పోలీసులు దేశానికే ఆదర్శంగా ఉండాలి | Telangana, Andhra pay tributes to police martyrs | Sakshi
Sakshi News home page

పోలీసులు దేశానికే ఆదర్శంగా ఉండాలి

Published Wed, Oct 22 2014 3:33 AM | Last Updated on Thu, Mar 21 2019 8:23 PM

Telangana, Andhra pay tributes to police martyrs

 నల్లగొండ క్రైం : తెలంగాణ రాష్ట్ర పోలీసులు దేశానికే ఆదర్శంగా ఉండాలని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం పోలీసు అమరుల సంస్మరణ దినం సందర్భంగా  హెడ్‌క్వార్టర్స్‌లో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి మాట్లాడారు.  విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని, ఒత్తిడికి గురికావద్దని సూచిం చారు. పోలీసుల సమస్యలను పరిష్కరించేందుకు సీఎం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. కలెక్టర్ చిరంజీవులు మాట్లాడుతూ అమర పోలీసులను స్మరించుకుని విధి నిర్వహణలో పునరంకితం కావాలన్నారు.
 
 ఉగ్రవాదం, తీవ్రవాదం ఉండే సమాజంలో పోలీస్‌వృత్తి కష్టసాధ్యమైందన్నారు. నేరస్తుల ను కఠినంగా శిక్షించాలని, సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలని కోరారు. జిల్లా పరిషత్ చైర్మన్ బాలునాయక్ మాట్లాడుతూ ప్రాణత్యాగం చేసే గుణం ఒక్క పోలీసులకే ఉంటుందన్నా రు. పోలీసులుంటే మానవ శరీరంలో మరో గుండెకాయ అని ప్రశంసించారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు రక్షణ విషయంలో కుటుంబ సభ్యుల కంటే పోలీ సుల వారితోనే ఎక్కువ సమయం గడుపుతున్నామన్నారు. ప్రజాస్వామయ్య పరిరక్షణకు పోలీసులు కీలక భూమిక పోషిస్తున్నారన్నారు. ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అమరుల కుటుంబాల సమస్యలను, పోలీసుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లాలన్నారు.
 
 మెరుగైన ఆరో గ్య భద్రత కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఎస్పీ టి.ప్రభాకర్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో 321, జిల్లాలో 25 మంది అమరులైనారని తెలిపారు. వారి కుటుంబాలకు బస్‌పాస్ సౌకర్యం, ఇంటిస్థలం అందజేస్తామన్నారు. పోలీ సులు లేని సమాజాన్ని ఊహించలేమన్నారు. ప్రజల భద్రతకు నిత్యం రక్షణగా ఉండేది పోలీసులేనన్నారు. అనంతరం ప్రజా ప్రతినిధులు, అమరుల కుటుంబ సభ్యులు, పోలీసు అధికారులు అమరుల స్థూపం వద్ద నివాళులర్పించా రు. అమరవీరుల వారోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీ ల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.  కార్యక్రమంలో జేసీ ప్రీతి మీనా, జెడ్పీ సీఈఓ దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పూలరవీందర్, ఏజేసీ వెంకట్రావ్, ఎమ్మెల్యేలు వీరేశం, గాదరి కిషోర్, పైళ్ల శేఖర్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఏఎస్పీ రామరాజేశ్వరి, ఓఎస్‌డీ రాధకిషన్‌రావు, డీఎస్పీ రాంమోహన్‌రావు, సురేష్‌రెడ్డి, ఆర్డీఓ జహీర్ పాల్గొన్నారు.
 
 బెటాలియన్‌లో....
 అమలరవీరుల దినోత్సవం సందర్భంగా అన్నెపర్తి బెటాలియన్‌లో అమరవీరుల స్థూపం వద్ద ప్రజాప్రతినిధులు, బెటాలియన్ కమాండెంట్ ఘనంగా నివాళులర్పించారు. అంతకుముందు వారు పోలీసుల నుంచి ఎంపీ, ఎమ్మెల్యే లు గౌరవ వందనం స్వీకరించారు. విధి నిర్వహణలో పోలీసుల ప్రాణత్యాగాన్ని స్మరించుకున్నారు. బెటాలియన్ కమాం డెంట్ ఎస్‌ఎన్‌బీఎస్ బాబూజీరావు, అసిస్టెంట్ కమాండెంట్ బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement