రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం వైఎస్‌ జగన్‌ | AP CM YS Jagan Mohan Reddy to visit Delhi tomorrow | Sakshi
Sakshi News home page

రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం వైఎస్‌ జగన్‌

Published Sun, Oct 20 2019 8:13 PM | Last Updated on Sun, Oct 20 2019 8:22 PM

AP CM YS Jagan Mohan Reddy to visit Delhi tomorrow - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై కేంద్రమంత్రులతో ఆయన చర్చించనున్నారు. కేంద్ర హోంమంత్రి సహా పలువురు కేంద్ర మంత్రులను సీఎం జగన్‌ కలుసుకుంటారు. రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు ముఖ్యమంత్రి ఢిల్లీ చేరుకుంటారు. రాత్రికి ఢిల్లీలోనే బస చేస్తారు. 22వ తేదీ సాయంత్రం 7 గంటల ప్రాంతంలో విశాఖపట్నం చేరుకుని, సాయిప్రియా రిసార్ట్స్‌లో అరకు ఎంపీ మాధవి, శివప్రసాద్‌ల వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు. అనంతరం అదేరోజు రాత్రి తాడేపల్లి చేరుకుంటారు. 

పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్లొననున్న సీఎం జగన్‌
రేపు ఉదయం 8 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరగనున్న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు అవుతారు. పోలీస్‌ త్యాగధనులకు ముఖ్యమంత్రి నివాళులు అర్పిస్తారు.  


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement