
సాక్షి, హైదరాబాద్: పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా అమరవీరుల కుటుంబాలను శుక్రవారం సీపీ సజ్జనార్ పరామర్శించారు. ఐపీఎస్, స్వర్గీయ చదలవాడ ఉమేష్ చంద్ర ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన తల్లిదండ్రులను సీపీ ఘనంగా సత్కరించారు. అలాగే పోలీస్ అమరవీరుడు కానిస్టేబుల్ ఈశ్వర్ రావు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను సజ్జనార్ పరామర్శించారు. బాధిత కుటుంబాలకు పోలీస్ డిపార్ట్‌మెంట్ తరపున అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. చదవండి: దయచేసి సాహసాలు చేయొద్దు: సీపీ సజ్జనార్
సీపీ వెంట శంషాబాద్ డీసీపీ ఎన్ ప్రకాష్ రెడ్డి, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్‌ఎమ్ విజయ్ కుమార్, ఐపీఎస్., డీసీపీ క్రైమ్స్ రోహిణీ ప్రియదర్శినీ, ఐపీఎస్, విమన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ అనసూయ, బాలానగర్ డీసీపీ పద్మజా, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఏడీసీపీ మాణిక్ రాజ్, ఏసీపీ మాదాపూర్ రఘునందన్ రావు, బాలానగర్ ఏసీపీ పురుషోత్తం, జీడిమెట్ల ఇన్ స్పెక్టర్ బాలరాజు, ఇన్‌స్టెక్టర్ గురవయ్య తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment