
సాక్షి, సిటీబ్యూరో( హైదరాబాద్) : కరోనా బాధితులను ఆదుకోవడానికి ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న సైబరాబాద్ పోలీసులు మరో ఆవిష్కరణ చేశారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్‌సీఎస్‌సీ) సహకారంతో covid.scsc.in పేరుతో ఓ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇది శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చింది.
ఇటీవల కాలంలో సోషల్‌మీడియా, వాట్సాప్ తదితరాల్లో కొవిడ్‌పై రకరకాలైన అంశాలు కనిపిస్తున్నాయి. వీటిలో ఏది నిజం, ఏది కాదో తెలియక ప్రజలు గందరగోళానికి లోనవుతున్నారు. ఆ పరిస్థితులకు covid.scsc.in వెబ్‌సైట్ ఓ పరిష్కారం అవుతుందని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. ఈ సైట్‌లో వివిధ రకాలైన ఉపయుక్త సమాచారం అందుబాటులో ఉంచామని తెలిపారు.
సైట్‌లో ఉండే వివరాలివి...
► క్రిటికల్ కేర్ సర్వీసెస్: అంబులెన్సులు, ఆక్సిజన్ సప్లయర్స్, హాస్పిటల్స్‌తో పాటు వాటిలోని బెడ్స్ వివరాలు, ప్లాస్మా సపోర్ట్, బ్లడ్ బ్యాంకులు, అంతిమ సంస్కారాలు చేసే సంస్థలు
► సెల్ఫ్ కేర్ సర్వీసెస్: ఐసోలేషన్ సెంటర్ల వివరాలు, హోమ్ క్వారంటైన్‌పై సలహాలు, డాక్టర్ ఆన్ కాల్, డయాగ్నస్టిక్ సెంటర్లు, ఫార్మాస్యూటికల్స్, ఆహారం అందించే సంస్థలు
► ప్రివెంటివ్ కేర్ సర్వీసెస్: సైకాలజిస్టులు/కౌన్సిలర్ల సేవలు, వాక్సినేషన్ సెంటర్ల వివరాలు, పీపీఈ కిట్స్ సరఫరాదారులు, శానిటైజేషన్ సేవలు అందించే సంస్థలు
► లేటెస్ట్ ఇన్ఫర్మేషన్: కోవిడ్ బులెటిన్స్, కీలక ఫోన్ నెంబర్లు, వివరాలు, నెట్‌వర్క్ గ్రూపులు
( చదవండి: కరోనా సోకిన వెంటనే ఆస్పత్రిలో చేరాలా? )
Comments
Please login to add a commentAdd a comment