
సాక్షి, విజయవాడ: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు నేటి నుంచి పది రోజులపాటు జరగనున్నాయి. ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న సంస్మరణ దినోత్సవ సభలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి హోం మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్ స్వాగతం పలికారు.
ఉదయం 8 గంటలకు స్టేడియానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం పెరేడ్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్ గౌరవ వందనం స్వీకరించారు. 'అమరులు వారు' పుస్తకాన్ని ఆవిష్కరించారు. దాదాపు గంటపాటు సాగనున్న సీఎం ప్రోగ్రాంకి పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో సీఎంతో పాటు హోం మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్ పాల్గొన్నారు. (నేడే ‘వైఎస్సార్ బీమా’)