
మాజీ సీఎం వైఎస్ జగన్‌తోనే చివరి వరకు తమ ప్రయాణం కొనసాగుతుందని మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత, విశ్రాంత ఐఆర్‌ఎస్ అధికారి మేకతోటి దయాసాగర్ తెలిపారు.
తాడికొండ: మాజీ సీఎం వైఎస్ జగన్‌తోనే చివరి వరకు తమ ప్రయాణం కొనసాగుతుందని మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత, విశ్రాంత ఐఆర్‌ఎస్ అధికారి మేకతోటి దయాసాగర్ తెలిపారు. కొన్ని మీడియా ఛానెళ్లలో తమపై వస్తున్న ఊహాగానాలపై వారు స్పందించారు. అవన్నీ అవాస్తవమన్నారు.
గతంలో కూడా తాము టీడీపీలో చేరుతున్నట్లు ప్రచారం జరిగిందని, అప్పుడే తాము వైఎస్సార్సీపీలోనే కొనసాగుతామని స్పష్టం చేశామన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చిన తాను ఆయన మరణానంతరం వైఎస్సార్సీపీలో చేరి నాటి నుంచి నేటి వరకు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా కొనసాగుతున్నానని తెలిపారు.