సాక్షి, గుంటూరు: ప్రభుత్వం, ప్రజలకు మధ్య గ్రామ వాలంటీర్లు వారధులుగా ఉండి.. పార్టీలకు అతీతంగా పనిచేయాలని హోంమంత్రి సుచరిత పిలుపునిచ్చారు. సోమవారం గుంటూరులో గ్రామ వాలంటీర్ల శిక్షణ తరగతులను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శామ్యూల్ ఆనంద్,అధికారులు పాల్గొన్నారు. కొల్లూరులో గ్రామ వాలంటీర్ల శిక్షణా తరగతులను వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబానికి అందేలా వాలంటీర్లు నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. నరసరావుపేటలో షాదీఖానాలో గ్రామ వాలంటీర్లుకు శిక్షణా తరగతులను ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు.
విశాఖ జిల్లా: నర్సీపట్నంలో గ్రామ వాలంటీర్లలకు శిక్షణ తరగతులను ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్‌గణేష్ ప్రారంభించారు. రోలుగుంట,చోడవరం మండల పరిషత్ కార్యాలయాల్లో నిర్వహించిన గ్రామ వాలంటీర్ల శిక్షణ కార్యక్రమంలో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాల పథకాలు అమలు చేసి.. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. కోవూరులో గ్రామ వాలంటీర్లకు నియామక పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగాది రోజున అర్హులందరికి ఇళ్ల స్థలాలు ఇస్తామని తెలిపారు.
వైఎస్సార్ జిల్లా: బద్వేలు మున్సిపాలిటీ మండల కేంద్రాల్లో గ్రామ వాలంటీర్ల శిక్షణా తరగతులను ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ప్రారంభించారు.
విజయనగరం జిల్లా: బోగాపురం నియోజకవర్గం భోగాపురం, డెంకాడ మండలాల్లో గ్రామవాలంటీర్ల శిక్షణా కార్యక్రమంలో నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు, మండలపార్టీ నాయకులు ఉప్పాడ సూర్యనారాయణరెడ్డి, బంటుపల్లి వాసుదేవరావు, రావాడ బాబు తదితరులు పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా: కందుకూరు ఎండీవో కార్యాలయంలో గ్రామ వాలంటీర్ల శిక్షణ తరగతుల్లో ఎమ్మెల్యే మానుగుంట మహిధర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవరత్నాల పథకాలను ప్రజలందరికి చేరవేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కృష్ణాజిల్లా: జగ్గయ్యపేట లో వార్డు వాలంటీర్ల శిక్షణ తరగతులను ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువయ్యేలా చేయవలసిన బాధ్యత వాలంటీర్ల పై ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment