సాక్షి, ప్రకాశం: ఒంగోలులో అత్యాచారానికి గురైన బాలికకు రూ.10 లక్షల పరిహారంతో పాటు భద్రత కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. తల్లిదండ్రులు కంటే శ్రేయోభిలాషులు మరొకరు ఉండరని పిల్లలు గుర్తించాలని ఆమె సూచించారు. పాఠశాలల్లో బాలికలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా.. దేశంలో ఉన్న చట్టాల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. మరోవైపు అమలులో ఉన్న చట్టాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో స్వపక్షం వారు ఉన్న విపక్షం వారు ఉన్న శిక్ష తప్పదని హోంమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సామూహిక అత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇదివరకే ఆరా తీసిన విషయం తెలిసిందే. పరిహారం విషయంలో ఉదారంగా ఉండాలని సీఎం ఆదేశించారు.
ఒంగోలులో 16 ఏళ్ల బాలికపై ఆరుగురు యువకులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే. 10రోజులు బాలికను నిర్బంధించి దుండగులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. గుంటూరులో పదో తరగతి చదువుతున్న యువతి.. ప్రియుడి కోసం ఒంగోలు వచ్చింది. ఎన్ని సార్లు ఫోన్ చేసినా అతను రాకపోవడంతో.. బస్టాండ్‌లోనే ఉండిపోయింది. బస్టాండ్‌లో పనిచేస్తున్న బాజి అనే దివ్యాంగుడు ఆ బాలికను గమనించి.. మాయమాటలు చెప్పి.. సమీపంలోని ఓ గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ స్నేహితుడితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు.
వైఎస్సార్‌సీపీ నేతలపైనే దాడులు..
ప్రకాశం జిల్లా చినగంజాం వద్ద టీడీపీ కార్యకర్త పద్మ ఆత్మహత్య ఘటన పట్ల హోంమంత్రి సుచరిత స్పందించారు. రాష్ట్రంలో టీడీపీ వాళ్ళ కంటే అధికారంలోనే వైఎస్సార్‌సీపీ నేతలపైనే దాడులు ఎక్కువ అయ్యాయన్నారు. మాములు దాడులకు కూడా రాజకీయ రంగు పులుముతున్నారని అభిప్రాపయడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment