హైదరాబాద్: చిరు వ్యాపారులు మొదలుకుని స్వయం ఉపాధి పొందుతున్న వారి వరకు వివిధ వ్యాపార వర్గాలకు రుణాలను అందించడంపై ముత్తూట్ ఫిన్‌కార్ప్ దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా అదనపు హామీ అవసరం ఉండని వ్యాపార్ మిత్ర బిజినెస్ లోన్స్‌ను ప్రవేశపెట్టింది.
దీనితో ఆదాయ పన్ను రిటర్న్ పత్రాలు లేదా సిబిల్ స్కోర్ రికార్డులు మొదలైనవి అందించకుండానే వ్యాపార రుణాలను పొందవచ్చని సంస్థ తెలిపింది. రోజువారీ చెల్లింపుల అవకాశాన్ని అందిస్తున్నామని, ముందస్తు చెల్లింపు చార్జీలేమీ ఉండవని పేర్కొంది. దేశవ్యాప్తంగా 3,600 పైచిలుకు ముత్తూట్ ఫిన్‌కార్ప్ శాఖల్లో ఈ రుణాలు పొందవచ్చని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment