
టెక్ రంగంలో తనదైన రీతిలో దూసుకెళ్తున్న మెటా 'సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్' (Mark Zuckerberg) గురించి అందరికి తెలుసు. ఈయన కేవలం సాంకేతిక రంగంలో మాత్రమే కాకుండా యుద్ధ కలల్లో కూడా మంచి ప్రావీణ్యం పొందాడు. ఇందులో భాగంగానే తాజాగా బ్రెజిలియన్ ‘జియు-జిట్సు’లో బ్లూ బెల్ట్ సాధించినట్లు తెలిపాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ప్రముఖ బిలియనీర్ జాబితాలో ఒకరైన జుకర్‌బర్గ్ ఈ విజయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో గర్వంగా పంచుకున్నారు. ఇందులో అతని కోచ్ డేవ్ కామరిల్లోతో కలిసి కొత్త బెల్ట్ ప్రమోషన్‌లను జరుపుకున్నారు. ఇందులో 5వ డిగ్రీ బ్లాక్ బెల్ట్ సాధించిన డేవ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. మీరు ఒక గొప్ప కోచ్, మీ ట్రైనింగ్‌లో ఫైటింగ్ గురించి చాలా నేర్చుకున్నాను, బ్లూ బెల్ట్ సాధించే స్థాయికి ఎదగటం చాలా గౌరవంగా భావిస్తున్నా అని ఫోటోలను పోస్ట్ చేశారు.
(ఇదీ చదవండి: ఇది విడ్డూరం కాదు.. అంతకు మించి.. తెల్లగా ఉందని జాబ్ ఇవ్వలేదు!)
జుకర్‌బర్గ్ చేసిన పోస్టుకి డేవ్ రిప్లై ఇస్తూ.. మీ ఆసక్తికి ధన్యవాదాలు, ట్రైనింగ్ సమయంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారని గొప్పగా కొనియాడాడు. ఈ పోస్టుకి నెటిజన్లు కూడా తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఎలాన్ మస్క్ అండ్ మార్క్ మధ్య కేజ్ ఫైట్ జరుగుతుందనే వార్తలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే ఇది ఎప్పుడు జరుగుతుందనే దాని మీద ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడి కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment