ఒంగోలు అత్యాచార ఘటనపై సీఎం జగన్‌ ఆరా | AP CM YS Jagan Mohan Reddy Ask About Ongole Molestation Incident | Sakshi
Sakshi News home page

పరిహారం విషయంలో ఉదారంగా ఉండాలి

Published Tue, Jun 25 2019 3:31 PM | Last Updated on Tue, Jun 25 2019 3:51 PM

AP CM YS Jagan Mohan Reddy Ask About Ongole Molestation Incident - Sakshi

సాక్షి, ప్రకాశం : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒంగోలు సామూహిక అత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. ఈ మేరకు ప్రకాశం జిల్లా ఎస్పీని అడిగి వివరాలు తెలుసుకున్నారు. 24 గంటల్లోగా నిందితులను పట్టుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. త్వరితగతిన నిందితులను అరెస్ట్‌ చేసినందుకు పోలీసు అధికారులను మెచ్చుకున్న సీఎం జగన్‌.. బాధితురాలికి నష్టపరిహారం ఇవ్వాలని హోం మంత్రిని ఆదేశించారు. దాంతో రూ. 5 లక్షల పరిహారం అందిస్తున్నామని హోం మంత్రి సుచరిత తెలిపారు. కాగా పరిహారం విషయంలో ఉదారంగా ఉండాలని జగన్‌ సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement