
సాక్షి, సంగారెడ్డి : టీఆర్‌ఎస్ ప్రచార కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. పార్టీ కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్న మంత్రి హరీష్ రావుకి తృటిలో ప్రమాదం తప్పింది. ఓ కూడలి వద్ద కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. అతి సమీపంలో బాణసంచా కాల్చడంతో పలు టపాసులు పేలి కార్యకర్తలపై పడ్డాయి. దీంతో కార్యకర్తలు భయంతో బైక్‌లను వదిలి ఒక్కసారిగా పరుగులు పెట్టారు. బాణసంచా పొగల్లో హరీష్ రావు చిక్కుకున్నారు. వెంటనే అప్రమత్తమైన ముగ్గురు గన్‌మెన్లు ఆయనకు రక్షణగా నిలిచారు. అనంతరం మంత్రిని అక్కడి నుంచి తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment