Cyberabad Police Commissioner
-
సినీ భాషలోనే డ్రగ్స్ దందా!
హైదరాబాద్: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లలోని ఠాణాల్లో నమోదైన ‘టాలీవుడ్ డ్రగ్స్’ కేసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సినీ రంగానికి చెందిన వారు మాదకద్రవ్యాల దందాను వారి పారిభాషిక పదాలనే కోడ్ వర్డ్స్‌గా వినియోగించే చేస్తున్నట్లు వెల్లడైంది. మరోపక్క టీఎస్ నాబ్ అధికారులు నటుడు నవదీప్ నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్‌ను విశ్లేషిస్తున్నారు. న్యాయస్థానం నుంచి ముందస్తు బెయిల్ పొందిన నిందితులు మంగళవారం దర్యాప్తు అధికారి ఎదుట హాజరయ్యారు. ఇటీవల కాలంలో టాలీవుడ్‌తో లింకులు ఉన్న డ్రగ్స్ కేసులు రెండు నమోదయ్యాయి. సైబరాబాద్ పోలీసులు పట్టుకున్న కేపీ రెడ్డికి సంబంధించిన కేసు మాదాపూర్ ఠాణాలో నమోదైంది. టీఎస్ నాబ్ అధికారులు గుట్టురట్టు చేసిన వెంకట రమణరెడ్డి లింకులకు సంబంధించిన కేసు హైదరాబాద్ కమిషనరేట్‌లోని గుడిమల్కాపూర్ ఠాణాలో రిజిస్టరైంది. ఈ కేసులోనే హీరో నవదీప్ పేరు బయటపడింది. ఈ రెండు కేసుల్లోనూ అనేక మంది టాలీవుడ్ నటులు, నిర్మాతలు, దర్శకులతో పాటు మోడళ్ళు సైతం డ్రగ్స్ వినియోగదారులుగా ఉన్నట్లు బయటపడింది. వీళ్ళు రహస్య ప్రాంతాల్లో, పొరుగు రాష్ట్రాల్లో పార్టీలు నిర్వహించుకుంటూ, మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సాధారణంగా డ్రగ్స్ క్రయవిక్రయాల్లో వాటి పేర్లను డైరెక్టుగా వాడరు. ఎవరికి వాళ్ళు కొన్ని కోడ్ వర్డ్స్ పెట్టుకుని పని పూర్తి చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే సినీ రంగానికి చెందిన వారు ఆ పారిభాషిక పదాలతోనే డ్రగ్స్‌కు కోడ్ వర్డ్స్ రూపొందించినట్లు పోలీసులు గుర్తించారు. నటులు, దర్శకులు, నిర్మాతలతో పాటు మోడల్స్ సైతం ఎక్కువగా కొకై న్ను వినియోగిస్తుంటారని అధికారులు చెప్తున్నారు. దీంతో ఈ డ్రగ్‌కు స్క్రిప్ట్ అనే కోడ్ వర్డ్ ఏర్పాటు చేసుకున్నారు. అలాగే మాదకద్రవ్యాలు సరఫరా చేసే డ్రగ్ పెడ్లర్‌కు రైటర్ అని, డ్రగ్స్ రావాలని అడగటానికి ‘షెల్ వీ మీట్’ అని కోడ్స్ ఏర్పాటు చేసుకున్నారు. వారి వారి ఫోన్లు విశ్లేషించినప్పుడు ఈ పదాలే కనిపించాయని దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. మరోపక్క నవదీప్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫోన్ విశ్లేషణ ప్రారంభమైంది. ఈ ఫోన్‌ను పోలీసులకు అప్పగించే ముందే నవదీప్ ఫార్మాట్ చేసినట్లు గుర్తించారు. దీంతో డిలీట్ అయిన డేటాను రిట్రీవ్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే దర్యాప్తులో గుర్తించిన అంశాలను బట్టి ఈ డ్రగ్స్ క్రయవిక్రయాలన్నీ స్నాప్‌చాట్ ఆధారంగా జరిగాయి. ఈ సోషల్‌మీడియా యాప్‌లో ఉన్న డిజ్అప్పీర్ ఆప్షన్‌ను పెడ్లర్లు, వినియోగదారులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. గుడిమల్కాపూర్ కేసులో నిందితులుగా ఉండి, న్యాయస్థానం నుంచి మందస్తు బెయిల్ తీసుకున్న వ్యాపారి కలహర్‌రెడ్డి, పబ్ నిర్వాహకుడు సూర్య కాంత్ సహా మరో వ్యక్తి మంగళవారం దర్యాప్తు అఽధికారి ఎదుట హాజరయ్యారు. గుడిమల్కాపూర్ ఠాణాలో ష్యూరిటీలు సమర్పించడంతో పాటు ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతాయని హామీ ఇచ్చారు. కలహర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ‘హైకోర్టు ఆదేశాల మేరకు గుడిమల్కాపూర్ పోలీసుస్టేషన్ లో లొంగిపోయా. నాకు, డ్రగ్స్ కేసుకి ఎలాంటి సంబంధం లేదు. విచారణకు పూర్తిగా సహకరించాను.. తర్వాత కూడా సహకరిస్తాను. పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా. నాకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదు’ అని అన్నారు. -
Hyderabad: రోజూ నలుగురు మగాళ్లు మిస్!.. ఎన్నెన్నో కారణాలు
పిల్లలు జాగ్రత్త అని చీటీ రాసి.. బతుకుదెరువు కోసం కర్నూలు నుంచి హైదరాబాద్‌కు భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి 8 ఏళ్ల కిందట వచ్చిన చాకలి రాజు.. పుప్పాలగూడలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. స్థానికంగా ఉండే ఓ వ్యక్తి వద్ద చిట్టీలు వేయడం, అప్పులు చేయడం చేస్తుండేవాడు. ఈ క్రమంలో అతనికి రూ.1.5 లక్షలు ఇవ్వాల్సి ఉంది. వాటి గురించి ఒత్తిడి పెరగడంతో ఇటీవల తన స్కూటీని భార్య పనిచేసే గేటెడ్ కమ్యూనిటీ సెక్యూరిటీ గార్డుకు ఇచ్చి స్కూటీ డిక్కీలో ‘పిల్లలు జాగ్రత్త’ అని చీటీ రాసి అదృశ్యమయ్యాడు. రెండు ఇళ్లల్లో గొడవపడి.. హైదరాబాద్‌లోని వసంతనగర్‌కు చెందిన పొక్కలపాటి సురేశ్ వర్మ ప్రైవేట్ ఉద్యోగి. నైట్ డ్యూటీ ఉందని చెప్పి గతేడాది డిసెంబర్లో ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో అతని భార్య వర్మ బావ ప్రసాద్‌కు ఫోన్ చేసి విషయం చెప్పింది. తెలిసిన వ్యక్తులు, ప్రాంతాల్లో వెతికే పనిలో ఉండగా.. డిసెంబర్ 24న గుర్తు తెలియని ఫోన్ నంబర్ నుంచి ఓ మహిళ ప్రసాద్‌కు ఫోన్ చేసి మీ బామ్మర్ది, నేను ఐదేళ్లుగా కలిసి ఉంటున్నామని, రెండేళ్ల క్రితం వివాహం కూడా చేసుకున్నామని చెప్పింది. శాతవాహన నగర్ కాలనీలో నివాసముంటున్న తనతో గొడవపడి బైక్, ఫోన్ ఇక్కడే వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయాడని తెలిపింది. –సాక్షి, హైదరాబాద్ .. ఇలా ఒకరిద్దరు కాదు, ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 482 మంది పురుషులు అదృశ్యమయ్యారు. సగటున రోజుకు నలుగురు గాయబ్ అవుతున్నారు. అత్యధికంగా మాదాపూర్ జోన్లో 194 మంది మగాళ్లు తప్పిపోగా.. బాలానగర్ జోన్ పరిధిలో 136 మంది, శంషాబాద్ జోన్లో 152 మంది కనబడకుండా పోయారు. ఈ 3 జోన్లలో కలిపి 332 మందిని గుర్తించారు. గత రెండేళ్లలో 2,943 మంది అదృశ్యమయ్యారు. చెప్పాపెట్టకుండా.. ఇష్టం లేని పెళ్లి, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలే పురుషులు అదృశ్యమవడానికి ప్రధాన కారణాలని రాచకొండ డీసీపీ క్రైమ్స్ కల్మేశ్వర్ శింగేనవర్ తెలిపారు. అన్సౌండ్ మైండ్ (మానసికంగా దృఢంగా లేనివాళ్లు) తప్పిపోతే.. వాళ్ల ఆచూకీకి కొంత సమయం పడుతుందని చెప్పారు. ఒత్తిడి, పెట్టుబడుల్లో నష్టం, రుణాల వల్ల విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు చెప్పాపెట్టకుండా వెళ్లిపోతున్నారని మరో పోలీసు అధికారి తెలిపారు. ‘‘ఇటీవల మాదాపూర్‌కు చెందిన ఓ ఐటీ ఉద్యోగి అప్పులు చేసి మరీ షేర్ మార్కెట్లో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాడు. నష్టం రావడంతో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. భార్య ఫిర్యాదు మేరకు పీఎస్‌లో కేసు నమోదయింది’’ అని ఆయన చెప్పారు. వలస కార్మికుల పరారీ బీహార్, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే లక్షలాది మంది వలస కార్మికులు భవన నిర్మాణ పనుల్లో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తుంటారు. వీరిలో చాలా మంది కాంట్రాక్టర్లకు చెప్పకుండా రాత్రికిరాత్రే పని ప్రదేశాల నుంచి పారిపోతున్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన అనిల్ ఓరన్ పుప్పాలగూడలోని అపర్ణ కన్స్ట్రక్షన్స్ నిర్మిస్తున్న ప్రాజెక్టులో లేబర్‌గా చేరాడు. గత నెల 2న నార్సింగి మార్కెట్‌కు వెళ్లి తిరిగి లేబర్ క్యాంప్‌కు రాకపోవడంతో సైట్ ఇంజనీర్ దాసరి ప్రతాప్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పని ప్రదేశాలలో గొడవలు, అప్పులు, ఒత్తిడితో కార్మికులు పనులను వదిలేసి అదృశ్యమవుతున్నట్లు విచారణలో తేలింది. ట్రాకింగ్ అండ్ ట్రేసింగ్: అదృశ్యమైన వ్యక్తుల ఫోన్‌ను పోలీసులు ట్రాకింగ్‌లో పెడతారు. లుక్ అవుట్ నోటీసులు జారీ చేసి వ్యక్తి ఫొటో, చిరునా మాలతో కరపత్రాలను ముద్రించి బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, బహిరంగ ప్రదేశాల్లో అంటిస్తారు. దర్పణ్ యాప్, పోలీసు వెబ్సైట్లలో వ్యక్తి ఫొటో, వివరాలను అప్లోడ్ చేస్తారు. అదృశ్యమైన వ్యక్తికి శత్రువులు, అప్పులు ఇచ్చినవాళ్లు ఉన్నారా ఆరా తీసి వారిపై నిఘా పెడుతుంటారు. ట్రేస్ చేసి పట్టుకుంటున్నాం పురుషులు చిన్న చిన్న గొడవలతో ఇంట్లో నుంచి వెళ్లిపోతుంటారు. కొంతకాలం తర్వాత వాళ్లే తిరిగి వస్తుంటారు. మిస్సింగ్ ఫిర్యాదు అందగానే ప్రత్యేక వ్యవస్థ ద్వారా ట్రేస్ చేసి పట్టుకుంటున్నాం. – స్టీఫెన్ రవీంద్ర పోలీస్ కమిషనర్, సైబరాబాద్ -
ఠాణా.. తందానా..అవినీతి మకిలీలో హైదరాబాద్ పోలీసులు
సాక్షి, హైదరాబాద్/మణికొండ: బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులే భక్షిస్తున్నారు. కేసుల నమోదు, స్టేషన్ల బెయిల్, భూవివాదాలు, సినిమా షూటింగ్ అనుమతులు.. ఇలా పోలీసుల అవసరం ఉన్న ప్రతీ చోట వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఏసీపీ, డీసీపీలూ తమకేమీ తెలియదన్నట్టు వ్యవహరిస్తుండటంతో బాధితులు నేరుగా పోలీస్ కమిషనర్లను ఆశ్రయిస్తున్నారు. ఆరోపణలపై అంతర్గత విచారణ జరిపి సదరు పోలీసులను సస్పెండ్ చేస్తున్నా రు. తాజాగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగి ఠాణాలో ఇన్స్పెక్టర్, ఎస్ఐలపై సీపీ స్టీఫెన్ రవీంద్ర సస్పెన్షన్ వేటు వేశారు. రెండ్రోజుల క్రితమే ఓ నేరస్తునితో జట్టు కట్టి డబ్బులు వసూలు చేసిన సరూర్‌నగర్ ఎస్ఐ సైదులును రాచకొండ సీపీ సస్పెన్షన్ చేసిన విషయం విదితమే. చదవండి: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సిటీ బస్సు ఇక చిటికలో పోస్టింగ్‌ల్లో మితిమీరిన రాజకీయ జోక్యం.. ►ఒక్క పోస్టింగ్ దొరికితే చాలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా సంపాదిస్తున్నారనే విమర్శలున్నాయి. అవినీతి, అక్రమాలు బయటపడిన స్థానిక రాజకీయ నేతలు వారిని కాపాడుతున్నారనే ఆరోపణలున్నాయి. ►రాజకీయ బలం ఉన్న ఇన్స్పెక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేక పోలీస్ ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఒకవేళ వేటు వేసినా.. తమకున్న రాజకీయ అండదండలతో వేరే చోట లేదా వేరే కమి షనరేట్‌లో పోస్టింగ్‌లు పొందుతున్నారు. నిజాయితీ గల అధికారులకు ఏళ్ల తరబడి ఎదురుచూసినా ఎస్హెచ్ఓ పోస్టింగ్ దక్కడంలేదు. ►పోస్టింగ్‌ల విషయంలో మితిమీరిన రాజకీయ జోక్యం ఉందనే విమర్శలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. తమకు నచ్చిన వారికే పోస్టింగ్‌లు ఇప్పిస్తుండటంతో పోలీస్ ఉన్నతాధికారులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. చదవండి: నేటి నుంచే ఇంటర్ పరీక్షలు.. ఓపిక ఉంటే అక్కడైనా రాయొచ్చు! సెటిల్మెంట్లలో.. భూ వివాదాలలో.. ►నగరంలో రియల్ ఎస్టేట్ బూమ్ పెరగడంతో నేరస్తులతో దోస్తీ కట్టి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇన్స్పెక్టర్లు, సెక్టార్ ఎస్ఐలు కాసులు దండుకుంటున్నారు. ►అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నార్సింగి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మధనం గంగాధర్, సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) కె. లక్ష్మణ్‌లను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ►గతంలో వీరిద్దరిపై పలు భూ వివాదాలలో సెంటిల్మెంట్లు చేసినట్లు విచారణలో తేలింది. కొల్లూరు, జన్వాడ గ్రామాల సరిహద్దు భూ వివాదంలో తలదూర్చి సెటిల్మెంట్లకు పాల్పడినట్లు విచారణలో తేలింది. దోస్తీ కట్టి.. దొరికిపోయి.. ►రెండు రోజుల క్రితమే సరూర్‌నగర్ ఎస్ఐ బి.సైదులును రాచకొండ పోలీస్ కమిషనర్ సస్పెండ్ చేశారు. ఓ కేసు దర్యాప్తులో భాగంగా నేరస్తుడితో సైదులుకు పరిచయం ఏర్పడింది. అనతికాలంలో ఇద్దరూ మంచి స్నేహితులుగా మారారు. ►ఎస్ఐ కుటుంబంతో సహా కలిసి విజయవాడ విహారయాత్రకు వెళ్లాడు. ఆ సమయంలో నిందితుడు ఖరీదైన హోటల్లో బస ఏర్పాటు చేశాడు. రవాణా, భోజనం, ఇతరత్రా ఖర్చులను నేరస్తుడే భరించాడు. ఆయా బిల్లులన్నీ భద్రపరుచుకున్నాడు. ►తిరిగి హైదరాబాద్‌కు వచ్చాక.. అధికారాన్ని వినియోగించుకొని తనను బెదిరించాడని సదరు నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఎస్ఐతో దిగిన ఫొటోలు, హోటల్ బిల్లులు తదితర ఆధారాలన్నీ జత చేశాడు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి.. చర్యలు తీసుకోవాలని సంబంధిత ఉన్నతాధికారులను ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. విచారణ జరిపిన సంబంధిత అధికారులు ఎస్ఐని సస్పెండ్ చేశారు. ‘సమర్పించు’కోకపోతే అనుమతులివ్వరు.. ►సినిమా షూటింగ్‌లకు పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే వారికి వసూళ్ల వేదికగా మారింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా, సరైన పత్రాలు ఉన్నా.. పోలీసులకు ‘సమర్పించు’కోకపోతే అనుమతులు రావు. ఇలాంటి సంఘటనలు నార్సింగి, రాయదుర్గం పోలీస్ స్టేషన్ల పరిధిలో చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ►ఆయా పీఎస్‌ల పరిధిలో షూటింగ్‌లకు అనువైన ప్రదేశాలు చాలా ఉండటం వీరికి కలిసొచ్చే అంశం. అనుమతులు వచ్చినా, రాకపోయిన స్థానిక పోలీస్ స్టేషన్లలో సంప్రదించాల్సిందే. సెక్టార్ ఎస్ఐతో పాటు బీట్ కానిస్టేబుళ్లు, పెట్రోలింగ్ సిబ్బంది చేయి తడపనిదే సినిమా షూటింగ్ ముందుకు సాగని పరిస్థితి ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. ►కేవలం లా అండ్ ఆర్డరే కాదు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో సదరు అధికారులకు తడపనిదే పని జరగని పరిస్థితి. రాయదుర్గం పరిధిలోకి వచ్చే ఓ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సినిమా నిర్మాతలకు బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. స్టేషన్ బెయిల్ కోసం లంచం.. గత నెల 21న స్టేషన్ బెయిల్ కోసం రూ.25 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు మహేశ్వరం పీఎస్ కానిస్టేబుల్ యాదయ్య. మహేశ్వరం మండలం పోరండ్ల గ్రామానికి చెందిన దయ్యాల బాల్‌రాజ్‌తో పాటు మరో అయిదుగురిపై భూ వివాదంలో మహేశ్వరం ఠాణాలో కేసు నమోదయింది. స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి కానిస్టేబుల్ యాదయ్య (ఎస్ఐ రైటర్) రూ.25 లక్షల డిమాండ్ చేశాడు. ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డికి రూ.20 లక్షలు, తనకి రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. -
సైబరాబాద్ పోలీస్: కోవిడ్ సేవల కోసం ప్రత్యేక వెబ్సైట్
సాక్షి, సిటీబ్యూరో( హైదరాబాద్) : కరోనా బాధితులను ఆదుకోవడానికి ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న సైబరాబాద్ పోలీసులు మరో ఆవిష్కరణ చేశారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) సహకారంతో covid.scsc.in పేరుతో ఓ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇది శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. ఇటీవల కాలంలో సోషల్‌మీడియా, వాట్సాప్ తదితరాల్లో కొవిడ్‌పై రకరకాలైన అంశాలు కనిపిస్తున్నాయి. వీటిలో ఏది నిజం, ఏది కాదో తెలియక ప్రజలు గందరగోళానికి లోనవుతున్నారు. ఆ పరిస్థితులకు covid.scsc.in వెబ్సైట్ ఓ పరిష్కారం అవుతుందని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. ఈ సైట్లో వివిధ రకాలైన ఉపయుక్త సమాచారం అందుబాటులో ఉంచామని తెలిపారు. సైట్లో ఉండే వివరాలివి... ► క్రిటికల్ కేర్ సర్వీసెస్: అంబులెన్సులు, ఆక్సిజన్ సప్లయర్స్, హాస్పిటల్స్‌తో పాటు వాటిలోని బెడ్స్ వివరాలు, ప్లాస్మా సపోర్ట్, బ్లడ్ బ్యాంకులు, అంతిమ సంస్కారాలు చేసే సంస్థలు ► సెల్ఫ్ కేర్ సర్వీసెస్: ఐసోలేషన్ సెంటర్ల వివరాలు, హోమ్ క్వారంటైన్‌పై సలహాలు, డాక్టర్ ఆన్ కాల్, డయాగ్నస్టిక్ సెంటర్లు, ఫార్మాస్యూటికల్స్, ఆహారం అందించే సంస్థలు ► ప్రివెంటివ్ కేర్ సర్వీసెస్: సైకాలజిస్టులు/కౌన్సిలర్ల సేవలు, వాక్సినేషన్ సెంటర్ల వివరాలు, పీపీఈ కిట్స్ సరఫరాదారులు, శానిటైజేషన్ సేవలు అందించే సంస్థలు ► లేటెస్ట్ ఇన్ఫర్మేషన్: కోవిడ్ బులెటిన్స్, కీలక ఫోన్ నెంబర్లు, వివరాలు, నెట్వర్క్ గ్రూపులు ( చదవండి: కరోనా సోకిన వెంటనే ఆస్పత్రిలో చేరాలా? ) -
పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి : సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా అమరవీరుల కుటుంబాలను శుక్రవారం సీపీ సజ్జనార్ పరామర్శించారు. ఐపీఎస్, స్వర్గీయ చదలవాడ ఉమేష్ చంద్ర ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన తల్లిదండ్రులను సీపీ ఘనంగా సత్కరించారు. అలాగే పోలీస్ అమరవీరుడు కానిస్టేబుల్ ఈశ్వర్ రావు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను సజ్జనార్ పరామర్శించారు. బాధిత కుటుంబాలకు పోలీస్ డిపార్ట్మెంట్ తరపున అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. చదవండి: దయచేసి సాహసాలు చేయొద్దు: సీపీ సజ్జనార్ సీపీ వెంట శంషాబాద్ డీసీపీ ఎన్ ప్రకాష్ రెడ్డి, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎమ్ విజయ్ కుమార్, ఐపీఎస్., డీసీపీ క్రైమ్స్ రోహిణీ ప్రియదర్శినీ, ఐపీఎస్, విమన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ అనసూయ, బాలానగర్ డీసీపీ పద్మజా, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఏడీసీపీ మాణిక్ రాజ్, ఏసీపీ మాదాపూర్ రఘునందన్ రావు, బాలానగర్ ఏసీపీ పురుషోత్తం, జీడిమెట్ల ఇన్ స్పెక్టర్ బాలరాజు, ఇన్‌స్టెక్టర్ గురవయ్య తదితరులు ఉన్నారు. -
సైబరాబాద్ : ప్లాస్మాదానం ప్రచారంలో రాజమౌళి
-
ఐటీ కంపెనీలతో సీపీ సజ్జనార్ సమావేశం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఐటీ కంపెనీలలో కేవలం 33 శాతం ఉద్యోగులతో కంపెనీ కార్యకలాపాలకు అనుమతిని ఇస్తున్నట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. సైబరాబాద్‌లో ఐటీ కంపెనీల యాజమాన్యంతో సీపీ శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులు ఉదయం 7 నుంచి 10 గంటల మధ్య లాగిన్ అవ్వాలని.. మళ్లీ సాయంత్రం 3 నుంచి 6 గంటల మధ్య లాగ్ అవుట్ కావాలని చెప్పారు. ఇక కంపెనీ అధికారిక లెటర్‌ను ప్రతీ ఉద్యోగీ తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలన్నారు. రాత్రి కర్ఫ్యూ సమయంలో కంపెనీ కార్యకలాపాలకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. కంపెనీ రవాణా బస్సులలో సైతం సోషల్ డిస్టెన్స్ పాటించాలని ఆయన సూచించారు. ప్రతీ కంపెనీలో శానిటైజేషన్, ఉద్యోగులకు మాస్క్‌లు ఉండాలని, సంస్థ ఆవరణం ఉద్యోగులు గుంపులుగా ఉండకూడదని హెచ్చరించారు. కంపెనీలో క్యాంటీన్లకు అనుమతి లేదని సజ్జనార్ వెల్లడించారు. తమిళనాడు కీలక నిర్ణయం.. సడలింపులు ఇవే -
సీపీ సజ్జనార్‌కు 2,500కు పైగా మిస్డ్ కాల్స్
సాక్షి, హైదరాబాద్ : దిశ హంతకుల ఎన్కౌంటర్ ఓ రకంగా సైబరాబాద్ సీపీ సజ్జనార్‌పై కొంత ఒత్తిడి తగ్గించిందనే చర్చ పోలీస్ వర్గాల్లో జరుగుతోంది. సజ్జనార్‌కు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరుండడం, ఇప్పుడు ఘటన జరిగిన పరిధికి కూడా ఆయనే పోలీస్ బాస్ కావడంతో నిందితుల ఎన్కౌంటర్ జరుగుతుందని కొందరు ఊహించారు. మరికొందరు ఏకంగా సీపీ సజ్జనార్‌కే ఫోన్ చేసి చెప్పేందుకు ప్రయత్నించారని తెలుస్తోంది. గత వారం రోజుల్లో సజ్జనార్ మొబైల్‌కు 2,500కు పైగా మిస్డ్ కాల్స్ వచ్చాయంటే ఈ ఘటన తర్వాత ఆయన ఎంత ఒత్తిడి ఎదుర్కొన్నారో అర్థం చేసుకోవచ్చని పోలీస్ వర్గాలంటున్నాయి. ప్రతి నిమిషం ఆయన ఫోన్‌కు ఎస్ఎంఎస్లు, వాట్సాప్ మెసేజ్‌లు వెల్లువెత్తాయి. సీపీ సజ్జనార్‌కే కాదు ఆయన సతీమణి ఫోన్‌కు కూడా వందల సంఖ్యలో మెసేజ్‌లు వచ్చాయని, నిందితులను ఎన్కౌంటర్ చేయాలనే భావన ఆ మెసేజ్‌ల్లో వ్యక్తమైందని అంటున్నారు. అలా ఎస్ఎంఎస్ లు, వాట్సాప్ మెసేజ్‌లు పంపిన వారిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల భార్యలు, కుటుంబ సభ్యులున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని సజ్జనార్ ఎవరితో చర్చించకుండా రహస్యంగానే ఉంచి ఒత్తిడిని భరించారని పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఓవైపు కేసు విచారణ, దర్యాప్తు, ప్రభుత్వ వర్గాల నుంచి సహజంగా ఉండే ఒత్తిడికి తోడు పౌర సమాజం డిమాండ్లను తట్టుకున్న సజ్జనార్ నిందితులకు చట్టపరం గా శిక్ష పడాలనే దర్యాప్తు కొనసాగించారని అంటున్నారు. అనుకోకుండా ఎన్కౌంటర్ జరిగిందని, దీనిని పౌరసమాజం హర్షించడంతో సజ్జనార్‌కు మానసికంగా ఊరట కలిగినట్టేననే చర్చ పోలీసు వర్గాల్లో జరుగుతోంది. చదవండి: ‘దిశ’ నిందితుల ఎన్కౌంటర్ మృగాడైతే.. మరణ శిక్షే! ఆ ఆరున్నర గంటలు ఇలా... ‘దిశ’ తిరిగిన న్యాయం -
మృగాడైతే.. మరణ శిక్షే!
సాక్షి ప్రతినిధి, వరంగల్: మనిషి మృగాడిగా మారితే మరణ శిక్షే సరి.. కరడుగట్టిన నేరాలకు పాల్పడే మానవ మృగాల పట్ల పోలీసుల వైఖరిని సమాజం హర్షిస్తోంది. పదేళ్ల కిందట 2008 డిసెంబర్ 8న వరంగల్‌లో ప్రణీత, స్వప్నికపై యాసిడ్ దాడి.. నవంబర్ 27న షాద్‌నగర్ చటాన్‌పల్లి వద్ద దిశపై అత్యాచారం, హత్యలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ రెండు కేసుల్లోనూ నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిన పోలీసులు... తదుపరి విచారణ కోసం కస్టడీకి తీసుకున్నారు. 2008 డిసెంబర్ 13న ‘సీన్ రీకన్స్ట్రక్షన్’కోసం మామూనూరు పోలీసు క్యాంపు సమీపంలో నిందితులను విచారిస్తుండగా పోలీసుల నుంచి ఆయుధాలు తీసుకుని దాడికి ప్రయత్నించడం.. పోలీసులు ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో నిందితులు శాఖమూరి శ్రీనివాసరావు, బజ్జూరి సంజయ్, పోతరాజు హరికృష్ణ మృతి చెందారు. తాజాగా దిశ నిందితుల ఎన్కౌంటర్.. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ రెండు ఘటనలకు బాధ్యులైన మానవ మృగాలకు మరణశిక్షే పడింది. మగాళ్లు మృగాళ్లుగా మారితే ఇక అంతేనన్న విషయాన్ని నేరగాళ్లకు నేరుగా చెప్పారు. కాగా 2008 డిసెంబర్ 13న వరంగల్‌లో జరిగిన ఘటన సమయంలో సజ్జనార్ ఎస్పీగా ఉండగా.. ప్రస్తుతం సైబరాబాద్ కమిషనర్‌గా ఉన్న ఆయన ఈ రెండు సంఘటనలలో కీలకంగా వ్యవహరించారు. వరంగల్‌లో మొత్తం మూడు ఘటనలు.. పదేళ్ల కాలంలో వరంగల్ జిల్లాలో మూడు దారుణ ఘటనలు జరగ్గా.. అందులో నిందితులకు చావే శరణ్యమైంది. రెండు సంఘటనలు సజ్జనార్ హయాంలో జరగ్గా.. మరో ఘటన సౌమ్యామిశ్రా ఎస్పీగా ఉన్నప్పుడు జరిగింది. 2008 డిసెంబర్లో హసన్‌పర్తి మండలం భీమారం వద్ద యాసిడ్ దాడి జరిగింది. కిట్స్ కాలేజీకి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థినులు స్వప్నిక, ప్రణీతపై శాఖమూరి శ్రీనివాస్ మ రో ఇద్దరితో కలసి దాడి చేశాడు. ఈ ఘటన జరిగినప్పుడు ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసు కోగా.. సాక్ష్యాల సేకరణ సమయంలో తప్పించుకునేందుకు ప్రయత్నించగా జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. ఎన్కౌంటర్ చేయడం తో ముగ్గురూ మృతి చెందారు. మహిళలపై వేధింపులకు పాల్పడటంతో కరడుగట్టిన రౌడీషీటర్లుగా మారిన గడ్డం జగన్ అలియాస్ జయరాజ్, ఎ.రత్నాకర్‌ను 2008 అక్టోబర్ 2008న ‘సీన్ రీకన్స్ట్రక్షన్’కోసం ఉర్జుగుట్ట ప్రాంతంలో విచారిస్తున్న సమయంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరూ మరణించారు. వరంగల్‌కు చెందిన పత్తి వ్యాపారి కుమార్తె మనీషాను 2008లో కిడ్నాప్ చేసి హత్య చేశారు. అప్పట్లో ఈ సంఘటన తీవ్ర సంచలనం రేపింది. అప్పటి ఎస్పీ సౌమ్యామిశ్రా ప్రజల నుంచి వచ్చిన ఒత్తిళ్లను అర్థం చేసుకుని కేసులో ముందుకు సాగారు. వారిని కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతుండగా.. నిందితులు టి.రాజు, ఎల్.అశోక్, బి.నరేశ్‌లు ఎన్‌కౌంటర్‌కు గురయ్యారు. అదే డిసెంబర్... అదే సజ్జనార్ ∙ 2008 డిసెంబర్ 13న ముగ్గురు యాసిడ్ దాడి నిందితుల ఎన్కౌంటర్ ∙ అప్పుడు వరంగల్ పోలీస్ కమిషనర్‌గా సజ్జనార్ ∙ మళ్లీ 2019 డిసెంబర్ 6న దిశ నిందితుల ఎన్కౌంటర్ ∙ ప్రస్తుతం సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సజ్జనార్ -
దిశను చంపిన దగ్గరే ఎన్కౌంటర్..
-
దిశను చంపిన దగ్గరే ఎన్కౌంటర్..
సాక్షి, హైదరాబాద్ : దిశ హత్యకేసు నిందితుల ఎన్కౌంటర్ జరిగిన సంఘటనా స్థలానికి సైబరాబాద్ సీపీ సజ్జనార్ చేరుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. ఎన్‌కౌంటర్‌పై మరికాసేపట్లో అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాగా దిశను చంపిన ప్రాంతంలోనే నిందితులు ఎన్కౌంటర్ అయ్యారు. దిశ కేసు దర్యాప్తును సైబరాబాద్ పోలీసులు సవాల్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు నిందితులను షాద్ నగర్ పోలీసులు పది రోజుల కస్టడీకి తీసుకున్నారు. దిశ అత్యాచారానికి గురైన ప్రాంతం తొండుపల్లి టోల్‌ప్లాజా సర్వీసు రోడ్డు నుంచి పెట్రోల్, డీజిల్ పోసి మృతదేహాన్ని కాల్చిన చటాన్‌పల్లి అండర్‌పాస్ ప్రాంతంలో క్రైమ్ సీన్‌ను రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో ఈ కేసులో ఏ-1 మహ్మద్ ఆరిఫ్, ఏ-2 శివ, ఏ-3 నవీన్, ఏ-4 చెన్నకేశవులను పోలీస్ ఎన్కౌంటర్ చేశారు. తెల్లవారుజామున 3.30 గంటలకు ఈ కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. చదవండి: దిశ నిందితుల ఎన్కౌంటర్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘క్యూనెట్’పై ఈడీ
సాక్షి, హైదరాబాద్: మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో అమాయకులను రూ. వేల కోట్లకు బురిడీ కొట్టించిన క్యూనెట్ సంస్థపై నమోదైన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) త్వరలో రంగంలోకి దిగ నుంది. ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బును విదేశాలకు తరలించిం దన్న ఆరోపణలపై మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద దర్యాప్తు ప్రారంభించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ పోలీసులు మొత్తం అందజేసినట్లు సమాచారం. వాటి ఆధారంగానే త్వర లోనే ఈడీ అధికారులు ఈ కేసులో నేరుగా రంగంలోకి దిగను న్నారు. క్యూనెట్ సంస్థ వేలాది మంది బాధి తుల నుంచి వసూలు చేసిన కోట్లాది రూపాయలను విదేశాలకు ఎలా తరలిం చారు? ఎవరి సాయం తీసుకున్నారు? ఎంత మొత్తాన్ని విదేశాలకు చేరవేశారు? అక్కడ ఏమైనా ఆస్తులు కొనుగోలు చేశారా? దేశంలోనూ పలు చోట్ల వీరు ఆస్తులు కూడబెట్టారా? వంటి విషయాలపై ఆరా తీయనుంది. ఈ వ్యవహారంలో హైదరాబాద్‌కు సంబంధించి మొత్తం 38 కేసులు నమోదవగా 70 మందిని అరెస్టు చేశారు. వారిలో కీలకమైన 12 మంది వ్యక్తులు పారిపోకుండా ఇప్పటికే లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉండి రూ. కోట్లు కాజేసిన వ్యక్తులు, ప్రచారం చేసిన పలువురు సినీ ప్రముఖులకు ఈడీ అధికారులు త్వరలోనే నోటీసులు జారీ చేసి విచారణకు పిలవనున్నారని తెలిసింది. అయితే దీనిపై ఇపుడే ఏమీ చెప్పలేమని ఓ అధికారి తెలిపారు. ఐదేళ్ల కిందటే క్యూనెట్ అక్రమ దందా..! క్యూ గ్రూప్ (హాంకాంగ్)కు చెందిన విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ’క్యూనెట్’పేరిట భారత్‌లో జరుపుతున్న ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ దందాలో దాదాపు రూ. 5000 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. జనవరిలో హైదరాబాద్‌లో వెలుగుచూసిన ఈ దందాకు సంబంధంచి కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర, ఢిల్లీలోనూ కేసులు నమోదయ్యాయి. వాస్తవానికి ఐదేళ్ల కిందటే మహారాష్ట్రలో క్యూనెట్ అక్రమాలపై తొలుత కేసులు నమోదయ్యాయి. మల్టీలెవల్ సంస్థల్లో ఎవరూ చేరొద్దు: సజ్జనార్ క్యూనెట్ అనుబంధ సంస్థ విహన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌ను మూసివేసే దిశగా కేంద్ర కార్పొరేట్ వ్యవహరాలశాఖ చర్యలు చేపట్టిందని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈ కంపెనీ సహా మల్టీలెవల్ మార్కెటింగ్ సంస్థల్లో ఎవరూ సభ్యులుగా చేరవద్దని సూచించారు. విహన్ సంస్థలో ఇప్పటికే చేరిన వారు ప్రమోటర్లకు డబ్బు చెల్లించవద్దని, అలా చేస్తే వారే నష్టపోతారని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసులో సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ చేపట్టిన చర్యలను వివరించడంతోపాటు ప్రజలను ఎంఎల్ఎం మోసాలపై జాగృతపరిచేలా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సజ్జనార్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ కంపెనీ బ్యాంక్ ఖాతాల్లో ఉన్న రూ. 2.7 కోట్లను ఫ్రీజ్ చేశామని, బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించిన సెలబ్రిటీలు అనిల్ కపూర్, షారూఖ్‌ఖాన్, బొమన్ ఇరానీ, జాకీష్రాఫ్, వివేక్ ఒబెరాయ్, పూజా హెగ్డే, అల్లు శిరీష్‌లకు నోటీసులు జారీ చేశామన్నారు. అనిల్ కపూర్, షారూఖ్‌ఖాన్, బొమన్ ఇరానీలు వారి అడ్వొకేట్ల ద్వారా బదులిచ్చారని, మిగతా వాళ్ల నుంచి ఇంకా సమాధానం రాలేదన్నారు. వారితోపాటు మొదటి 500 ప్రమోటర్లకు కూడా నోటీసులు జారీ చేసినా సమాధానాలు రాలేదని సజ్జనార్ చెప్పారు. బాధితుల ఫిర్యాదులతో కేంద్రం సైతం ఈ సంస్థపై దర్యాప్తు చేపట్టాలని సౌత్ ఈస్ట్ రీజియన్ హైదరాబాద్ ఆర్వోసీని గతంలోనే ఆదేశించిందన్నారు. ఆర్వోసీ నివేదిక ఆధారంగా ఆ కంపెనీని మూసేయాలని బెంగళూరు ఆర్వోసీని ఆదేశించడంతోపాటు ఈ కంపెనీకి అనుబంధంగా ఉన్న 12 మందిపై లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేసిందని సజ్జనార్ వివరించారు. ఇందుకు సంబంధించిన కాపీని ఆయన మీడియాకు చూపించారు. కార్యక్రమంలో సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, ఎకనామిక్ ఆఫెన్స్ వింగ్ అధికారులు పాల్గొన్నారు. -
క్యూనెట్ స్కాంలో 70 మంది అరెస్టు
సాక్షి, హైదరాబాద్ : క్యూనెట్ స్కామ్‌లో 70 మందిని అరెస్ట్ చేసి వారిపై 38 కేసులు నమోదు చేసినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ కేసుకు సంబంధించి బెంగుళూరులో రూ. 2.7 కోట్ల నగదును సీజ్ చేసినట్లు, క్యూనెట్‌ను ప్రచారం చేసిన సినీ ప్రముఖులకు నోటిసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. క్యూనెట్ సంస్ధ మల్టిలెవల్ మార్కెటింగ్ పేరుతో కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి మోసం చేస్తున్నారని, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో బాధితులు ఉన్నట్లు వెల్లడించారు. క్యూనెట్ కంపెనీకి సంబంధం లేని వ్యక్తులు కూడా పెట్టుబడుల్లో వచ్చిన డబ్బుని వాడుకుంటున్నారని, దేశ వ్యాప్తంగా క్యూనెట్ సంస్థ 5 వేల కోట్ల రూపాయలు మోసం చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. ఈ సంస్థపై అనేక ఫిర్యాదులు అందడంతో ఈ కేసును లోతుగా విచారించాలని రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్ ఆదేశాలు ఇచ్చిందన్నారు. 15 రోజుల క్రితం క్యూనెట్ బాధితుడు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సైబరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నాడని, మరో వ్యక్తి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఈ క్యూనెట్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖులు దేశం దాటి పోకుండా 12 మందిపై లుక్ ఔట్ నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించారు. కేవలం డబ్బులు వసూలు చేయడమే వీరి పని అని, ఇలాంటి మార్కెటింగ్ మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీపీ సూచించారు. క్యూనెట్కు ఎలాంటి రికార్డులు లేవని, రూ.100 విలువ చేసే వస్తువు రూ.1500 కి అమ్మకాలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగులకు టోకరా వేసిన ముఠా గుట్టు రట్టు బ్యాంకు ఉద్యోగులను మోసం చేసిన ముఠా గుటు రట్టు అయ్యింది. బ్యాంక్ ఉద్యోగులను మోసం చేస్తూ కోట్లు కొల్లగొడుతున్న గ్యాంగ్‌ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ముఠాకు చెందిన నలుగురిని అరుణ్, లోకేష్ తోమర్, మోహిత్ కుమార్, మనోజ్ కుమార్‌ను అరెస్టు చేసినట్లు కమిషనర్ సజ్జనార్ వెల్లడించారు. పెద్ద కార్ల షో రూమ్‌లను వేదికగా చేసుకొని దేశ వ్యాప్తంగా భారీ మోసాలు చేస్తూ అనేక మందిని మోసం చేసినట్లు పేర్కొన్నారు. కావున బ్యాంకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సరైన సమాచారం లేకుండా డబ్బులు బదిలీ చేయవద్దని సూచించారు. నిందితుల నుంచి మూడు లక్షల నగదుతోపాటు ఏడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
మల్టీ‘ఫుల్’ చీటింగ్
సాక్షి, హైదరాబాద్ : మల్టీపుల్ మార్కెటింగ్ పేరుతో దేశవ్యాప్తంగా 17 లక్షల మంది సభ్యుల్ని చేర్చుకుని వారికి ఏకంగా రూ.ఐదువేల కోట్లు శఠగోపం పెట్టేశారు ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన ఈ బిజ్ కంపెనీ నిర్వాహకులు. మాయమాటలతో కేవలం విద్యార్థులు, నిరుద్యోగులనే లక్ష్యంగా చేసుకుని తమ వ్యాపారాన్ని విస్తరించుకుని వీరిని మాత్రం రోడ్డున పడేశారు. ఈ ‘మాయా వలయం’లో మోసపోయామని గ్రహించిన కొందరు పోలీసు ఫిర్యాదు చేయగా...విచారణ చేపట్టిన సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (ఎకనామిక్ ఆఫెన్స్ వింగ్) ఈ కేసును సవాలుగా తీసుకుని ఈ బిజ్ నిర్వాహకుల్ని అరెస్టు చేసి రాష్ట్రానికి తీసుకొచ్చింది. ఈ కేసు వివరాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మంగళవారం మీడియాకు వివరించారు. 18 ఏళ్లుగా సాగుతున్న మల్టీలెవల్ మోసం ఈ–బిజ్.కాం ప్రైవేట్ లిమిటెడ్‌తో 2001లో ప్రారంభించిన ఈ కంపెనీని న్యూఢిల్లీలోని ఆర్వోసీతో రిజిష్టర్ చేశారు. ఈ కంపెనీ డైరెక్టర్‌గా పవన్ మల్హన్ భార్య అనితా మల్హన్ ఉన్నారు. అయితే, ఈ కంపెనీ వ్యవహారాలను వారి కుమారుడు హితిక్ మల్హన్ పర్యవేక్షిస్తున్నారు. ఈ కంపెనీ సుమారు 17 లక్షల మందిని సభ్యులుగా చేర్చుకుని రూ.ఐదువేల కోట్ల వరకు మోసం చేసిందని సైబరాబాద్ పోలీసులు చెబుతున్నారు. ఈ కంపెనీ వ్యవహారాలపై సైబరాబాద్ కమిషనరేట్‌లోని మాదాపూర్, కేపీహెచ్‌బీ ఠాణాల్లో ఫిర్యాదు రావడంతో ఈ–బిజ్.కాం ప్రైవేట్ లిమిటెడ్‌పై కేసు నమోదుచేసి సైబరాబాద్ ఎకనామిక్ ఆఫెన్స్ వింగ్‌కు మార్చిలోనే బదిలీ చేశారు. దీన్ని విచారణ చేపట్టిన పోలీసులు నోయిడాకు వెళ్లి ఎండీ పవన్ మల్హన్, కుమారుడు హితిక్ మల్హన్‌ను తీసుకొచ్చి కంపెనీకి సంబంధించిన వ్యవహారాలు తెలపాలంటూ నోటీసులు జారీ చేశారు. అప్పటి నుంచి నోటీసులకు వారు సమాధానం ఇవ్వకపోవడంతో పాటు పరారీలో ఉండటంతో సైబరాబాద్ ఎకనామిక్ ఆఫెన్స్ వింగ్సీ కేసును సీరియస్‌గా తీసుకుంది. ఎట్టకేలకు తండ్రీకొడుకులు పవన్ మల్హన్, హితిక్ మల్హన్లపై నిఘా ఉంచి యూపీలో అరెస్టు చేశారు. మిగిలిన నిందితుల కోసం కూడా గాలిస్తున్నారు. ‘‘ఈ కంపెనీ హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, చెన్నై, జమ్మూ, కాశ్మీర్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గోవాతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ విద్యార్థులను కంపెనీ సభ్యులు నమోదు చేసుకుంది. వీరందరి దగ్గర్నుంచి సుమారు రూ.ఐదువేల కోట్లను మోసం చేసింద’’ని సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈ కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి బాధితులకు సత్వర న్యాయం చేకూరుస్తామని చెప్పారు. విద్యార్థులు, నిరుద్యోగులే లక్ష్యంగా.. ‘మీకు ఆన్లైన్ కోర్సులు నేర్పుతాం..మీరు రూ.16,821లు చెల్లిస్తే చాలు... ఆన్లైన్లో మంచి పట్టు సాధించొచ్చు. ఆ తర్వాత మరో ముగ్గురిని ఇదే కోర్సులో చేర్పిస్తే ఒక్కొక్కరికి రూ.2,700ల చొప్పున కమీషన్ ఇస్తాం...ఇది కాకుంటే మంచి ఫ్యాషన్ డ్రెస్సులు ఉన్నాయి...మీరు చెల్లించిన డబ్బులకు అవి ఇచ్చేస్తాం...ఇదీ నచ్చకపోతే హాలీడే ట్రిప్స్‌కు తీసుకెళతాం...ఆ తర్వాత మీరు చేయాల్సిందల్లా మరో ముగ్గురు సభ్యులను చేర్పిస్తే చాలు... ఒక్కొక్కరిపై తొమ్మిది శాతం కమీషన్ వస్తుంది. దీంతో మీరు తల్లిదండ్రులపై ఆధారపడకుండా ఎంజాయ్ చేయవచ్చం’టూ కాలేజీ విద్యార్థులనే లక్ష్యంగా చేసుకుని మాయమాటలతో వ్యాపారం కొనసాగిస్తున్నారు ఈ–బిజ్ సంస్థ నిర్వాహకులు. ఇలా దేశవ్యాప్తంగా ప్రజలనుంచి డిపాజిట్లు సేకరించి రూ.ఐదువేల కోట్ల వరకు మోసం చేశారన్న అభియోగాలపై ఈ–బిజ్.కాం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పవన్ మల్హన్, అతని కుమారుడు హితిక్ మల్హన్‌లను సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (ఎకనామిక్ ఆఫెన్స్ వింగ్) పోలీసులు యూపీ నోయిడాలో అరెస్టు చేసి సిటీకి తీసుకొచ్చి చర్లపల్లి జైలుకు తరలించారు. దీంతోపాటుగా ఆయా కంపెనీ బ్యాంక్ ఖాతాల్లోని రూ.389 కోట్లను ఫ్రీజ్ చేశారు. -
నిరుద్యోగులను మోసగించిన ‘విజ్డం జాబ్స్’
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాల పేరిట ప్రపంచవ్యాప్తంగా పెద్దసంఖ్యలో నిరుద్యోగులను మోసగించిన ‘విజ్డం జాబ్స్’ సంస్థను గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ జాబ్ పోర్టల్.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామంటూ టోకరా ఇచ్చింది. నిరుద్యోగుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబరాబాద్ పోలీసులు విజ్డం జాబ్స్ పోర్టల్ సీఈవో అజయ్ కొల్లాతోపాటు 14 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సంస్థ రికార్డులను, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెడుతున్న ఈ జాబ్ పోర్టల్ వ్యవహారంపై సైబర్ నిపుణులు, దర్యాప్తు అధికారులతో కూడిన 10 ప్రత్యేక బృందాలు విచారణ జరిపాయని, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జాబ్ పోర్టల్ విజ్డమ్ జాబ్స్.కామ్.. ఉద్యోగాల ఆశచూపి నిరుద్యోగుల నుంచి వందకోట్ల రూపాయలకుపైగా కాజేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ శుక్రవారం విలేకరులకు తెలిపారు. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా మూడుకోట్లమంది ‘రిజిస్టర్డ్ యూజర్లు’ ఉన్నారని, మన దేశంలో లక్షల సంఖ్యలో బాధితులు ఉన్నట్లు అనుమానిస్తున్నామని ఆయన వెల్లడించారు. పలు అంతర్జాతీయ కంపెనీలతో తమకు ఒప్పందాలు ఉన్నాయని పేర్కొంటూ.. అనేక దేశాల్లో నిరుద్యోగులను ఈ సంస్థ మోసగించిందని, ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నామని సీపీ సజ్జనార్ తెలిపారు. -
క్యూనెట్ గుట్టు రట్టు.. 58 మంది అరెస్టు
సాక్షి, హైదరాబాద్: డబ్బు ఆశ చూపి వేల సంఖ్యలో బాధితులకు కుచ్చుటోపి పెట్టిన క్యూనెట్ మోసగాళ్లను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిరుద్యోగులను, అమాయకులను ట్రాప్ చేసి చైన్ సిస్టమ్ ద్వారా ప్రైజ్ మనీ, కమీషన్లు వస్తాయంటూ నమ్మించి మోసాలకు పాల్పడిన 58 మంది కేటుగాళ్లను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యక్తి ఇచ్చిన పిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన సైబరాబాద్ ఈవోడబ్ల్యూ(ఎకానిమిక్స్ అఫెన్స్ వింగ్) అధికారులు మల్టిలెవల్ మార్కెటింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేశారు. సైబరాబాద్ పరిధిలో క్యూనెట్ మోసంపై 14 కేసుల నమోదయినట్టు పోలీసు కమిషనర్ సజ్జనార్ మీడియాకు తెలిపారు. దేశవ్యాప్తంగా క్యూనెట్ బ్యాంకు అకౌంట్లను, గోదాంలను సీజ్ చేసినట్లు వివరించారు. అరెస్టు చేసిన 58 మందిని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఇక ఇప్పటికే క్యూనెట్ చైర్మన్ మైకెల్ ఫెరారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే. రూ.1000 కోట్ల మోసం బిజినెస్ ప్లాన్ ఉందని అమాయక, నిరుద్యోగ యువకులను టార్గెట్ చేస్తూ ముగ్గులోకి దింపి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన కేటుగాళ్లను ఆరెస్టు చేసినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ తెలిపారు. పలు రాష్ట్రాల్లో అదుపులోకి తీసుకున్న నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన అనంతరం సజ్జనార్ పలు విషయాలు వెల్లడించారు. ‘వివధ రకాల కేసుల్లో మొత్తం 58 మందిని అరెస్టు చేశాము. క్యూనెట్ సంస్థ సుమారు వెయ్యి కోట్ల రూపాయల విలువైన మోసాలకు పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ముఠాలో ముగ్గురు బ్యాంక్ ఉద్యోగులు కూడా ఉన్నారు. వారిని కూడా అదుపులోకి తీసుకున్నాం. 2001 నుంచి వీళ్లు వ్యాపారం చేస్తున్నారు. కచ్చితంగా అందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అంటూ సజ్జనర్ వివరించారు. -
24 గంటలూ ప్రజా సేవలోనే..
సాక్షి, హైదరాబాద్: ఏడు రోజులు... 24 గంటలు... ప్రజలకు సేవలందించడంలో ముందుంటామని సైబరాబాద్ నూతన పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ అన్నారు. బుధవారం గచ్చిబౌలి లోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సందీప్ శాండిల్యా నుంచి కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐటీ కారిడార్‌లోని ఐటీ కంపెనీలతో పాటు ఇతర సంస్థల్లో భద్రత కట్టుదిట్టం చేస్తామని, సైబర్ నేరాల నియంత్రణ కు ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. మహి ళల అక్రమ రవాణాను అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కమిషనరేట్ పరిధిలో సీసీటీవీ కెమెరాలను మరింత పెంచుతా మని చెప్పారు. స్నాచింగ్‌లు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తామన్నారు. మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి.. మహిళలు, పిల్లలపై వేధింపులు ఎక్కువవుతున్నాయని, వీటి పూర్తిస్థాయి నియంత్రణకు సరికొత్త ప్రణాళికతో ముందుకెళతామన్నారు. కమ్యూనిటీ అండ్ సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు అధిక ప్రాధాన్యతనిస్తామని చెప్పారు. ఆర్థిక, వైట్ కాలర్ నేరాలను నియంత్రించడంతో పాటు ఆయా నేరాల తీరుపై ప్రజల్లో అవగాహన కలిగిస్తామన్నారు. సిబ్బంది సంక్షేమంతో పాటు మెరుగైన సేవలు అందించే వారికి ప్రత్యేక రివార్డులతో సత్కరిస్తామని, మరో పది రోజుల్లో కమిషనరేట్ పరిధిలోని అన్ని సమస్యలపై అధ్యయనం చేసి ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సైబరాబాద్ జాయింట్ సీపీ షానవాజ్ ఖాసీమ్, క్రైమ్స్ డీసీపీ జానకీ షర్మిలా, ట్రాఫిక్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్ పాల్గొన్నారు. నేపథ్యమిదీ... 1996(ఆర్ఆర్) ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన విశ్వనాథ్ చెనప్ప సజ్జనార్ మొదటగా వరంగల్ జిల్లాలోని జనగామలో, కడప జిల్లాలోని పులివెందులలో ఏఎస్పీగా పనిచేశారు. ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, నల్లగొండ, కడప, గుంటూరు, సీఐడీ ఆర్థిక నేరాల విభాగం, మంగళగిరి ఆరో బెటాలియన్ కమాండెంట్‌గా, వరంగల్, ఆక్టోపస్‌లో, మెదక్‌లో అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా సేవలందించారు. ఇంటెలిజెన్స్ విభాగ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా పనిచేసి సైబరాబాద్ పోలీసు కమిషనర్‌గా నియమితులయ్యారు. -
ముత్తూట్ దోపిడీ ‘సర్దార్ జీ’ గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: సైబ రాబాద్ పోలీసు కమిషన రేట్ పరిధిలో సంచలనం సృష్టించిన ముత్తూట్ దోపిడీ కేసులో ప్రధాన నిందితుడైన సర్దార్ జీ సింగ్ వేషధారణలో ఉన్న వ్యక్తిని లక్ష్మణ్ నారా యణ్‌గా పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. కర్ణాటకకు చెందిన లక్ష్మణ్ నారాయణ్ ముంబైలో స్థిరపడి చాలా దోపిడీలకు పాల్పడినట్టుగా ఆధా రాలు సేకరించిన పోలీసులు ముంబైలో అతడి కోసం వెతుకుతున్నారు. ముంబై పోలీసుల సహ కారంతో లక్ష్మణ్ నేరచరిత్రను తెలుసుకున్న పోలీసులు మరో ఒకటి రెండు రోజుల్లో అతడిని పట్టుకునే అవకాశముందని తెలుస్తోంది. సీబీఐ అధికారినని చెప్పి రామచంద్రపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని బీరంగూడ ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో మరో ఐదుగురు వ్యక్తులతో కలసి 46 కిలోల బంగారం ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే. పోలీసులు అదుపులోకి తీసుకున్న స్కార్పియో డ్రైవర్, మరో వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా పరారీలో ఉన్న నలుగురిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న ఇద్దరిలో ఒకరిని గురువారం రామచంద్రపురం పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి మళ్లీ నాసిక్‌కు తీసుకెళ్లినట్టు తెలిసింది. మరో రెండు రోజుల్లో ఈ కేసులో కీలక పురోగతి ఉంటుందని పోలీసు ఉన్నతాధి కారులు చెబుతున్నారు. -
నేరగాళ్లపై నిత్యం నిఘా నేత్రం
- జంట కమిషనరేట్లలో వేల సీసీ కెమెరాలు - కమ్యూనిటీ భాగస్వామ్యంతోనూ ఏర్పాటు - ఆధునిక సాఫ్ట్వేర్స్ అనుసంధానిస్తున్న వైనం హైదరాబాద్ జంట కమిషనరేట్ల పరిధిలో పోలీసు విభాగం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల సంఖ్య 500... ప్రజా భద్రతా చట్టం అమలులోకి వచ్చిన తరవాత పోలీసులు తీసుకున్న చర్యల ఫలితంగా కమ్యూనిటీల వారీగా ఏర్పాటైనవి ఐదు వేల పైనే. వీటన్నింటినీ ఆయా కమిషనరేట్లలో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్‌కు (సీసీసీ) అనుసంధానం చేశారు. ఫలితంగా నిఘా పెరగడమే కాదు.. అనేక కీలక కేసులు కొలిక్కి రావడంలోనూ ఉపకరించాయి. ఈ కెమెరా వ్యవస్థకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సైతం జోడించే పనిలో ఉన్నారు హైదరాబాద్, సైబరాబాద్ అధికారులు. ఏమాత్రం 'తేడా' రాకుండా చర్యలు... 2014లో అమలులోకి వచ్చిన ప్రజా భద్రతా చట్టాన్ని కమిషనరేట్ల అధికారులు పక్కాగా అమలు చేస్తున్నారు. వ్యాపార సముదాయాలు, వాణిజ్య ప్రాంతాల్లో వ్యక్తిగతంగా, కమ్యూనిటీ మొత్తం కలిసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడాన్ని కచ్చితం చేశారు. పోలీసుస్టేషన్ల వారీగా బాధ్యతలు అప్పగించిన కమిషనర్లు... ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో పాటు వీటి ఆవశ్యకతనూ వివరిస్తూ ఎవరివారు ముందుకు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఏర్పాటవుతున్న కమ్యూనిటీ కెమెరాలను ఎవరికి నచ్చిన మోడల్, సామర్థ్యం కలిగినని వారు ఏర్పాటు చేసుకుంటే సీసీసీతో అనుంధానం, పర్యవేక్షణలో ఇబ్బందులు ఎదురవుతాయి. అలా కాకుండా యూనిఫామిటీ కోసమూ పోలీసులు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీసు విభాగమే ప్రముఖ కంపెనీతో సంప్రదింపులు జరిపింది. సీసీ కెమెరాలకు ఉండాల్సిన స్పెసిఫికేషన్స్‌ను నిర్దేశించి అంతా వాటినే ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకుంటోంది. దీంతో అన్నీ ఒకే రకమైన కెమెరాలు సమకూరుతున్నాయి. అవి ఇవీ అన్నీ కలిపేస్తూ... ఇప్పటికే జంట కమిషనరేట్లలో పోలీసు, ట్రాఫిక్ విభాగాలు ఏర్పాటు చేసిన కెమెరాలు సీసీసీతో అనుసంధానించి ఉన్నాయి. వీటి సంఖ్య పరిమితం కావడంతో అన్నిచోట్లా నిఘా సాధ్యం కావట్లేదు. దీన్ని పరిగణలోకి తీసుకున్న ఉన్నతాధికారులు ఓ వ్యాపార సముదాయం, వాణిజ్య కూడళ్ళతో పాటు దుకాణాల్లోనూ ఏర్పాటు చేస్తున్న వాటినీ సీసీసీతో అనుసంధానిస్తున్నారు. దుకాణం లోపల భాగం మినహా బయటకు ఉన్న కెమెరాలు, కాలనీలు, పబ్లిక్‌ప్లేసుల్లో ఉన్న అన్నింటినీ బ్రాడ్‌బ్యాండ్ ద్వారా సీసీసీలతో అనుసంధానిస్తున్నారు. దీంతో పోలీసు విభాగానికి చెందిన కెమెరాలూ ప్రధానంగా ట్రాఫిక్ కోణంలో ఉన్నా... అనుసంధానించినవి నిఘా, శాంతిభద్రతల పర్యవేక్షణకు ఉపకరిస్తున్నాయి. రానున్న రెండేళ్ళల్లో జంట కమిషనరేట్లతో పోలీసు, కమ్యూనిటీ అన్ని కలిపి లక్ష సీసీ కెమెరాలు ఉండాలన్న లక్ష్యంతో ఇరు కమిషనర్లు ముందుకు వెళ్తున్నారు. ఈ కలసాకారమైతే అలాంటి నిఘాతో కూడిన నగరంగా సిటీ దేశంలోనే ప్రముఖ స్థానాన్ని ఆక్రమించనుంది. పర్యవేక్షణకూ సాంకేతిక పరిజ్ఞానం... ఇప్పటికు ఈ కెమెరాల ద్వారా రికార్డు అవుతున్న ఫీడ్ అనేక కేసుల్ని కొలిక్కి తీసుకురావడంతో ఉపకరిస్తోంది. దీనికోసం ఈ వీడియోలను సమర్థంగా అభివృృద్ధి చేయడానికి ఎన్‌హ్యాన్స్‌మెంట్ సాఫ్ట్వేర్స్ వాడుతున్నారు. రానున్న రోజుల్లో మరికొన్ని రకాలైన వాటినీ అమలులోకి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. నగరంలో వేల సంఖ్యలో ఉన్న కెమెరాలను సీసీసీ ఉండే పరిమిత సిబ్బంది నిత్యం పర్యవేక్షించడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే దీనికోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు రెండో దశలో పటిష్ట నిఘా కోసం ఎనలటిక్స్‌గా పిలిచే సాఫ్ట్వేర్స్ అభవృద్ధి చేస్తున్నారు. అవి ఎలా పని చేస్తాయంటే... - నగరంలోని అన్ని కెమెరాలు అనుసంధానించి ఉండే సీసీసీలోని సర్వర్‌ను కంప్యూటర్లకు అనుసంధానిస్తారు. - ఈ సర్వర్లలో ఎనలటిక్స్‌గా పిలిచే ప్రత్యేక సాఫ్ట్వేర్స్ నిక్షిప్తం చేసే ఏర్పాటు చేస్తున్నారు. - వీటిలో ఉండే ప్రొగ్రామ్స్ ఆధారంగా సర్వర్ అన్ని కెమెరాలను పర్యవేక్షిస్తూ, నిర్దేశిస్తుంటుంది. - వన్ వేలతో పాటు ఇతర మార్గాల్లోనూ వ్యతిరేక దిశలో (రాంగ్‌రూట్)లో వస్తున్న వాహనాలను, నో పార్కింగ్, నో ఎంట్రీల్లోని వాహనాలను సాఫ్ట్వేర్ ఆధారంగా కెమెరాలు గుర్తిస్తాయి. - ఆ విషయాన్ని తక్షణం సీసీసీలోని భారీ డిజిటల్ స్కీన్‌పై పాప్అప్ రూపంలో ఇచ్చి అక్కడి సిబ్బందిని అప్రమత్తం చేస్తాయి. - పాప్అప్లో ఉండే వివరాల ఆధారంగా సమీపంలోని పోలీసుల్ని సీసీసీలోని సిబ్బంది అప్రమత్తం చేస్తారు. - ఓ ప్రాంతంలో హఠాత్తుగా గలాభా చోటు చేసుకుని ఎక్కువ మంది ఓ చోట గుమిగూడినా, ఏదైనా ప్రమాదం చోటు చేసుకుని వాహనాలు ఆగిపోయినా ఇవి గుర్తిస్తాయి. - నగరంలో నిర్దేశించిన ప్రాంతాల్లో ఏదైనా వస్తువు, వాహనం నిర్ణీత సమయం కంటే ఎక్కువ సేపు ఆగి ఉన్నా... ఈ విషయం పాప్అప్ రూపంలో సీసీసీలోని సిబ్బందికి తెలుస్తుంది. - రాత్రి వేళల్లో మూసివేసి ఉండే ప్రార్థనా స్థలాలు, నిర్మానుష్య ప్రాంతాల్లోకి ఎవరైనా ప్రవేశించినా ఆ విషయాన్ని కెమెరాలు తక్షణం గుర్తించి పాప్అప్ ఇస్తాయి. - ఈ ఎనలటిక్స్‌లో శాంతిభద్రతల పర్యవేక్షణ, నేరాల నిరోధానికీ ఉపకరించేలా డిజైన్ చేస్తున్నారు. కొలిక్కి వచ్చిన ‘కేస్ స్టడీస్’... - అబిడ్స్ పరిధిలో ఆరు నెలల బాలుడుని దుండగులు అపహరించారు. సీసీ కెమెరాల్లోని ఫీడ్‌ను ఎన్‌హ్యాన్స్ చేసిన నేపథ్యంలో కిడ్నాపర్లు వాడిన ఆటో నెంబర్ తెలిసి దుండగులు చిక్కడంతో పాటు బాబు రెస్క్యూ అయ్యాడు. - మారేడ్‌పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో తన ఆటోలో ప్రయాణించిన ప్రయాణికురాలి నుంచి నగలున్న బ్యాగ్‌ను ఆటోడ్రైవర్ అపహరించాడు. అనేక ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫీడ్‌ను అధ్యయనం చేసిన పోలీసులు కేసును కొలిక్కి తీసుకురాగలిగారు. - దేశ వ్యాప్తంగా సంచలనంసృష్టించిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అభయపై సామూహిక అత్యాచారం కేసు మాదాపూర్ పరిధిలో జరిగింది. సీసీ కెమెరాల్లో చిక్కిన ఫీడ్ ఆధారంగానే ఆమె ప్రయాణించిన కారును గుర్తించి నిందితుల్ని పట్టుకోగలిగారు. - శంషాబాద్ మండలంలోని పెద్దగోల్కొండలో బందిపోటు దొంగతనం చోటు చేసుకుంది. బాధితుడి ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్ ఆధారంగానే ఆ నేరం చేసింది పెద్దింటిగొల్ల గ్యాంగ్‌గా గుర్తించి, అరెస్టు చేశారు. ప్రజల స్పందన మరువలేం: నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటు విషయంలో మా పిలుపునకు స్పందించి, ప్రజలు ఇస్తున్న సహకారం మరువలేనిది. కేవలం వ్యాపార, వాణిజ్య వర్గాలే కాకుండా కాలనీలతో పాటు సామాన్య ప్రజలు సైతం ముందుకు వస్తున్నారు. ఎవరికి వారు తమ బాధ్యతగా భావించి వీటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని రకాలైన ప్రజలకు ఉపకరించే, నేరగాళ్లను కట్టడికి ఉపయుక్తమయ్యే సాంకేతిక పరిజ్ఞానాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. ఈ ఏడాది హైదరాబాద్ పోలీసులు 'ఇయర్ ఆఫ్ టెక్నాలజీ'గా మారుస్తాం. - ఎం.మహేందర్‌రెడ్డి, హైదరాబాద్ కొత్వాల్ అవగాహన కలిగించటంలో విజయవంతం: నేరాల నిరోధించడం, కేసులు కొలిక్కి తీసుకురావడంతో సీసీ కెమెరాల పాత్ర కీలకంగా మారింది. వీటిని ఏర్పాటు చేసుకోవడం ఓ సామాజిక బాధ్యత అనే అంశాన్ని ప్రజల్లోకి సమర్థంగా తీసుకువెళ్ళడంలో విజయవంతమయ్యాం. ఈ కారణంగానే ఓపక్క పోలీసు విభాగం... మరోపక్క సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌తో పాటు ప్రజలూ ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కమిషనరేట్ వ్యాప్తంగా ఎక్కడిక్కడ మినీ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి పర్యవేక్షణ బాధ్యతల్లో ప్రజల్నీ భాగస్వాముల్ని చేస్తున్నాం. - సీవీ ఆనంద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ -
ఎస్ఎంఎస్ చేస్తే కేసు వివరాలు
సాక్షి, సిటీబ్యూరో : మీరు ఎవరిపైనైనా ఫిర్యాదు చేశారా...? కేసు స్థితిగతుల గురించి తెలుసుకునేందుకు ఠాణాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారా..? కేసు వివరాలు చెప్పేందుకు పోలీసులు తిప్పించుకుంటున్నారా...? ఇక నుంచి ఫిర్యాదుదారులకు ఇలాంటి తిప్పలు లేకుండా సైబరాబాద్ పోలీసులు సరికొత్త పంథాను ఎంచుకున్నారు. ఫిర్యాదుదారుడు తన సెల్‌ఫోన్ నంబర్ నుంచి CYBPOL <space> CS <space> Police Station/Crime No/Year అని టైప్ చేసి 9731979899 నంబర్‌కు సందేశం పంపిస్తే కేసు పురోగతి గురించి సమాచారం వెంటనే వచ్చేస్తుంది. సైబరాబాద్ పోలీసులు ఇటీవల ప్రారంభించిన ఎస్ఎంఎస్ గేట్ వే ఫర్ సిటిజన్స్‌కు మంచి స్పందన వస్తోంది. వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్నా ఎస్ఎంఎస్లు ‘ఎస్ఎంఎస్ ద్వారా కేసు వివరాలను తెలుసుకునేందుకు తొలుత కమిషనరేట్ వెబ్‌సైట్‌కి వెళ్లి నో యువర్ కేస్ స్టేటస్‌కి వెళ్లాలి. కేసు స్టేటస్ త్రూ ఎస్ఎంఎస్ని క్లిక్ చేయాలి. ఫిర్యాదుచేసిన పోలీసు స్టేషన్ పేరు, క్రైం నంబర్, పేరు, మొబైల్ నంబర్లను పూర్తి చేయాలి. ఆ తర్వాత ఫోన్‌కు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఎస్ఎంఎస్ వస్తుంది. రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే కేసు స్థితిగతుల వివరాలు మొబైల్ నంబర్‌కు ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంటాయి. కేసుకు సంబంధించి ఎప్పుడూ పురోగతి లభించినా వెంటనే సదరు సమాచారం ఫిర్యాదుదారుడి సెల్ నంబర్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది. ‘సైబరాబాద్ పోలీసులు తీసుకొచ్చిన ఈ ఎస్ఎంఎస్ విధానం ద్వారా ఠాణాలు చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి తప్పింది. దీనివల్ల సమయం ఆదా అవడంతో పాటు వ్యక్తిగత పనులకు ఎటువంటి అంతరాయం కలగడం లేదు. ఫోన్ పట్టుకొని నంబర్ ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే కేసు పురోగతి వివరాలు వచ్చేస్తున్నాయ’ని గచ్చిబౌలికి చెందిన అరుణ్ తెలిపాడు. క్రైమ్ నంబర్, ఎఫ్ఐఆర్ నమోదు తేదీ, పేరుతో పాటు కేసు విచారణ దశలో ఉందా, ఉంటే అందుకు కారణాలు ఏంటనే వివరాలు వచ్చేస్తున్నాయని తెలిపాడు. కాగా, ఈ ఎస్ఎంఎస్ గేట్ వే ఫర్ సిటిజన్స్ పద్ధతి వల్ల తమకు కూడా చాలా పనిభారం తప్పినట్టైందని, ఎప్పటికప్పుడు కేసు పురోగతి వివరాలను ఫిర్యాదుదారుడికి ఎస్ఎంఎస్ రూపంలో చెరవేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ఠాణాకు ప్రతిసారి కేసు వివరాలు తెలుసుకునేందుకు వచ్చే వారి సంఖ్య తగ్గిందని, దీంతో వాళ్లకు సర్దిచెప్పడం లాంటి సంఘటనలు కూడా తగ్గాయని అంటున్నారు. అలాగే కమిషనర్ వెబ్సైట్లోకి లాగిన్ అయి వివరాలు నమోదుచేసినా కేసు స్థితిగతులను తెలుసుకోవచ్చు. దేశంలోనే తొలిసారి... గతంలో చాలా మంది ఫిర్యాదుదారులు కేసు పురోగతి వివరాలు తెలుసుకునేందుకు పోలీసు స్టేషన్ల చుట్టూ చక్కర్లు కొట్టేవారు. తిరిగే సమయం లేక కొందరు, ఒకవెళ్లినా ఆ సమయంలో సిబ్బంది అందుబాటులో లేక మరికొందరు...ఇలా సరైన సమాచారం లేకుండానే వెనుదిరిగిన సందర్భాలు అనేకం. ఇలాంటి ఫిర్యాదులు చాలా మా కమిషనరేట్‌కు వచ్చాయి. అందుకే ఎస్ఎంఎస్ గేట్ వే ఫర్ సిటిజన్స్‌ను ప్రారంభించాం. దేశంలోనే తొలిసారిగా ఈ విధానం ప్రవేశపెట్టడం ఎంతో ఆనందంగా ఉంది. ఫిర్యాదుదారులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. - సీవీ ఆనంద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ -
స్నేక్ గ్యాంగ్ దయానీ సోదరులు అరెస్ట్
-
స్నేక్ గ్యాంగ్ దయానీ సోదరులు అరెస్ట్
హైదరాబాద్: నేరస్థుల్లో భయం కల్పించేందుకే పహాడీషరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలోని సాయినగర్‌లో గత అర్థరాత్రి నుంచి సోదాలు నిర్వహించినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. దాదాపు 420 మంది పోలీసులతో 800 నివాసాలను సోదా చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా పాములతో బెదిరించి మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న స్నేక్ గ్యాంగ్ ప్రధాన నిందితుడు దయానీ ఇంట్లో సోదా చేసినట్లు తెలిపారు. దయానీ సోదరులు అమీద్, కాలీజ్తోపాటు మరో ఐదుగురు అనుచరులను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. స్నేక్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న కొంతమందిని గుర్తించామని చెప్పారు. వారిని సాధ్యమైనంత త్వరలో పట్టుకుంటామన్నారు. స్నేక్‌గ్యాంగ్ కేసులో ఇప్పటివరకు ఐదు ఫిర్యాదులు అందాయన్నారు. -
మా వాళ్లపై దాడి ... అందుకే కాల్పులు
హైదరాబాద్: శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై పోలీసు ఎన్కౌంటర్లో మృతి చెందిన శివపై హైదరాబాద్ పరిధిలో 400లకు పైగా కేసులు ఉన్నాయని సైబరాబాద్ పోలీసుల కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. శనివారం ఉదయం ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని ఆయన సందర్శించారు. అనంతరం సీవీ ఆనంద్ మాట్లాడుతూ... నిందితుడు శివ నార్సింగ్‌లో తలదాచుకున్నట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు. దాంతో సెల్‌టవర్ ఆధారంగా అతడున్న ప్రాంతం గుర్తించి.... శంషాబాద్ సమీపంలో పోలీసులు నాకాబందీ నిర్వహించారని చెప్పారు. శివను తనిఖీ చేస్తున్న క్రమంలో ఎస్.ఐ. వెంకటేశ్వర్లుపై కత్తితో దాడి చేశారని... ఆత్మరక్షణ కోసమే వెంటనే స్పందించిన సీఐ నరసింహారెడ్డి కాల్పులు జరిపాడని సీవీ ఆనంద్ వివరించారు. ఎన్కౌంటర్ అనంతరం మృతుడు శివ అనుచరుడు జగదీశ్, అతడి భార్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. రెండు రోజుల క్రితం ఎల్బీనగర్లో శివ పోలీసులపై దాడి చేసి తప్పించుకున్నాడని ఆనంద్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. -
ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని కలెక్టర్ బీ.శ్రీధర్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లో ఎన్నికల నిర్వహణపై సంబంధిత అధికారులు, ఎన్నికల పరిశీలకులతో సమీక్షించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 5,042 పోలింగ్ కేంద్రాలున్నాయని, వీటిలో 4,196 కేంద్రాలు సైబరాబాద్ పరిధిలో, 846 కేంద్రాలు గ్రామీణ ఎస్పీ పరిధిలో ఉన్నాయన్నారు. సున్నిత, అతిసున్నిత కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు 1,069 సూక్ష్మ పరిశీలకులను నియమించామన్నారు. అనంతరం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ సున్నిత, అతి సున్నిత పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 332 మొబైల్ వాహనాలను ఏర్పాటు చేశామన్నా రు. ఈ సమావేశంలో ఎస్పీ రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.