ముత్తూట్‌ దోపిడీ ‘సర్దార్‌ జీ’ గుర్తింపు | Muthoot Finance robbery: Police makes a crucial breakthrough | Sakshi
Sakshi News home page

ముత్తూట్‌ దోపిడీ ‘సర్దార్‌ జీ’ గుర్తింపు

Published Fri, Jan 6 2017 12:56 AM | Last Updated on Tue, Oct 16 2018 5:45 PM

ముత్తూట్‌ దోపిడీ ‘సర్దార్‌ జీ’ గుర్తింపు - Sakshi

ముత్తూట్‌ దోపిడీ ‘సర్దార్‌ జీ’ గుర్తింపు

సాక్షి, హైదరాబాద్‌: సైబ రాబాద్‌ పోలీసు కమిషన రేట్‌ పరిధిలో సంచలనం సృష్టించిన ముత్తూట్‌ దోపిడీ కేసులో ప్రధాన నిందితుడైన సర్దార్‌ జీ సింగ్‌ వేషధారణలో ఉన్న వ్యక్తిని లక్ష్మణ్‌ నారా యణ్‌గా పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. కర్ణాటకకు చెందిన లక్ష్మణ్‌ నారాయణ్‌ ముంబైలో స్థిరపడి చాలా దోపిడీలకు పాల్పడినట్టుగా ఆధా రాలు సేకరించిన పోలీసులు ముంబైలో అతడి కోసం వెతుకుతున్నారు. ముంబై పోలీసుల సహ కారంతో లక్ష్మణ్‌ నేరచరిత్రను తెలుసుకున్న పోలీసులు మరో ఒకటి రెండు రోజుల్లో అతడిని పట్టుకునే అవకాశముందని తెలుస్తోంది. సీబీఐ అధికారినని చెప్పి రామచంద్రపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బీరంగూడ ముత్తూట్‌ ఫైనాన్స్‌ కార్యాలయంలో మరో ఐదుగురు వ్యక్తులతో కలసి 46 కిలోల బంగారం ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే. పోలీసులు అదుపులోకి తీసుకున్న స్కార్పియో డ్రైవర్, మరో వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా పరారీలో ఉన్న నలుగురిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న ఇద్దరిలో ఒకరిని గురువారం రామచంద్రపురం పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చి మళ్లీ నాసిక్‌కు తీసుకెళ్లినట్టు తెలిసింది. మరో రెండు రోజుల్లో ఈ కేసులో కీలక పురోగతి ఉంటుందని పోలీసు ఉన్నతాధి కారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement