ఒంగోలులో 16 ఏళ్ల బాలికపై గ్యాంగ్‌రేప్ ఘటనపై ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత సీరియస్‌గా స్పందించారు. ఈ ఘటనపై విచారణ వేగవంతం చేయాలని ప్రకాశం జిల్లా ఎస్పీని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు, ఒంగోలు ఆస్పత్రిలో బాధిత బాలికను మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి పరామర్శించారు. నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టమని ఆయన స్పష్టం చేశారు.