సాక్షి, గుంటూరు: రాజధాని కోసం భూములా, భూముల కోసం రాజధానియా అన్న అంశంపై చర్చ జరగాలని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రైతులు తామర పురుగుతో నష్టపోయారు. చంద్రబాబు మరో రసం పీల్చే పురుగు. 2019లో లేవలేని స్థాయిలో ప్రజలు పురుగు మందు కొట్టారు. పోగాలం ఎవరికి దాపురించిందో 2019 నుంచి చూస్తున్నాం. సెన్స్ ఉండే చంద్రబాబు మాట్లాడుతున్నారా? బాబు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. రాష్ట్ర ప్రయోజనాలు అంటే రియల్ ఎస్టేట్ ప్రయోజనం అనుకున్నారు.
సొంత మనుషుల చేత భూములు కొనిపించి అమరావతి పెట్టారు. తోటలు తగులబెట్టి భూములు లాక్కొన్నారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలను ఆదుకోవాలని సీఎం జగన్ పాలన చేస్తున్నారు. భూముల వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బులతో రాజకీయం చేయడం చంద్రబాబుకు అలవాటు. రిటైర్డ్ జస్టిస్ చంద్రు వ్యాఖ్యలపై చంద్రబాబు మండిపడుతున్నారు. చంద్రు వాస్తవాలు మాట్లాడితే తప్పుపడుతున్నారు.
చదవండి: (మంత్రి పేర్ని నానికి అదనపు బాధ్యతలు.. ఉత్తర్వులు జారీ..)
అచ్చెన్నాయుడు తప్పెటగూళ్లు బ్యాచ్ పులివెందులలో గెలుస్తాం అంటున్నారు. ముందు కుప్పం సంగతి చూసుకోండి. న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్రకు ఎవరు స్పాన్సర్డ్ అనేది అందరికి తెలుసు’ అని మంత్రి కన్నబాబు అన్నారు.
ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారు: హోం మంత్రి
ప్రజలకు మంచి చేయడం చూసి టీడీపీ తట్టుకోలేకపోతోందని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. 'వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 2019లో అధికారం ఇచ్చారు. సీఎం జగన్‌ను వ్యక్తగతంగా దూషిస్తున్నారు. కుప్పం ఓటమిపై ఆత్మపరిశీలన చేసుకోకుండా ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబును ఆస్పత్రిలో చూపించాలని కుటుంబ సభ్యులకు చెప్తున్నాను. సామాన్యుడు వెళ్లి రాజధానిలో ఉండలేని పరిస్థితి తీసుకొచ్చారు. రిటైర్డ్ జస్టిస్ చంద్రు వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. న్యాయవ్యవస్థలు ఏవిధంగా ఉన్నాయో ఉన్నది ఉన్నట్లు చంద్రు చెప్పారు' అని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment