ఢిల్లీలోని అమెరికన్ సెంటర్‌లోని.. ప్రీమియర్ బిజినెస్ ఇంక్యుబేటర్ 'నెక్సస్' తన 20వ కోహోర్ట్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇది 2025 ఫిబ్రవరి 2న నుంచి తొమ్మిది వారాల శిక్షణా కార్యక్రమం. ఈ విషయాన్ని ఎంబసీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వెల్లడించింది. ఈ ప్రోగ్రామ్ కోసం జనవరి 5 లోపల అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నెక్సస్ కోహోర్ట్ ప్రోగ్రామ్ ద్వారా.. భారతీయ & అమెరికన్ నిపుణుల నుంచి ప్రత్యేక శిక్షణ పొందవచ్చు. 2017లో మొదటి కోహోర్ట్ ప్రారంభించినప్పటి నుంచి 230 మంది భారతీయ పారిశ్రామికవేత్తలు.. 19 కోహోర్ట్‌లు నెక్సస్ నుంచి పట్టభద్రులయ్యారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ ప్రోగ్రామ్‌లో స్టార్టప్ వెంచర్‌లపై కృత్రిమ మేధస్సు ప్రభావం, వ్యవస్థాపకులకు మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యత వంటి వాటిని గురించి తెలియజేస్తారు.
తొమ్మిది వారాల శిక్షణా కార్యక్రమంలో నాలుగు కంపెనీలు నెక్సస్‌తోనే ఉంటాయి. ఈ కంపెనీలకు ఇంక్యుబేటర్ సౌకర్యాలు మాత్రమే కాకుండా.. నెట్‌వర్క్‌కు కావలసిన పూర్తి యాక్సెస్ కూడా నెక్సస్ అందిస్తుంది. ఈ సమయంలో నెక్సస్ నిపుణుల బృందం వారి ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకురావడం.. కస్టమర్ & ఆదాయ స్థావరాలను పెంచుకోవడంలో సహాయం చేయడం ద్వారా వారి కంపెనీలను తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి వారితో కలిసి పని చేస్తుంది.
నెక్సస్ 20 కోహోర్ట్ ప్రోగ్రామ్ ట్రైనింగ్ అందించడానికి.. యూఎస్ ఎంబసీ కార్యాలయం కనెక్టికట్ విశ్వవిద్యాలయంలోని గ్లోబల్ ట్రైనింగ్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్(GTDI)తో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి కావలసిన నిధులను యుఎస్ ఎంబసీ అండ్ యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ అందిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment