trining clases
-
యూఎస్ ఎంబసీ రిక్రూట్మెంట్.. తొమ్మిది వారాల ట్రైనింగ్
ఢిల్లీలోని అమెరికన్ సెంటర్లోని.. ప్రీమియర్ బిజినెస్ ఇంక్యుబేటర్ 'నెక్సస్' తన 20వ కోహోర్ట్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇది 2025 ఫిబ్రవరి 2న నుంచి తొమ్మిది వారాల శిక్షణా కార్యక్రమం. ఈ విషయాన్ని ఎంబసీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వెల్లడించింది. ఈ ప్రోగ్రామ్ కోసం జనవరి 5 లోపల అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.నెక్సస్ కోహోర్ట్ ప్రోగ్రామ్ ద్వారా.. భారతీయ & అమెరికన్ నిపుణుల నుంచి ప్రత్యేక శిక్షణ పొందవచ్చు. 2017లో మొదటి కోహోర్ట్ ప్రారంభించినప్పటి నుంచి 230 మంది భారతీయ పారిశ్రామికవేత్తలు.. 19 కోహోర్ట్‌లు నెక్సస్ నుంచి పట్టభద్రులయ్యారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ ప్రోగ్రామ్‌లో స్టార్టప్ వెంచర్లపై కృత్రిమ మేధస్సు ప్రభావం, వ్యవస్థాపకులకు మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యత వంటి వాటిని గురించి తెలియజేస్తారు.తొమ్మిది వారాల శిక్షణా కార్యక్రమంలో నాలుగు కంపెనీలు నెక్సస్తోనే ఉంటాయి. ఈ కంపెనీలకు ఇంక్యుబేటర్ సౌకర్యాలు మాత్రమే కాకుండా.. నెట్‌వర్క్‌కు కావలసిన పూర్తి యాక్సెస్ కూడా నెక్సస్ అందిస్తుంది. ఈ సమయంలో నెక్సస్ నిపుణుల బృందం వారి ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావడం.. కస్టమర్ & ఆదాయ స్థావరాలను పెంచుకోవడంలో సహాయం చేయడం ద్వారా వారి కంపెనీలను తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి వారితో కలిసి పని చేస్తుంది.నెక్సస్ 20 కోహోర్ట్ ప్రోగ్రామ్ ట్రైనింగ్ అందించడానికి.. యూఎస్ ఎంబసీ కార్యాలయం కనెక్టికట్ విశ్వవిద్యాలయంలోని గ్లోబల్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్(GTDI)తో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి కావలసిన నిధులను యుఎస్ ఎంబసీ అండ్ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అందిస్తాయి. -
ఫేస్బుక్ సీఈవోలో ఈ టాలెంట్ కూడా ఉందా? రింగులో దిగితే..
టెక్ రంగంలో తనదైన రీతిలో దూసుకెళ్తున్న మెటా 'సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్' (Mark Zuckerberg) గురించి అందరికి తెలుసు. ఈయన కేవలం సాంకేతిక రంగంలో మాత్రమే కాకుండా యుద్ధ కలల్లో కూడా మంచి ప్రావీణ్యం పొందాడు. ఇందులో భాగంగానే తాజాగా బ్రెజిలియన్ ‘జియు-జిట్సు’లో బ్లూ బెల్ట్ సాధించినట్లు తెలిపాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రముఖ బిలియనీర్ జాబితాలో ఒకరైన జుకర్‌బర్గ్ ఈ విజయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో గర్వంగా పంచుకున్నారు. ఇందులో అతని కోచ్ డేవ్ కామరిల్లోతో కలిసి కొత్త బెల్ట్ ప్రమోషన్లను జరుపుకున్నారు. ఇందులో 5వ డిగ్రీ బ్లాక్ బెల్ట్ సాధించిన డేవ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. మీరు ఒక గొప్ప కోచ్, మీ ట్రైనింగ్‌లో ఫైటింగ్ గురించి చాలా నేర్చుకున్నాను, బ్లూ బెల్ట్ సాధించే స్థాయికి ఎదగటం చాలా గౌరవంగా భావిస్తున్నా అని ఫోటోలను పోస్ట్ చేశారు. (ఇదీ చదవండి: ఇది విడ్డూరం కాదు.. అంతకు మించి.. తెల్లగా ఉందని జాబ్ ఇవ్వలేదు!) జుకర్‌బర్గ్ చేసిన పోస్టుకి డేవ్ రిప్లై ఇస్తూ.. మీ ఆసక్తికి ధన్యవాదాలు, ట్రైనింగ్ సమయంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారని గొప్పగా కొనియాడాడు. ఈ పోస్టుకి నెటిజన్లు కూడా తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఎలాన్ మస్క్ అండ్ మార్క్ మధ్య కేజ్ ఫైట్ జరుగుతుందనే వార్తలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే ఇది ఎప్పుడు జరుగుతుందనే దాని మీద ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడి కాలేదు. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck) -
డిప్యూటీ కలెక్టర్ శిక్షణకు సంతోషి
సాక్షి, హైదరాబాద్ : చైనాతో ఘర్షణలో మృతి చెందిన సంతోష్‌బాబు సతీమణి బికుమల్ల సంతోషిని డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాదిన్నర పాటు శాఖాపరమైన శిక్షణ, పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఆమెకు ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్‌గా ఏదేనీ జిల్లాలో క్షేత్రస్థాయి పాలనా వ్యవహారాల్లో శిక్షణకు పంపనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఎంసీహెచ్‌ఆర్‌సీలో జరిగే శిక్షణకు హాజరుకావాలని శనివారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
వాలంటీర్లు వారధులుగా పనిచేయాలి- హోం మంత్రి
సాక్షి, గుంటూరు: ప్రభుత్వం, ప్రజలకు మధ్య గ్రామ వాలంటీర్లు వారధులుగా ఉండి.. పార్టీలకు అతీతంగా పనిచేయాలని హోంమంత్రి సుచరిత పిలుపునిచ్చారు. సోమవారం గుంటూరులో గ్రామ వాలంటీర్ల శిక్షణ తరగతులను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శామ్యూల్ ఆనంద్,అధికారులు పాల్గొన్నారు. కొల్లూరులో గ్రామ వాలంటీర్ల శిక్షణా తరగతులను వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబానికి అందేలా వాలంటీర్లు నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. నరసరావుపేటలో షాదీఖానాలో గ్రామ వాలంటీర్లుకు శిక్షణా తరగతులను ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. విశాఖ జిల్లా: నర్సీపట్నంలో గ్రామ వాలంటీర్లలకు శిక్షణ తరగతులను ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్‌గణేష్ ప్రారంభించారు. రోలుగుంట,చోడవరం మండల పరిషత్ కార్యాలయాల్లో నిర్వహించిన గ్రామ వాలంటీర్ల శిక్షణ కార్యక్రమంలో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాల పథకాలు అమలు చేసి.. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. కోవూరులో గ్రామ వాలంటీర్లకు నియామక పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగాది రోజున అర్హులందరికి ఇళ్ల స్థలాలు ఇస్తామని తెలిపారు. వైఎస్సార్ జిల్లా: బద్వేలు మున్సిపాలిటీ మండల కేంద్రాల్లో గ్రామ వాలంటీర్ల శిక్షణా తరగతులను ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ప్రారంభించారు. విజయనగరం జిల్లా: బోగాపురం నియోజకవర్గం భోగాపురం, డెంకాడ మండలాల్లో గ్రామవాలంటీర్ల శిక్షణా కార్యక్రమంలో నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు, మండలపార్టీ నాయకులు ఉప్పాడ సూర్యనారాయణరెడ్డి, బంటుపల్లి వాసుదేవరావు, రావాడ బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా: కందుకూరు ఎండీవో కార్యాలయంలో గ్రామ వాలంటీర్ల శిక్షణ తరగతుల్లో ఎమ్మెల్యే మానుగుంట మహిధర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవరత్నాల పథకాలను ప్రజలందరికి చేరవేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కృష్ణాజిల్లా: జగ్గయ్యపేట లో వార్డు వాలంటీర్ల శిక్షణ తరగతులను ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువయ్యేలా చేయవలసిన బాధ్యత వాలంటీర్ల పై ఉందన్నారు. -
నేడు 2వ రోజు ఎమ్మెల్యే,ఎమ్మెల్సీల శిక్షణ తరగతులు
సాక్షి, అమరావతి : రాష్ట్ర శాసనసభలో అనుసరించాల్సిన నియమ, నిబంధనలపై శాసన సభ్యులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులు గురువారం రెండవ రోజు ప్రారంభంకానున్నాయి. ఏపీ అసెంబ్లీ కమిటీ హాలులో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ ఉదయం సుపరిపాలన అంశంపై ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణ రావు ప్రసంగం ఇవ్వనున్నారు. అనంతరం సభ్యులతో ముఖాముఖి కార్యక్రమం ఉండనుంది. మధ్యాహ్నం సంక్షేమ కార్యక్రమాలు, గౌరవ సభ్యుల పాత్ర అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ సీఎం ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం మాట్లాడతారు. శాసన సభ్యులు రాజకీయ నైతికత, ప్రజామోదం అంశంపై డెమోక్రటిక్ రిఫార్మ్స్ వ్యవస్థాపకులు, జనరల్ సెక్రటరీ జయప్రకాష్ నారాయణ ప్రసంగించనున్నారు. -
కారు.. పెంచెను జోరు
సాక్షిప్రతినిధి, ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కారు వేగం పెంచింది. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజకీయ కార్యకలాపాలపై మరింతగా దృష్టి సారించింది. ఇప్పటివరకు ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం, అభివృద్ధిపై దృష్టి పెట్టిన ఆ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కన్నేశారు. తమను గెలిపించే బాధ్యతలను చేపట్టే ద్వితీయ శ్రేణి నేతలు, గ్రామస్థాయి కార్యకర్తలన్న భావనతో ఉన్న ప్రజాప్రతినిధులు వారిని ఎన్నికలకు కార్యోన్ముఖులను చేసేందుకు సుదీర్ఘ ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఇప్పటివరకు చేసిన అభివృద్ధి ఓటరు చెంతకు చేరేందుకు గల మార్గాలపై ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎంపీతో సహా ఉమ్మడి జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమదైన శైలిలో ఓటర్ల నాడికి అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. వచ్చే లోక్‌సభ, శాసనసభ ఎన్నికలకు పార్టీ కార్యకర్తలను సిద్ధం చేసేందుకు, వారికి పార్టీ కార్యక్రమాలపై దిశానిర్దేశం చేసేందుకు టీఆర్ఎస్కు చెందిన ప్రజాప్రతినిధులు పూనుకుంటున్నారు. ఇప్పటికే విస్తృత పర్యటనల ద్వారా తమ నియోజకవర్గాల్లోని ప్రతి గ్రామ పంచాయతీని అనేకసార్లు చుట్టివచ్చిన నేతలు.. అక్కడి రాజకీయ పరిస్థితులపై ఒక అంచనాకు వచ్చారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నేతల్లో ఇప్పటివరకు నెలకొన్న కొంత రాజకీయ నిస్తేజాన్ని తొలగించేందుకు, వారికి చేరువ కావడానికి గల మార్గాలను ప్రజాప్రతినిధులు అన్వేషిస్తున్నారు. ప్రధానంగా ఉమ్మడి జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు విస్తరించి ఉన్న ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని కార్యకర్తలకు దశలవారీగా శిక్షణా తరగతులు నిర్వహించడం ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించడంతోపాటు కార్యకర్తల్లో రాజకీయ ఉత్తేజం కలిగించడానికి, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే నేతలకు మరింత బాధ్యతాయుతంగా పనిచేసే రీతిలో శిక్షణా తరగతులు నిర్వహించాలని పలు నియోజకవర్గాల ద్వితీయశ్రేణి నేతలు కోరుతున్నారు. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో శిక్షణా తరగతులు నిర్వహించడం ద్వారా కార్యకర్తలకు దిశానిర్దేశం చేసినట్లు ఉంటుందని, రెండు దశలుగా తరగతులు నిర్వహించడం వల్ల పార్టీ కార్యకర్తలకు శిక్షణ సులభం అవుతుందని, ఈ అంశంపై దృష్టి సారించాలని ఇప్పటికే పలు నియోజకవర్గాల మండల స్థాయి నేతలు, ప్రజాప్రతినిధులు ఎంపీని కలిసి విన్నవించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆత్మీయ సమావేశాలకు ప్రణాళికలు.. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సైతం ఇదే రీతిలో తమ నియోజకవర్గంలో శిక్షణ తరగతులు లేదా ఆత్మీయ సమావేశాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం ఎంపీ పొంగులేటి.. తాను ఎంపీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి జిల్లా అభివృద్ధికి చేసిన కృషి, మండలాలవారీగా మంజూరు చేసిన నిధులు, వాటి ద్వారా పూర్తయిన అభివృద్ధి పనులు, సీఎం, పీఎం సహాయనిధి ద్వారా తన లోక్‌సభ స్థానం పరిధిలోని ప్రజలకు వైద్య సహాయం అందించేందుకు తోడ్పడిన తీరుతోపాటు తాను చేసిన సేవా కార్యక్రమాలను క్రోడీకరించి కార్యకర్తలకు అర్థమయ్యేలా తద్వారా వాటిని గ్రామస్థాయి ఓటర్లకు వివరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించే ఎంపీ నిధుల వినియోగంలో ఇప్పటికే ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం మొదటి స్థానంలో ఉండటం, ఇతర సంక్షేమ పథకాల ద్వారా జిల్లాకు పలు సంక్షేమ కార్యక్రమాలను తెచ్చిన తీరును.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ఇందువల్ల గ్రామాలవారీగా జరిగిన లబ్ధి వివరాలను గణాంకాలవారీగా కార్యకర్తలకు శిక్షణా తరగతుల్లో అందజేయాలని యోచిస్తు న్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే ఖమ్మం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, వైరా ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్ సైతం కార్యకర్తలకు చేరువయ్యేందుకు ఇప్పటికే తమదైన రీతిలో వ్యూహ ప్రతివ్యూహాలు రూపొందించుకున్నారు. ఇక పాలేరు నియోజకవర్గానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తుండటం, ఇప్పటికే ఆ నియోజకవర్గ కార్యకర్తలకు మంత్రి ప్రత్యేక చొరవ తీసుకుని భద్రాచలంలో శిక్షణా తరగతులు నిర్వహించిన విషయం విదితమే. ఇక ఉమ్మడి జిల్లాలోని కొత్తగూడెం, అశ్వారావుపేట, పినపాక, ఇల్లెందు నియోజకవర్గాల్లోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ.. పట్టు పెంచుకునేందుకు వ్యూహప్రతివ్యూహాలు రూపొందించుకుంటున్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్యలు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. శిక్షణ తరగతులను దశలవారీగా నిర్వహించుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే వీటి నిర్వహణపై కొందరు ప్రజాప్రతినిధులకు భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. శిక్షణా తరగతుల రూపంలో కాకుండా కార్యకర్తలకు పార్టీ పరమైన పరిస్థితులు వివరించడంతోపాటు వారి కష్టసుఖాలను తెలుసుకునే రీతిలో పరిమిత సంఖ్యలో ద్వితీయశ్రేణి నేతలను రోజువారీగా కలిసి వారితో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని పలువురు ఎమ్మెల్యేలు పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక పార్టీ ఎమ్మెల్యేలు లేని మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల్లో శిక్షణా తరగతులు నిర్వహించి.. పార్టీ కార్యకర్తల్లో మరింత ఉత్సాహం నింపే దిశగా దృష్టి సారించాలని పార్టీ వర్గాలు యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
ఐపీఎస్‌ల శిక్షణాతరగతులు తాత్కాలికంగా నిలిపివేత
హైదరాబాద్ : స్వైన్‌ప్లూ కారణంగా నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణలో ఉన్న ఐపీఎస్‌లకు శిక్షణా తరగతులను తాత్కాళికంగా వాయిదా వేస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా శిక్షణలో ఉన్న 40 మంది ఐపీఎస్‌ల నుంచి రక్త నమూనాలను సేకరించారు. ఆ నమూనాలను ల్యాబ్‌లకు పంపించి, ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే శిక్షణా తరగతులను తాత్కాళికంగా వాయిదా వేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.