిల్లులకూ అంతరాయం ఏర్పడింది. ట్రెజరీ అధికారులు సమ్మెలో లేకపోయినప్పటికీ కార్యకలాపాలను ఎన్జీఓలు అడ్డుకున్నారు.
స్తంభించిన పాలన
Published Fri, Feb 7 2014 3:06 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement