
( ఫైల్ ఫోటో )
గుంటూరు: ఉద్యోగుల సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారం అవుతాయని హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు. తాము చర్చలకు అవకాశం ఇవ్వడం లేదనేది అబద్ధమని, ఉద్యోగులు సహకరించాలని సీఎం వైఎస్ జగన్ చెప్పిన విషయాన్ని సుచరిత గుర్తుచేశారు.
జిన్నా టవర్ వద్ద సర్వమత ప్రార్థనలు చేసిన సుచరిత.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘కమిటీ కూడా వేశాం. ఉద్యోగులకు మేలు చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉంది. చర్చలకు సహకరించండి’ అని పేర్కొన్నారు.