కూతుళ్ళ కోసం తండ్రులు ఎంత దూరమైనా వెళ్తారు. కోతి కావాలంటే కొండ మీదకు ట్రెకింగ్ చేస్తారు. చిటారు కొమ్మన మిఠాయి పొట్లం కోసం ఆకాశమెత్తు చెట్టునైనా సునాయాసంగా ఎక్కేస్తారు. జుకర్‌బర్గ్ కూడా అంతే! ఆయనెంత టెక్నాలజీ కింగ్ అయినా కూతురి దగ్గర ఒక మామూలు తండ్రే. మానవాళి కలలకు రంగులు అద్దటానికి ప్రపంచం నిరంతరం అప్‌డేట్‌లతో పరుగులు తీస్తుండే మెటా సీఈఓ 'మార్క్ జుకర్‌బర్గ్' కూతురి గోళ్లకు రంగు వేయడం కోసం ఎలా కుదురుగా కూర్చున్నారో చూడండి. మొత్తానికి టాస్క్ ఫినిష్ చేసేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
జుకర్‌బర్గ్ టేబుల్‌పైకి వంగి, తన కుమార్తె గోళ్లకు నెయిల్ పాలిష్ వేసి నెయిల్ ఆర్టిస్ట్ అయ్యారు. చిన్నారి తన నెయిల్ ఆర్ట్‌ని ప్రదర్శించడంతో క్లిప్ ముగుస్తుంది. నెటిజన్లు ఈ వీడియో చూసి తమదైన రీతిలో స్పందిస్తున్నారు.
ఇప్పటికే 20వేల కంటే ఎక్కువ లైక్స్ పొందిన ఈ వీడియో 6,25,000 కంటే ఎక్కువ వీక్షణలను పొందింది. తన కుమార్తె కోసం సీఈఓ నుంచి స్టైలిస్ట్‌గా మారారని ఒకరు కామెంట్ చేశారు. ఫాదర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇవ్వాలని ఇంకొకరు చమత్కరించారు.
క్వెస్ట్ 3ఎస్
కుమార్తె గోళ్లకు నెయిల్ పాలిష్ వేయడానికంటే ముందు జుకర్‌బర్గ్ 'క్వెస్ట్ 3ఎస్'లో మల్టిపుల్ స్క్రీన్స్ చూసారు. క్వెస్ట్ 3ఎస్ అనేది వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్. దీనిని మెటా 2024 సెప్టెంబర్ 25న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ప్రారంభించింది. దీని ధర రూ. 25,210 నుంచి రూ. 33,610 వరకు ఉంది.
ఇదీ చదవండి: జియోభారత్ కొత్త ఫోన్స్ ఇవే.. ధర తెలిస్తే కొనేస్తారు!
మెటా క్వెస్ట్ 3ఎస్ హెడ్‌సెట్.. సినిమా సైజ్ స్క్రీన్‌పై మీకు ఇష్టమైన షోలను చూడటానికి మాత్రమే కాకుండా, మీరు ఎక్కడికెళ్లినా మీతో పాటు తీసుకెళ్లడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది గేమ్స్ వంటివి ఆడటానికి కూడా అనుమతిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment