SP Vijay Kumar
-
అమర వీరుల త్యాగాలను మరువొద్దు
మచిలీపట్నం : విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీస్ అమరుల త్యాగాలను మరువవద్దని ఎస్పీ జి.విజయకుమార్ పేర్కొన్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో శుక్రవారం అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరిగింది. పోలీస్ స్మారక స్థూపం వద్ద ఎస్పీ పుష్పగుచ్ఛం ఉంచి పోలీస్ అమర వీరులకు గౌరవ వందనం చేశారు. పోలీస్ సిబ్బంది కవాతు నిర్వహించి నివాళి అర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎండీ జాన్‌బాషా కుటుంబాన్ని ఎస్పీ పరామర్శించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల్లో విజేతలకు ఎస్పీ బహుమతులు అందజేశారు. పట్టణంలో పోలీసులు ర్యాలీ నిర్వహించారు. -
కృష్ణా పుష్కరాలపై దృష్టి సారించండి
జిల్లా ఎస్పీ విజయ్‌కుమార్ సాగర సంగమ ప్రాంతం పరిశీలన కోడూరు : కృష్ణా పుష్కరాలపై జిల్లా పోలీసు యంత్రాంగం ఇప్పటి నుంచే ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ కె.విజయకుమార్ సూచించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న పవిత్ర కృష్ణా సాగర సంగమ ప్రదేశాన్ని ఎస్పీ స్థానిక పోలీసులతో కలిసి శనివారం పరిశీలించారు. విజయవాడ దగ్గర నుంచి హంసలదీవి వరకు కృష్ణానది వెంట ఉన్న ఘాట్లు వద్ద కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. దేవాలయాల వద్ద కూడా పటిష్ట చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. విజయవాడ, వేదాద్రి, ముక్త్యాల, శ్రీకాకుళం, పెదకళ్లేపల్లి, హంసలదీవి ఘాట్ల వద్ద భక్తుల సంఖ్య అధికంగా ఉంటుందని అధికార యంత్రాంగం అంచనా వేస్తోందని, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆయన ఆదేశించారు. హంసలదీవిలోని సాగర సంగమం వద్ద లోతు అధికంగా ఉన్నందున ప్రత్యేక దృష్టిసారించాల్సి ఉంటుందని అవనిగడ్డ డీఎస్పీ ఖాదర్‌బాషా ఎస్పీకి వివరించారు. సంగమం వద్దకు నూతన రహదారి ఏర్పాటుకు ఇప్పటికే ప్రతిపాదించారని, దీంతో భక్తులు ఈ ప్రాంతానికి అధిక సంఖ్యలో తరలి వస్తారని డీఎస్పీ పేర్కొన్నారు. ముమ్మర గస్తీ నిర్వహించాలి పాలకాయతిప్పలోని సముద్రం తీరం వెంట ముమ్మర గస్తీ నిర్వహించి, ప్రతి నిత్యం పరిస్థితులను తనకు వివరించాలని స్థానిక పోలీసులను ఎస్పీ ఆదేశించారు. సాగర సంగమం ప్రాంతంలో ప్రత్యేక బోటుపై ప్రయాణించి సముద్ర స్థితిగతులను పరిశీలించారు. అనంతరం హంసలదీవిలోని శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సీఐ చంద్రశేఖర్, కోడూరు, అవనిగడ్డ ఎస్.ఐలు వై.సుధాకర్, డి.వెంకటకుమార్ ఉన్నారు. -
ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
పెద్దాపురం రూరల్, న్యూస్‌లైన్ : ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ విజయ్ కుమార్ హెచ్చరించారు. సోమవారం పెద్దాపురంలో మున్సిపల్ ఎన్నికల సంద ర్భంగా అత్యంత సమస్యాత్మకమైన బూత్‌లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొండయ్యపేటలో మున్సిపల్ స్కూల్, పద్మనాభ కాలనీలోని పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లను ఆయన పరిశీలించారు. పోలింగు రోజున తీసుకోవాల్సిన భద్రత చర్యలపై ఆయన డీఎస్పీకి పలు సూచనలు చేశారు. అనంతరం డీఎస్పీ కార్యాలయానికి చేరుకుని అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి వరకు రూ. 32,00, 650 నగదును సీజ్ చేశామన్నారు. అలాగే రూ. 3 లక్షల విలువ చేసే లిక్కర్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 500 మంది పోలీసు అధికారులను నియమించామన్నారు. జిల్లాల్లో నాలుగు బెటాలియన్ స్పెషల్ ఫోర్స్ ఉందన్నారు. వీరి సేవలను వినియోగించుకుంటున్నామన్నారు. జిల్లాలో ప్రధాన ప్రాంతాల్లో 13 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. అలాగే చిన్న చిన్న పట్టణాల్లో కూడా 58 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం ఎన్నికలపై నిఘా పెట్టామన్నారు. సమావేశంలో డీఎస్పీ ఓలేటి అరవిందబాబు, సీఐ నాగేశ్వరరావు, ఎస్సై బి.శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.