నేడు ములుగు బంద్‌ | Today mulugu bandh | Sakshi
Sakshi News home page

నేడు ములుగు బంద్‌

Published Tue, Oct 4 2016 12:45 AM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM

Today mulugu bandh

ములుగు : ములుగు కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం జిల్లా సాధన సమితి బంద్‌కు పిలుపునిచ్చింది. ఈమేరకు సోమవారం టీడీపీ, వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో మండలకేంద్రంలో సోమవారం బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సాధన సమితి అధ్యక్షుడు ముంజాల బిక్షపతి, నాయకులు మాట్లాడారు. ములుగు జిల్లా కాకుంటే మంత్రి చందూలాల్, ఎంపీ సీతారాంనాయక్‌ పూర్తి బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. బంద్‌కు అన్ని వర్గాలు సహకరించాలని కోరారు. ఆయా పార్టీల నాయకులు వేముల భిక్షపతి, చింతలపూడి నరేందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, స్వామి, నూనె శ్రీనివాస్, మహేందర్, పైడిమల్ల శత్రజ్ఞుడు, చెట్టబోయిన సారంగం, వెంకట్, గుగులోతు సమ్మయ్య, కనకం దేవదాసు, హరి, లియాఖత్‌అలీ పాల్గొన్నారు. కాగా మంగళవారం జరిగే ములుగు బంద్‌కు టీడీపీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే సీతక్క ఓ ప్రకటనలో తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement