
అమర వీరుల త్యాగాలను మరువొద్దు
మచిలీపట్నం : విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీస్ అమరుల త్యాగాలను మరువవద్దని ఎస్పీ జి.విజయకుమార్ పేర్కొన్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో శుక్రవారం అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరిగింది. పోలీస్ స్మారక స్థూపం వద్ద ఎస్పీ పుష్పగుచ్ఛం ఉంచి పోలీస్ అమర వీరులకు గౌరవ వందనం చేశారు. పోలీస్ సిబ్బంది కవాతు నిర్వహించి నివాళి అర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎండీ జాన్‌బాషా కుటుంబాన్ని ఎస్పీ పరామర్శించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల్లో విజేతలకు ఎస్పీ బహుమతులు అందజేశారు. పట్టణంలో పోలీసులు ర్యాలీ నిర్వహించారు.