Police Martyr’s day
-
రాష్ట్రంలో నేరగాళ్లు కొత్త రూపంలో వస్తున్నారు: సీఎం జగన్
-
ఖాకీదుస్తులు త్యాగానికి ప్రతీక
‘ప్రియమైన పోలీసు ధీశాలులారా... మహమ్మారైనా, ఆపత్కాలమైనా, శాంతి సమయమైనా మీరే మా ధైర్యం’ అని పేర్కొంటూ తెలంగాణలోని ఒక మారుమూల గ్రామంలో కట్టిన బ్యానర్... సాధారణ ప్రజలకు పోలీ సుల మీద కలిగిన నమ్మకానికి నిదర్శనం అనవచ్చు. తెలంగాణ రాష్ట్రా విర్భావ అనంతరం పీపుల్స్ ఫ్రెండ్లీగా, పోలీసులు అంటే ప్రజల సేవ కులు, ప్రజలే బాసులు అనే విశ్వాసం కలిగే విధంగా తెలంగాణా పోలీస్ శాఖ ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగానే, ఒక కెమెరా వంద మంది పోలీసులతో సమానం అనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సహకారంతో పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల సీసీటీవీల ఏర్పాటు లక్ష్యానికి గానూ ఇప్పటివరకు 8.25 లక్షల ఏర్పాటు పూర్తయింది. డయల్ 100, ప్రత్యేకంగా మహిళా భద్రతా విభాగం ఏర్పాటు, స్వతంత్ర భారత చరిత్రలో మరెక్కడా లేని విధంగా దాదాపు 80 వేల మందికి పైగా పోలీసు అధికారుల నియామకం, కొత్త పోలీసు కమిషనరేట్లు, పోలీస్ స్టేషన్లు, చీమ చిటుక్కుమన్నా తెలుసుకునే కమాండ్ కంట్రోల్ నిర్మాణం... ఇలా తెలంగాణ పోలీస్ శాఖ తన విధుల్లో ఎంతో ముందుంది. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా తీవ్రవాదులు, సంఘ విద్రోహక శక్తుల చేతుల్లో 377 మంది పోలీసులు అమరులయ్యారు. తెలంగాణలో ఒక్క ప్రాణాపాయం జరగకపోవడం గమనార్హం. అయితే ఇప్పటివరకూ 326 మంది తెలంగాణ పోలీసులు మావోయిస్టు, ఎంఎల్ గ్రూపు నక్సలైట్ల చేతుల్లో అమరులయ్యారు. వీరిలో కానిస్టేబుళ్ల నుంచి ఐపీఎస్ అధికారుల వరకు ఉన్నారు. ఖాకీ దుస్తులు అంటేనే త్యాగాలకు ప్రతీక అనే విష యాన్ని పోలీసులు తమ విధుల ద్వారా చాటుతున్నారు. ప్రజల భద్రత, శాంతి పరిరక్షణ కోసం నిస్వార్థ సేవలందించిన ఈ అమర పోలీసులకు దేశ ప్రజలు అక్టోబర్ 21న నివాళులు అర్పిస్తున్నారు. – కన్నెగంటి వెంకటరమణ, జాయింట్ డైరెక్టర్, సమాచార, పౌర సంబంధాల శాఖ, హైదరాబాద్ -
నేడు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం
సాక్షి, అమరావతి: విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరు కానున్నారు. ఉదయం 8 గంటలకు స్టేడియం చేరుకుని పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. తర్వాత అమరవీరులు పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. ప్రసంగం అనంతరం పోలీస్ అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించనున్నారు. అమరులైన పోలీసుల కుటుంబ సభ్యులకు సీఎం ఆర్థిక సాయం అందిస్తారు. కార్యక్రమం అనంతరం సీఎం జగన్ తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి : సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా అమరవీరుల కుటుంబాలను శుక్రవారం సీపీ సజ్జనార్ పరామర్శించారు. ఐపీఎస్, స్వర్గీయ చదలవాడ ఉమేష్ చంద్ర ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన తల్లిదండ్రులను సీపీ ఘనంగా సత్కరించారు. అలాగే పోలీస్ అమరవీరుడు కానిస్టేబుల్ ఈశ్వర్ రావు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను సజ్జనార్ పరామర్శించారు. బాధిత కుటుంబాలకు పోలీస్ డిపార్ట్మెంట్ తరపున అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. చదవండి: దయచేసి సాహసాలు చేయొద్దు: సీపీ సజ్జనార్ సీపీ వెంట శంషాబాద్ డీసీపీ ఎన్ ప్రకాష్ రెడ్డి, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎమ్ విజయ్ కుమార్, ఐపీఎస్., డీసీపీ క్రైమ్స్ రోహిణీ ప్రియదర్శినీ, ఐపీఎస్, విమన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ అనసూయ, బాలానగర్ డీసీపీ పద్మజా, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఏడీసీపీ మాణిక్ రాజ్, ఏసీపీ మాదాపూర్ రఘునందన్ రావు, బాలానగర్ ఏసీపీ పురుషోత్తం, జీడిమెట్ల ఇన్ స్పెక్టర్ బాలరాజు, ఇన్‌స్టెక్టర్ గురవయ్య తదితరులు ఉన్నారు. -
పోలీస్ అమరవీరులకు సీఎం జగన్ నివాళి
-
పోలీస్ అమరవీరులకు సీఎం జగన్ నివాళి
సాక్షి, విజయవాడ: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు నేటి నుంచి పది రోజులపాటు జరగనున్నాయి. ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న సంస్మరణ దినోత్సవ సభలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి హోం మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్ స్వాగతం పలికారు. ఉదయం 8 గంటలకు స్టేడియానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం పెరేడ్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్ గౌరవ వందనం స్వీకరించారు. 'అమరులు వారు' పుస్తకాన్ని ఆవిష్కరించారు. దాదాపు గంటపాటు సాగనున్న సీఎం ప్రోగ్రాంకి పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో సీఎంతో పాటు హోం మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్ పాల్గొన్నారు. (నేడే ‘వైఎస్సార్ బీమా’) -
ఏపీ: పోలీసులకు శుభవార్త
సాక్షి, అమరావతి: బుధవారం నుంచి పదిరోజులపాటు పోలీసు అమర వీరుల సంస్మరణ దినాలుగా జరపనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ప్రకటించింది. ఈ సందర్భంగా సహజ మరణానికి ఇచ్చే బీమా మొత్తం రూ. 1.5 లక్షల నుంచి రూ. 3లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పోలీసుల కోసం ఎస్బీఐ జీవన్ జ్యోతి బీమా, సురక్ష బీమా ఎంఓయూలపై ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ సంతకం చేయించారు. ప్రతి పోలీసు స్టేషనుకు వెళ్లి రేపటి నుంచి పాలసీలు అందించనున్నారు. ఈరోజు లాంఛనంగా లా అండ్ ఆర్డర్ ఏడీజీ శివశంకర్, కానిస్టేబుళ్ళు డి.రజని, దుర్గా ప్రసాద్‌లకు పాలసీలు అందించారు. ఈ సందర్భంగా ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ మాట్లాడుతూ, పోలీసుల అద్భుత సేవలకు సెల్యూట్ చేశారు. వారికి 40లక్షల వరకూ యాక్సిడెంటల్ పాలసీ , 3లక్షల వరకు సహజమరణం పాలసీ అందించనున్నట్లు తెలిపారు. సంవత్సరానికి 12 రూపాయలు కడితే రెండు లక్షల బీమా లభిస్తుందని తెలిపారు. సుకన్య సమృద్ధి యోజనను కూడా అందరూ వినియోగించుకోవాలి అని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీస్ సిబ్బందికి వీక్లీ ఆఫ్ ఏపీ లో అమలు జరుగుతోందని పేర్కొన్నారు. మహిళల రక్షణ కొరకు దిశ యాప్, దిశ పోలిస్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులో ఉండే విధంగా 87 రకాల సేవలతో పోలీస్ సేవా యాప్ అందుబాటులోకి తెచ్చామన్నారు. రికార్డు స్థాయిలో దేవాలయాలకు సంబంధించిన 306 కేసులను ఏపీ పోలీసు శాఖ చేధించిందని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 57,270 ఆలయాలు ,ప్రార్థనా మందిరాలకు జియో ట్యాగింగ్ తో మ్యాపింగ్ చేశామని, అంతర్వేది రధం ఘటన అనంతరం దేవాలయాలకు సంబంధించి 33 కేసులు నమోదు అయ్యాయని ప్రకటించారు. అందులో 27 కేసులు చేధించి తరచుగా నేరాలకు పాల్పడుతున్న 54 మంది పాత నేరస్ధులను గుర్తించామని పేర్కొన్నారు. 130 మందిని అరెస్టుచేసి , 1196 మందిని బైండ్ ఓవర్ చేసినట్లు చెప్పారు. దిశా అప్లికేషన్‌ను 11 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారన్నారు. ఎస్ఓఎస్ యాప్ ద్వారా 79,648 వినతులు వచ్చాయని, వీటిలో 604 కాల్స్ పై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. 122 ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయని, రాష్ట్రంలో జీరో ఎఫ్ఐఆర్ లు 2019లో 62 నమోదు కాగా, 2020 ఇప్పటి వరకూ 279 నమోదు అయినట్లు వెల్లడించారు. రాష్ట్రం లో నేరాల సంఖ్య 18 శాతం తగ్గిందని గౌతం సవాంగ్ ప్రకటించారు. చదవండి: ఏపీ పోలీసులు మంచి నిర్ణయం తీసుకున్నారు.. -
అమరుల త్యాగాలే స్ఫూర్తి
సాక్షి, హైదరాబాద్: పోలీసు అమరుల త్యాగాలే స్ఫూర్తిగా ముందుకెళ్తున్నామని, నేర రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చదిద్దేందుకు అహరి్నశలు కృషి చేస్తున్నామని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. పోలీసు అమరువీరుల దినోత్సవ వేడుకలు సోమవారం గోషామహల్ పోలీసు మైదానంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర పోలీ సులు విధి నిర్వహణలో శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారన్నారు. వారి సేవలు చిరస్మరణీయమని, రాష్ట్రంలో ఎలాంటి అలజడులు రాకుండా పకడ్బందీగా వ్యవహరిస్తున్నారని ప్రశంసించారు. డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. 1959లో చైనా–భారత్ సరిహద్దులో చైనా దురాక్రమ ణను అడ్డుకునేందుకు ప్రాణాలరి్పంచిన సీఆరీ్పఎఫ్ జవాన్ల అమరత్వానికి చిహ్నం గా ఏటా పోలీసు అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. పోలీసు అమరులకు సీఎం కేసీఆర్ నివాళి శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్న పోలీసుల నిబద్ధత, దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికులకు ఏమాత్రం తీసిపోనిదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. సంఘ వ్యతిరేక శక్తులను అదుపు చేసే క్రమంలో పోలీసులు ప్రాణాలు కూడా అరి్పస్తున్నారని, ప్రజల కోసం ప్రాణాలర్పించిన వారు ఎప్పటికీ అమరులుగా ఉండిపోతారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. -
రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై కేంద్రమంత్రులతో ఆయన చర్చించనున్నారు. కేంద్ర హోంమంత్రి సహా పలువురు కేంద్ర మంత్రులను సీఎం జగన్ కలుసుకుంటారు. రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు ముఖ్యమంత్రి ఢిల్లీ చేరుకుంటారు. రాత్రికి ఢిల్లీలోనే బస చేస్తారు. 22వ తేదీ సాయంత్రం 7 గంటల ప్రాంతంలో విశాఖపట్నం చేరుకుని, సాయిప్రియా రిసార్ట్స్‌లో అరకు ఎంపీ మాధవి, శివప్రసాద్‌ల వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు. అనంతరం అదేరోజు రాత్రి తాడేపల్లి చేరుకుంటారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్లొననున్న సీఎం జగన్ రేపు ఉదయం 8 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు అవుతారు. పోలీస్ త్యాగధనులకు ముఖ్యమంత్రి నివాళులు అర్పిస్తారు. -
రక్షణ విధుల్లో.. రక్తపుధారలు
సాక్షి, సిరిసిల్ల : శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు రేయింబవళ్లు అప్రమత్తంగా ఉండాల్సిందే. రక్షణ విధుల్లో పోలీసుల అమరత్వం రాజన్న సిరిసిల్ల జిల్లాలో రక్తంచిందింది. సబ్ ఇన్స్పెక్టర్ నుంచి హోంగార్డు దాకా జిల్లాలో విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులున్నారు. అసాంఘిక శక్తులను కట్టడి చేసే క్రమంలో తమ ప్రాణాలు తృణప్రాయంగా అర్పించారు. కల్లోల ఖిల్లాగా పేరున్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో దశాబ్దకాలం కిందల నక్సలైట్లు, పోలీసుల మధ్య యుద్ధ వాతావరణ నెలకొంది. ఈ నేపథ్యంలో అనేక హింసాత్మక ఘటనలు జరిగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పోలీసులు విధి నిర్వహణలో నక్సలైట్ల చేతుల్లో ప్రాణత్యాగాలు చేసి అమరత్వం పొందారు. జిల్లాలో సంఘటనలు 1991లో ఎల్లారెడ్డిపేట మండలకేంద్రంలో శ్రీనివాస్‌రావు అనే హోంగార్డును నక్సలైట్లు గాంధీ విగ్రహం వద్ద హతమార్చారు. 1994లో అక్టోబర్ 28న గంభీరావుపేట మండలకేంద్రంలో అప్పటి ఎస్సై సాబీర్ఖాన్ను మావోయిస్టు నక్సలైట్లు కాల్చిచంపారు. ఆయన నమాజ్‌కు వెళ్లి వస్తుండగా మావోయిస్టులు కాల్పులు జరిపారు. 1996లో కోనరావుపేట మండలం నిజామాబాద్ శివారులో మావోయిస్టు నక్సలైట్లు కల్వర్టు కింద మందుపాతర పేల్చగా మోహన్‌రావు, నజీరోద్దీన్ అనే కానిస్టేబుల్ మృత్యువాతపడ్డారు. 1997లో కోనరావుపేట ఎస్సై ఎం.శ్రీనివాస్‌గౌడ్‌ను ఎగ్లాస్పూర్ గుట్టల్లో మావోయిస్టు నక్సలైట్లు కాల్చిచంపారు. 1997 సెప్టెంబర్ 7న చందుర్తి ఎస్ఐ శ్రీనివాస్‌రావును లింగంపేట– రుద్రంగి మధ్య మందుపాతర పేల్చి హతమార్చారు. 1999లో కోనరావుపేట మండలం నిమ్మపల్లి వద్ద తిరునగరి శ్రీనివాసచారి అనే హోంగార్డును మావోయిస్టు నక్సలైట్లు హతమార్చారు. 2003 ఫిబ్రవరి 11న కోనరావుపేట మండలం వట్టిమల్ల వద్ద కొడిమ్యాల పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహించే హెంకు నాయక్, కృష్ణ అనే పోలీసు కానిస్టేబుళ్లను జనశక్తి నక్సలైట్లు కాల్చిచంపారు. -
‘వసూళ్లు’ ఆగేనా..?
నిర్మల్ : పోలీసులు.. అంటే సమాజాన్ని తన కుటుంబంగా భావించి రక్షించేవారు. ఎన్ని ఆటంకాలొచ్చినా విధి నిర్వహణలో శాంతిభద్రతల కోసమే శ్రమించేవారు. ప్రజారక్షణలో ప్రాణాలను కూడా త్యాగం చేసిన పోలీసులూ ఉన్నారు. తెలం గాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫ్రెండ్లీ పోలీసుగా ప్రజల్లో కలిసి పోయి సేవకులుగామారిన పోలీసులూ ఉన్నారు. కానీ కొంతమంది ‘వసూలు రాజా’లతో మొత్తం శాఖకే మచ్చ ఏర్పడుతోంది. ఇన్నేళ్లు కొంతమంది పోలీసులు గుట్టుగా సాగించిన మామూళ్ల దందా ఇటీవల బహిర్గతమైంది. రెండురోజుల క్రితం ‘వసూల్‌రాజా’ల జాబితా బయటపడడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. డీజీపీ విడుదల చేసినట్లుగా చెబుతున్న ఈ జాబితాలో జిల్లా నుంచి ఇద్దరు కానిస్టేబుళ్ల పేర్లు మాత్రమే ఉన్నాయి. కానీ.. జిల్లాలో ఇంకా చాలామంది ఇలా మామూళ్లు వసూలు చేసిచ్చే వాళ్లు ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎస్పీ సి.శశిధర్‌రాజు సీరియస్‌గా స్పందించారు. మామూళ్ల తీసుకోవడంతోపాటు ఇచ్చిన వారిపైనా చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. కాదేదీ వసూళ్లకనర్హం.. ఇసుక, గుట్కా, గంజాయి అక్రమ రవాణా, పేకాట, మట్కా కేసులతో పాటు భార్యాభర్తలు, అన్నదమ్ములు, బంధువుల గొడవలు.. ఇలా ఏ సమస్య ఉన్నా.. దాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే పోలీసులూ ఉన్నారు. సమస్య పరిష్కరించాలం టూ వచ్చిన వాళ్ల నుంచి కాసులను రాబట్టిన సంఘటనలూ ఉన్నాయి. తమకు సంబంధం లేని వ్యవçహారాల్లోనూ తలదూర్చి పైసలు వసూలు చేసిన దాఖలాలూ గతంలో ఉన్నాయి. కొన్ని సంఘటనల్లో కానిస్టేబుల్, ఎస్సై స్థాయిలోనే సమస్యలు పరిష్కరించేస్తుంటే.. మరికొన్ని కేసులు ఆపై స్థాయిలో ‘సెటిల్’ అవుతున్నాయి. మద్యం మస్తు.. జిల్లాలోని మద్యం దుకాణాలు పోలీసుశాఖకు ఆర్థిక వనరులుగా నిలుస్తున్నాయి. మద్యం వ్యా పారుల నుంచే పెద్దమొత్తంలో నెలసరి మామూళ్లు పోలీసులకు అందుతున్నాయి. పట్టణాల్లో రూ.10–15వేల మధ్య ఒక్కో మద్యం దుకాణం నుంచి మామూళ్లు అందుతున్నట్లు అంచనా. మండలాల్లోనూ ఇంచుమించు ఇదే స్థాయిలో వసూలు చేస్తున్నారు. కాస్త ఎక్కువ గిరాకీ ఉండే దుకాణం నుంచి ఎక్కువ మొత్తంలో మామూళ్లు రాబడుతున్నట్లు తెలిసింది. నెల కాగానే ఈ డబ్బులు సంబంధిత అధికారులకు చేరుతున్నాయి. ఇతర జిల్లాలతో పోలిస్తే.. నిర్మల్‌లో మాత్రం ప్రత్యేకంగా స్టేషన్లలో ‘కలెక్టర్లు’, ‘వసూలు రాజా’లు లేరు. ఎప్పటికప్పుడు వేరే సిబ్బందితో ఈ కలెక్షన్ కొనసాగుతున్నట్లు తెలిసింది. కాసులు కురిపిస్తున్న ఇసుక.. జిల్లాలో ప్రధానంగా ఇసుకదందా వ్యాపారులతో పాటు పోలీసు, రెవెన్యూశాఖలకూ కాసులు కురిపిస్తోంది. కళ్లెదుటే నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తుంటే.. తమకేం పట్టనట్లుగా సంబంధిత అధికారులు వ్యవహరిస్తున్నారు. పోలీసులు అడపాదడప ఒకట్రెండు ట్రాక్టర్లను పట్టుకోవడం, జరిమానాలు వేసి వదిలేయడం సర్వసాధారణంగా మారింది. ఈ తలప్పి ఎందుకన్నట్లుగా గ్రామాల్లో వేలం ద్వారా ఇసుక తవ్వకాలను దక్కించుకున్న వ్యాపారులు నేరుగా ఎస్సైలతోనే మాట్లాడుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ ఇసుక మామూళ్లు పోలీసుశాఖతో పాటు రెవెన్యూ శాఖకూ ముడుతున్నట్లు సమాచారం. సెటిల్మెంట్లు.. రూరల్‌పోలీస్ స్టేషన్లలో ఇసుకక్వారీలు ఆదాయ వనరులుగా మారితే.. పట్టణ పోలీస్స్టేషన్లలో కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, గొడవలు.. తదితర కొట్లాటల కేసులను సెటిల్ చేస్తూ కాసులు తీసుకుంటున్నారన్న ఆరోపణలు చాలా ఉన్నాయి. భార్యాభర్తల గొడవల్లోనూ కౌన్సెలింగ్‌ల పేరిట పైసలు ఆశిస్తున్నారు. జిల్లాలోని పలు మండలాల్లో లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులు కూడా నమోదు చేయకుండా కొంతమంది పోలీస్ అధికారులు సెటిల్మెంట్ చేసినట్లు ఆరోపణలున్నాయి. పట్టణ పోలీస్స్టేషన్లతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ ‘ఆదాయం’ ఉన్నట్లు అంచనా. ఈక్రమంలో చాలామంది ఎస్సైలు తమకు రూరల్ ఏరియాలకే కేటాయించాలని కోరుతున్నట్లు సమాచారం. ‘మామూళ్లు’ ఆగేనా.. వైన్సులు, బార్లు, ఇసుక వ్యాపారులు, మట్కాజూదరులు, బంగారు దుకాణాలు, కల్లు సొసైటీలు.. తదితర వ్యాపార సంఘాలు, ఇతరత్రా పరిశ్రమల నుంచి నెలసరి మామూళ్లు అందుతున్న విషయం మొన్నటి జాబితాతో బహిర్గతమైంది. జిల్లాలోనూ ఈతంతు ఏళ్లుగా కొనసాగుతున్న విషయం కూడా బహిరంగ రహస్యమే. కానీ.. ఇటీవల డీజీపీ నిఘా వేయించి.. వసూలు రాజాల పేర్లు బయటపెట్టించినట్లు జాబితాతో సహా వచ్చింది. సదరు జాబితాలో జిల్లా నుంచి ఇద్దరు కానిస్టేబుళ్ల పేర్లు ఉండడంతో ఎస్పీ శశిధర్‌రాజు సీరియస్‌గా తీసుకున్నారు. జిల్లాలో ఏస్థాయిలోనూ మామూళ్లు తీసుకోవడం, వసూలు చేయడం చేస్తే చర్యలు తప్పవన్నారు. మామూళ్లు తీసుకోవడంతో పాటు ఇచ్చేవారిపైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈమేరకు జిల్లాలో మామూళ్ల పర్వం ఆగుతుందా.. జిల్లాలో ఫ్రెండ్లీ పోలీసులుగా ఎన్నో మంచి పనులు చేపట్టిన పోలీసులపై పడ్డ ‘వసూళ్ల’ మచ్చ తొలగుతుందా.. వేచిచూడాల్సిందే. తీసుకున్నా.. ఇచ్చినా చర్యలు సమాజంలో శాంతిభద్రతల కోసం పోలీసుశాఖ శ్రమిస్తోంది. అవినీతికి తావులేకుండా వ్యవస్థ పనిచేస్తోంది. ఎవరైనా పోలీస్ అధికారులు, సిబ్బంది డబ్బులు అడిగినా.. వీరికి డబ్బులు ఇచ్చినా.. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లాలోని హోటళ్లు, వైన్సులు, బార్, రెస్టారెంట్లు, లాడ్జీలు ఇతరత్రా వ్యాపారాల యజమానులు పోలీసులకు డబ్బులు ఇవ్వడం మానుకోవాలి. పోలీసులెవరైనా డబ్బులు అడిగితే 83339 86939 ఫోన్‌నంబర్‌కు మెసేజ్, లేదా వాట్సప్ చేయాలి. – సి.శశిధర్‌రాజు, ఎస్పీ -
15న పోలీస్ మెమోరియల్ రన్
సాక్షి, హైదరాబాద్: పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని (అక్టోబర్ 21) పురస్కరించుకొని అక్టోబర్ 15న హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా వద్ద పోలీసుశాఖ ‘మెమోరియల్ రన్’ నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర పోలీసు బలగాల సిబ్బంది, అధికారులతోపాటు ప్రజలను కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేలా ప్రచారం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా గురువారం డీజీపీ కార్యాలయంలో ఇండియన్ పోలీస్ అమరవీరుల మెమోరియల్ రన్ (ఐపీఎంఎంఆర్) వెబ్సైట్, ఫేస్బుక్, ట్వీటర్ ఖాతాలతోపాటు ప్రచార వాహనాలను ప్రారంభించారు. రన్లో పాల్గొనే వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ www. policerun. inను డీజీపీ అనురాగ్‌శర్మ, భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ ప్రారంభించగా ఫేస్బుక్ ఖాతా www. facebook. com/ PoliceRun2017ను హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. అలాగే ట్వీటర్ ఖాతా@ipmmr20172017ను అదనపు డీజీపీ గోపీకృష్ణ ప్రారంభించారు. అనంతరం మెమోరియల్ రన్‌కు సంబంధించి అన్ని జిల్లాల్లో ప్రచారం కోసం మూడు వాహనాలను డీజీపీ అనురాగ్ శర్మ, మిథాలీరాజ్, కమిషనర్ మహేందర్‌రెడ్డి, ఇతర అధికారులు కలిసి జెండా ఊపి ప్రారంభించారు. మాది పోలీసు కుటుంబమే: మిథాలీరాజ్ పోలీసు సిబ్బంది త్యాగాలు, వారి సేవలు తనకు బాగా తెలుసని భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాల్‌రాజ్ పేర్కొన్నారు. తన తాత, తండ్రి పోలీసుశాఖలో పనిచేశారని, పోలీసు సిబ్బంది కష్టాలు ఎలా ఉంటాయో తనకు బాగా తెలుసన్నారు. కంటికి రెప్పలా పోలీసులు కల్పిస్తున్న రక్షణ వల్లే తాము దైర్యంగా క్రికెట్ ప్రాక్టీస్ చేయగలుగుతున్నామని అభిప్రాయపడ్డారు. మహిళా రక్షణలో రాష్ట్ర పోలీసులు చేపడుతున్న చర్యలు భేష్ అని కితాబిచ్చారు. -
డీజీపీల సదస్సుకు హాజరైన మోదీ
హైదరాబాద్: జాతీయ పోలీస్ అకాడమీ(ఎన్పీఏ)లో జరుగుతున్న అఖిల భారత డీజీపీల సదస్సు(ఏఐడీఎమ్)కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరయ్యారు. మొత్తం మూడు రోజుల పాటు సాగనున్న సదస్సులో రెండు రోజు సదస్సును మోదీ ఆరంభించారు. అంతకుముందు తెల్లవారుజామున డీజీపీలతో కలిసి మోదీ యోగాసనాలు వేశారు. అకాడమీలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి, పోలీసు అమరవీరులకు ఘననివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ లు సింగ్ లు హాజరయ్యారు. దేశ భద్రత, పోలీస్ వ్యవస్ధ పటిష్టతపై సదస్సులో చర్చిస్తారు. శనివారం సాయంత్రం ఐదు గంటల వరకూ సదస్సు కొనసాగనుంది. -
అమర వీరుల త్యాగాలను మరువొద్దు
మచిలీపట్నం : విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీస్ అమరుల త్యాగాలను మరువవద్దని ఎస్పీ జి.విజయకుమార్ పేర్కొన్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో శుక్రవారం అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరిగింది. పోలీస్ స్మారక స్థూపం వద్ద ఎస్పీ పుష్పగుచ్ఛం ఉంచి పోలీస్ అమర వీరులకు గౌరవ వందనం చేశారు. పోలీస్ సిబ్బంది కవాతు నిర్వహించి నివాళి అర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎండీ జాన్‌బాషా కుటుంబాన్ని ఎస్పీ పరామర్శించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల్లో విజేతలకు ఎస్పీ బహుమతులు అందజేశారు. పట్టణంలో పోలీసులు ర్యాలీ నిర్వహించారు. -
రక్తదానంతో ప్రాణదాతలు కండి
విజయవాడ(లబ్బీపేట) : రక్తదానంతో ప్రాణాపాయంలో ఉన్న వారికి సకాలంలో రక్తం అందించి ప్రాణదాతలుగా నిలవాలని నగర పోలీస్ కమిషనర్ గౌతమ్సవాంగ్అన్నారు. అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నగరంలోని సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ గ్రౌండ్స్‌లో మెగా రక్తదానం, నేత్ర వైద్య శిబిరం బుధవారం నిర్వహించారు. ఆయా శిబిరాలను నగర పోలీస్ కమిషనర్ గౌతమ్‌సవాంగ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమర వీరుల స్ఫూర్తితో రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. నిత్యం ఎంతో మంది ప్రమాదాల భారినపడుతూ రక్తాన్ని కోల్పోతుంటారని, అలాంటి వారికి సకాలంలో రక్తం ఎక్కించేందుకు ప్రతిఒక్కరూ రక్తదానం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాకుండా వృద్ధులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు సంధ్య కంటి ఆస్పత్రి ముందుకు రావడం హర్షణీయమని చెప్పారు. దేశ రక్షణ కోసం, దేÔ¶ శాంతిభద్రతల పరిరక్షణలో మరణించిన వారిని స్మరించుకునేందుకు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వాస్పత్రి, రెడ్‌క్రాస్, విజయశ్రీ బ్లడ్ బ్యాంక్‌లు శిబిరంలో రక్తాన్ని సేకరించాయి. 76 మంది పోలీస్ సిబ్బంది, 300 మంది ప్రజలు, విద్యార్థులు రక్తదానం చేశారు. కాగా సంధ్య కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేత్ర వైద్య శిబిరంలో 750 మందికి పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ పోలీస్ కమిషనర్లు జీవీజీ అశోక్‌కుమార్, పాలరాజు, కోయ ప్రవీణ్ పాల్గొన్నారు. -
పోలీసు ఆయుధాల ప్రదర్శన
విజయవాడ : పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సోమవారం బందరురోడ్డులోని ఏఆర్ గ్రౌండ్స్‌లో ఆయుధాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. పోలీసులకు సంబంధించిన ఆయుధాలు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు వినియోగించే పరికరాలను ప్రదర్శించారు. పోలీసు జాగిలాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. నిందితులను పోలీసు జాగిలాలు పసిగట్టే విధానాన్ని విద్యార్థులకు నిపుణులు వివరించారు. పోలీసులు వినియోగించే రకరకాల తుపాకులను ప్రదర్శించారు. వాటిని వినియోగించే పద్ధతులను కూడా వివరించారు. బాంబ్ డిస్పోజల్ పద్ధతులలో వినియోగించే ఆధునిక సామగ్రి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ గురించి తెలియజేశారు. డీసీపీ(అడ్మిన్) జీవీజీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ పోలీసుల సేవలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వివిధ పాఠశాలలకు చెందిన 500 మంది విద్యార్థులు ఈ ప్రదర్శనను తిలకించారు. -
వ్యాస రచనలో పోలీసులు
విజయవాడ: పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఆదివారం బందరు రోడ్డులో కె.ఎస్. వ్యాస్ కాంప్లెక్స్‌లో పోలీసు సిబ్బందికి వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పోలీసుల విధి నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానం దాని ఆవశ్యకత అనే అంశంపై నిర్వహించారు. 65మంది కానిస్టేబుల్స్ స్థాయి నుంచి ఏసీపీ స్థాయివరకు పాల్గొన్నారు. డీసీపీ (అడ్మిన్) జి.వి.జి. అశోక్ కుమార్ పర్యవేక్షించారు. -
16న పోలీస్ రన్
♦ విజయవంతం చేయాలని డీజీపీ పిలుపు ♦ పీవీ సింధుతో కలసి టీషర్ట్, పతకాల ఆవిష్కరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ విభాగం ఈ నెల 16న హైదరాబాద్‌లో నిర్వహించనున్న తొలి భారతీయ పోలీస్ అమరవీరుల సంస్మరణ పరుగును విజయవంతం చేయాలని డీజీపీ అనురాగ్ శర్మ ప్రజలకు పిలుపునిచ్చారు. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుతో కలసి గురువారం రన్‌కు సంబంధించిన టీషర్ట్లు, పతకాలను ఆవిష్కరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు వారి కుటుంబాలకు ప్రజలు, ప్రభుత్వం అండగా ఉందని భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ పరుగును నిర్వహిస్తున్నామని డీజీపీ పేర్కొన్నారు. కేంద్ర పోలీస్ బలగాలు, పారామిలటరీ దళాలు, వివిధ రాష్ట్రాల పోలీసులతో పాటు ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు ఈ పరుగులో పాల్గొంటారని తెలిపారు. 2 కి.మీ., 5 కి.మీ., 10 కి.మీ విభాగాల్లో ఈ పరుగును నిర్వహిస్తున్నామని చెప్పారు. పరుగులో పాల్గొనాలంటే www.policerun.in వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని చెప్పారు. పరుగు నిర్వహించిన రోజునే పీపుల్స్‌ప్లాజాలో పోలీస్ ఎక్స్పో ఏర్పాటు చేస్తున్నామన్నారు. పోలీస్ ఆయుధాలు, వాహనాలు గుర్రాలు, జాగిలాలను ప్రదర్శనలో ఉంచు తామన్నారు. పోలీస్ వాహనాలు, గుర్రాలపై స్వారీ చేయవచ్చన్నారు. కార్యక్రమంలో హోంశాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేది, పోలీస్ ఉన్నతాధికారులు కృష్ణ ప్రసాద్, మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. -
పోలీసుశాఖ అమరవీరుల రన్
- అక్టోబర్ 16 నుంచి నెక్లస్‌రోడ్‌లో మూడు రోజుల పాటు నిర్వహణ - ఆన్లైన్,11 పోలీస్స్టేషన్లలో నమోదుకు అవకాశం హైదరాబాద్: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరపోలీసుల జ్ఞాపకార్థం అక్టోబర్ 16 నుంచి మూడు రోజుల పాటు 2కె, 5కె, 10కె రన్ పోటీలను నిర్వహించనున్నట్లు డీజీపీ అనురాగ్‌శర్మ తెలిపారు. పోలీసుశాఖ ప్రధాన కార్యాలయంలో ఆదివారం ఆయన సీనియర్ అధికారులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోటీల్లో ప్రజలను భాగస్వామ్యం చేసి, పోలీసు సేవలపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. రన్ లో దాదాపు 5వేల మంది పోటీపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. దేశంలోనే మొట్ట మొదటి సారిగా అమరపోలీసుల సంస్మరణ రన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమెరికాలో ట్విన్ టవర్స్ ఘటన అనంతరం న్యూయార్క్ పోలీసు డిపార్టుమెంటు(ఎన్వైపిడీ) ప్రతి ఏటా రన్ నిర్వహిస్తోందని, అదే మాదిరిగా రాష్ట్రంలో కూడా చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రతి ఏటా రన్ ఈ పోటీలను నిర్వహిస్తామన్నారు. 2కె, 5కె, 10కె రన్ పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. రన్ లో పాల్గొనేందుకు మాదాపూర్, కూకట్పల్లి, సరూర్‌నగర్, కుషాయిగూడ, అబిడ్స్, బంజారాహిల్స్, చార్మినార్, పంజాగుట్ట, ఉస్మానియా యూనివర్శిటీ, అంబర్‌పేట, నారాయణగూడ పోలీస్స్టేషన్లలో లేదా ఆన్ లైన్ లో పేర్లు నమోదు చేయించుకోవచ్చని తెలిపారు. 2కె రన్లో పాల్గొనే వారు రూ.250, 5కె రన్ పాల్గొనేవారు రూ.300, 10కె రన్లో పాల్గొనేవారు రూ.350లను రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. జర్నలిస్టులు ప్రవేశ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని, గుర్తింపుకార్డును చూపితే రన్ కు అనుమతిస్తామన్నారు. రన్లో విజయం సాధించిన వారికినెగ్గిన వారికి బహుమతులు అందజేస్తామని చెప్పారు. పోటీలో పాల్గొనే ప్రతి ఒక్కరికీ టీ-షర్ట్లు ఉచితంగా అందజేస్తామన్నారు. అదే విధంగా పోలీసు సేవలపై అక్టోబర్ 15, 16తేదీలలో పీపుల్స్ ప్లాజాలో 'ఎక్స్ పో' నిర్వహించనున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర విభాగాలకు చెందిన పోలీసు స్టాళ్లు ఏర్పాటు చేసి ప్రజలకు వివరిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో శాంతిభద్రతల అదనపు డీజీ అంజనీకుమార్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ త్రివేది, సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్య, రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్, సీఐడీ చీఫ్ సౌమ్యా మిశ్రా, సీనియర్ ఐపీఎస్ అధికారి రమేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నిరసన జ్వాల
-
హోదా పోరుపై పోలీస్ జులుం
* ఉద్రిక్తంగా సాగిన బంద్ * పాలకపార్టీ ఆదేశాలతో పోలీసుల ఓవర్‌యాక్షన్ * అడుగడుగునా ఆటంకాలు... అరెస్టులు చిలకలూరిపేట టౌన్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు చిలకలూరిపేటలో శనివారం నిర్వహించిన బంద్‌కు పోలీసులు అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాపకం కోసం ఓవర్ యాక్షన్ ప్రదర్శించారు. శాంతియుతంగా ఉన్న నియోజకవర్గంలో పోలీస్ 30 యాక్ట్, 144 సెక్షన్లు విధించి బంద్‌ను అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు. అర్ధరాత్రి నుంచే వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లకు వెళ్లి ముందస్తు అరెస్టుల పేరున భయానక వాతావరణం సృష్టించారు. తెల్లవారుజామున ఆర్టీసీ బస్‌స్టేషన్ చేరుకున్న పార్టీ నాయకులతో పాటు వామపక్ష నాయకులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అడుగడుగునా ఆటంకాలు .... పాలక పక్ష ఆదేశాలతో బంద్‌ను విఫలం చేసేందుకు కంకణం కట్టుకున్న పోలీసులు ప్రత్యేక బలగాలతో ఆర్టీసీ బస్ స్టేషన్వద్ద మోహరించారు. వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. పరిస్థితులను ఊహించిన పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ నాయకత్వంలో పట్టణంలో పార్టీ కార్యాలయం వద్ద నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎన్ఆర్టీ సెంటర్, చౌత్రా సెంటర్ , మెయిన్ బజార్, కూరగాయల మార్కెట్, మీదుగా ర్యాలీ కొనసాగింది. కళామందిర్ సెంటర్‌కు ర్యాలీ చేరుకొనే సమయానికి నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అర్బన్ సీఐ బి.సురేష్‌బాబు, రూరల్ సీఐ శోభన్‌బాబు పలువురు ఎస్ఐలు పోలీసు సిబ్బందితో వచ్చి ర్యాలీని అడ్డుకున్నారు. పోలీసులు బైక్ ర్యాలీ అడ్డుకోవడంపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.శాంతియుతంగా కొనసాగుతున్న కార్యక్రమాన్ని ఎలా అడ్డుకుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వాహనాలను అడ్డుకోవడంతో పాదయాత్రగా ముందుకు సాగారు. ఈ తరుణంలో మిమ్మల్ని అరెస్టుచేస్తున్నామని అర్బన్ సీఐ బి సురేష్‌బాబు చెప్పగా, అరెస్టుకు నిరాకరించి పార్టీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేసుకుంటూ ముందుకు కదిలారు. దీంతో ఒక్కసారిగా పోలీసులు కార్యకర్తలను తోసివేసి మర్రి రాజశేఖర్ అరెస్టుకు ప్రయత్నించారు. ఈ తరుణంలో కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట ఏర్పడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు బలవంతంగా మర్రి రాజశేఖర్‌తో పాటు మరికొందరు నాయకులను పోలీసు వాహనాలలో ఎక్కించుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీనికి నిరసనగా పార్టీ పట్టణ అధ్యక్షుడు ఏవీఎం సుభాని ఆధ్వర్యంలో పాదయాత్రగా పట్టణంలో ప్రదర్శన నిర్వహిస్తున్న వారిని పోలీసులు చౌత్రాసెంటర్లో అడ్డుకొని సుభానీతో పాటు మరికొందరిని అరెస్టు చేసి నాదెండ్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రశాంతంగా బంద్... పోలీసులు ఎన్ని అటంకాలు సృష్టించినా బంద్ ప్రశాంతంగా కొనసాగింది. ముందురోజే పట్టణంలో అన్ని వర్గాల ప్రజలకు సమాచారం అందజేయడం, విస్తృత ప్రచారం నిర్వహించడంతో దుకాణాలు తెరుచుకోలేదు. పాఠశాలలు, కళాశాలలు పూర్తిగా మూతపడ్డాయి. -
మూడు షిప్టులు... రెండు బ్యాచ్‌లు
విధి నిర్వహణలో పోలీసులు సతమతం అమరావతి (తాడికొండ) : అమరావతి మండలం వైకుంఠపురంలోని పుష్కరఘాట్‌లో విధి నిర్వహణలో ఉన్న పోలీసుల పరిస్థితి దయనీయంగా మారింది. అర్బన్ పరిధిలో రోజుకు మూడు షిప్టులకు మూడు బ్యాచ్‌లుగా విభజించి ఘాట్లలో విధులు నిర్వహిస్తున్నారు. రూరల్ పరిధిలోని అన్ని ఘాట్లలో మాత్రం మూడు షిప్టులుగా విభజించారు కానీ రెండు బ్యాచ్‌లు మాత్రమే విధులు నిర్వహిస్తున్నాయి. దీంతో ప్రతిరోజూ ఒక కానిస్టేబుల్ 12 గంటలు విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. పొరపాటున ఏదైనా సంఘటన జరిగితే ఇబ్బంది పడతామన్న ఆందోళనతో విధులు నిర్వహిస్తున్నారు. 12 గంటల విధి నిర్వహణతో అసౌకర్యానికి గురవుతున్నామని కొందరు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 7వ తేదీ నుంచి పుష్కర విధులకు హాజరయ్యామని, నేటివరకు ఇంటిముఖం చూడలేదని పలువురు సిబ్బంది వాపోతున్నారు. కేవలం రూరల్ పరిధిలోని పోలీసులకే ఈ పరిస్థితి నెలకొందన్నారు. మరో వారం పాటు పుష్కర విధులు నిర్వహించాల్సి ఉందని, 12 గంటల డ్యూటీ చేయలేకపోతున్నామని పేర్కొన్నారు. ఇప్పటినుంచైనా 3 షిప్టులకు మూడు బ్యాచ్‌లను విభజించి 8 గంటల డ్యూటీ అమలు చేయాలని కోరుతున్నారు. -
‘మత’ శక్తులకు చోటివ్వం
- పోలీసు అమరవీరుల దినోత్సవంలో సీఎం కేసీఆర్ - రాష్ట్రంలో సంఘవిద్రోహ శక్తులకు తావివ్వం - పోలీసు అమరులకు సమాజం రుణపడి ఉంది - గతేడాది పోలీసులకు ఇచ్చిన హామీల విస్మరణ నిజమే.. వాటిని త్వరలో నెరవేరుస్తాం - డబుల్ బెడ్రూం ఇళ్లలో 10 శాతం పోలీసు సిబ్బందికి రిజర్వు - ఎస్సై, ఆ పైస్థాయి అధికారులకు ఇళ్ల స్థలాలు - ‘ట్రాఫిక్’ పోలీసులకు అదనంగా 30 శాతం అలవెన్స్ ఇస్తామని ప్రకటన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మతతత్వ శక్తులు, తీవ్రవాదులకు, సంఘ విద్రోహశక్తులకు, వైట్‌కాలర్ నేరగాళ్లకు చోటివ్వబోమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రజానీకానికి హామీ ఇస్తున్నానని... ఏ దేశమైనా, రాష్ట్రమైనా శాంతిభద్రతలు బాగుంటేనే అభివృద్ధి చెందుతాయని చెప్పారు. పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం హైదరాబాద్‌లోని గోషామహల్ స్టేడియంలో అమరవీరుల స్థూపం వద్ద సీఎం కేసీఆర్, హోంమంత్రి నాయిని, డీజీపీ అనురాగ్‌శర్మ శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సీఎం ప్రసంగించారు. ‘‘దేశం కోసం, ప్రజల భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరులకు సమాజం రుణపడి ఉంది. శాంతిభద్రతలను కాపాడటంలో పోలీసులు చేస్తున్న త్యాగాలను సమాజంలోని అన్ని వర్గాలు గుర్తించి భుజం తట్టి ప్రోత్సహించాలి. సమాజం నుంచి పోలీసులకు పూర్తి సహాయ సహకారాలు అందాలంటే వారు కూడా ప్రజల ఆశలకు అనుగుణంగా, ప్రభుత్వ గౌరవ మర్యాదలను పెంచేలా విధులు నిర్వహించాలి. నూతన రాష్ట్ర అభివృద్ధికి కృషిచేయాలి. అరాచక శక్తులను అంతమొందించాలి..’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. వరాల జల్లు..: ఈ సందర్భంగా పోలీసు సిబ్బందికి సీఎం కేసీఆర్ కొన్ని వరాలు ప్రకటించారు. గతేడాది స్వయంగా తాను ప్రకటించిన హామీలు కూడా విస్మరణకు గురైన మాట వాస్తవమేనని అంగీకరించారు. ఆ హామీలపై డీజీపీతో ఇటీవలే సమీక్షించానని, అవి త్వరలో అమలయ్యేలా చూస్తామని చెప్పారు. పోలీసు అమర వీరుల కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లస్థలాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు పడకగదుల ఇళ్ల పథకంలో కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుల్, ఏఎస్సై, హోంగార్డులు, మాజీ సైనికోద్యోగులకు కలిపి పదిశాతం ఇళ్లను ఏటా రిజర్వు చేస్తామన్నారు. ఎస్సై, ఆపైస్థాయి అధికారులకు వారు పనిచేస్తున్న జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఇళ్లస్థలాలు కేటాయిస్తామని చెప్పారు. త్వరలోనే హైదరాబాద్ నగరానికి సంబంధించి స్థలం కేటాయిస్తామన్నారు. పోలీసులకు యూనిఫాం కోసం ఇచ్చే వార్షిక అలవెన్స్‌ను రూ. 3,500 నుంచి రూ. 7,500కు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. గంటల తరబడి కాలుష్యంలో నిలబడి విధులు నిర్వర్తించే ట్రాఫిక్ పోలీసులకు 30 శాతం అలవెన్స్ అందజేస్తామని చెప్పారు. పోలీసుల వృత్తి చాలా శ్రమతో కూడుకున్నదని, వారి సేవలు వెలకట్టలేనివని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. పోలీసు శాఖకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. దేశవ్యాప్తంగా 437 మంది పోలీసులు విధి నిర్వహణలో వీరమరణం పొందారని... వారిలో తెలంగాణకు చెందినవారు నలుగురు ఉన్నారని డీజీపీ అనురాగ్ శర్మ పేర్కొన్నారు. అనంతరం పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీస్ అంశంపై నిర్వహించిన ఫొటో, షార్ట్‌ఫిలిం పోటీల్లో విజేతలకు సీఎం కేసీఆర్ బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి, అడిషనల్ డీజీపీలు, ఐజీలు పాల్గొన్నారు. ఇలా వచ్చి.. అలా వెళ్లిన గవర్నర్! పోలీసు అమరవీరుల దినోత్సవ కార్యక్రమానికి హాజరైన గవర్నర్ నరసింహన్... కొద్దిసేపు ఉండి, కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏమీ మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ఉదయం 9కి హాజరవగా... గవర్నర్ ఉదయం 7గంటలకే వచ్చి నివాళి అర్పించారు. గౌరవ వందనం స్వీకరించి, అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ సందర్శించి వెళ్లిపోయారు. -
సంఘవిద్రోహ శక్తులను చొరబడనివ్వం: సీఎం
- ట్రాఫిక్ పోలీసులకు మూలవేతనంతో 30శాతం అలవెన్స్ - డబుల్ బెడ్రూం ఇళ్లలో 10శాతం పోలీసు సిబ్బందికి రిజర్వ్ - ఎస్సై, ఆపైస్థాయి అధికారులకు ఇళ్ల స్థలాలు - పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో కేసీఆర్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మతతత్వ శక్తులతో పాటు తీవ్రవాదులకు, సంఘవిద్రోహ శక్తులకు, వైట్‌కాలర్ నేరగాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో చోటివ్వబోమని, ఈ విషయంలో రాష్ట్ర ప్రజానీకానికి హామి ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ఏ దేశమైనా, రాష్ట్రమైనా శాంతిభద్రతలు బాగుంటేనే అభివృద్ధి చెందుతుందన్నారు. అందుకే రాష్ట్రంలో అధునాత పోలీసు వ్యవస్థ కోసం బంజారాహిల్స్‌లో ఇంట్రిగేటెడ్ కమాండ్ కంట్రోల్ రూంను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో అమరవీరుల స్థూపానికి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మతో కలిసి సీఎం కేసీఆర్ ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. దేశం కోసం, ప్రజల భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరులకు సమాజం రుణవ డి ఉందన్నారు. శాంతిభద్రతలను కాపాడటంలో పోలీసులు చేస్తున్న త్యాగాలను సమాజంలోని అన్ని వర్గాలు గుర్తించి భుజం తట్టి ప్రోత్సహించాలన్నారు. పోలీసు సంస్మరణ పూర్తితో విధినిర్వహణకు సిబ్బంది పునరంకితం కావాలని, నూతన రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిషలు కృషిచేసి, అరాచక శక్తులను అంతమొందించాలని సీఎం సూచించారు. పోలీసులకు వరాలు పోలీసు సిబ్బంది సంక్షేమానికి గతేడాది స్వయంగా తాను ప్రకటించిన హామీలు విస్మరణకు గురైన మాట వాస్తవమేనని సీఎం అంగీకరించారు. గతంలోని హామీలపై డీజీపీ అనురాగ్‌శర్మతో ఇటీవలే సమీక్షించానని, త్వరతగతిన అమలయ్యేలా చూస్తామన్నారు. పోలీసుల అమర వీరుల కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇస్తున్నట్లు సీఎం హామి ఇచ్చారు. అదే విధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్‌బెడ్ రూం ఇళ్ల పథకంలో పోలీసు కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుల్, ఏఎస్ఐ, హోంగార్డులకు, మాజీ సైనికుద్యోగులకు కలిపి పదిశాతం ప్రతి సంవత్సరం ఇళ్లను రిజర్వు చేస్తామన్నారు. సబ్ఇన్స్పెక్టర్ (ఎస్సై) ఆపైస్థాయి అధికారులకు వారు పనిచేస్తున్న జిల్లాలోని మున్సిపాలిటీలలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తామన్నారు. త్వరలోనే హైదరాబాద్ నగరానాకి సంబంధించి స్థలం కేటాయించనున్నట్లు తెలిపారు. పోలీసులకు యూనిఫాం కోసం ఇచ్చే వార్షిక అలవెన్స్‌లను 3,500 నుంచి 7,500లకు పెంచుతున్నట్లు వెల్లడించారు. ట్రాఫిక్ పోలీసుకు మూల వేతనంతో పాటు అదనంగా 30శాతం అలవెన్స్ అందజేస్తామని స్పష్టంచేశారు. అలావచ్చి.. ఇలా వెళ్లి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పోలీసు అమరవీరుల దినోత్సవ కార్యక్రమానికి అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏమీ మాట్లాడకుండానే పదిహేను నిముషాల్లో ముగించుకొని వెళ్లిపోయారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ఉదయం 9గంటలకు హాజరవగా... గవర్నర్ మాత్రం ఉదయం 7గంటలకే అమరవీరుల స్థూపం వద్దకు చేరుకొని నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. విధినిర్వహణలో పోలీసులు చేసిన పలు సేవా కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ సందర్శించి వెళ్లిపోయారు. -
పోలీస్ అమర వీరులకు పిండప్రదానం
భద్రాచలం: సిమీ తీవ్రవాదులతో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందిన పోలీస్‌అమర వీరులకు నల్లగొండ జిల్లా పోలీసులు శుక్రవారం భద్రాచలంలో పిండప్రదానం చేశారు. నల్లగొండ జిల్లా జానకీపురం వద్ద ఈ ఏడాది ఏప్రిల్ 7న సిమీ తీవ్రవాదులకు, పోలీసులకు జరిగిన పోరులో ఎస్ఐ సిద్దయ్య, కానిస్టేబుల్లు నాగరాజు, లింగయ్య, హోంగార్డు రమేష్ వీరమరణం పొందిన విషయం తెలిసిందే. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమరవీరులకు నల్లగొండ జిల్లా పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులు మండవ హుస్సేన్‌గౌడ్, హెడ్‌కానిస్టేబుల్ రెండపోగు వెంకటేశ్వర్లు, దాడి ఘటనలో పాల్గొన్న కానిస్టేబుల్లు మధు, నాగరాజులు పిండప్రధానం చేశారు.