
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా నిర్మల హృదయ భవన్‌లో మానసిక వికలాంగులు, పేదలకు.. పండ్లు , స్వీట్స్ , దుప్పట్లు, దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు, హీరో సుమన్ పాల్గొన్నారు.
చదవండి: ఓటీఎస్ ద్వారా 52 లక్షల మంది పేదలకు లబ్ధి: శ్రీరంగనాథరాజు
ఈ సందర్భంగా హీరో సుమన్ మాట్లాడుతూ, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరుకూ పలు ముఖ్యమంత్రుల పనితీరు పరిశీలించానని.. వైఎస్సార్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని.. ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ అంతకంటే ఎక్కువ పథకాలు అమలు చేస్తున్నారన్నారు.
హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ, సీఎంగా వైఎస్ జగన్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆయన కుటుంబంపై దేవుడి ఆశీస్సులు మెండుగా ఉండాలన్నారు.పెదకూర పాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ, వైఎస్సార్ తాను అమలు చేసిన పథకాలతో రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. అందకంటే ఎక్కువగా సీఎం వైఎస్ జగన్ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment