small business
-
విజయానికి చేయూత
నర్సీపట్నంలో కిరాణా షాపు నడుపుకుంటున్నాం. మా ఇంట్లో నలుగురుంటారు. కుటుంబ పోషణకు ఈ దుకాణమే ఆధారం. గతంలో చాలీచాలని ఆదాయంతో ఇబ్బందులు పడేవాళ్లం. కరోనా సమయంలో వ్యాపారం చేయడానికే లేదు. బతుకు కష్టమే అనుకున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం చిరు వ్యాపారులను ఆదుకుంది. గతంలో మాలాంటి వారికి ఎలాంటి సాయం ఉండేది కాదు. మైక్రో ఫైనాన్స్‌లో తీసుకున్న అప్పు చెల్లించలేక నరకం చూశాం. ఈ ప్రభుత్వంలో పథకాలు వరంలా ఆదుకుంటున్నాయి. మెప్మా అందించిన రుణ సాయంతో పాటు, చేయూత డబ్బులతో దుకాణాన్ని విస్తరించుకున్నాం. ఇప్పుడు రోజుకు రూ.800 నుంచి రూ.1000 ఆదాయం వస్తోంది. – కొల్లాన లక్ష్మి, నర్సీపట్నం నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని పెద బొడ్డేపల్లికి చెందిన బంగారు లక్ష్మికి భర్త లేడు. తన ఇద్దరు పిల్లలను పెంచేందుకు ఎన్నో కష్టాలు పడింది. బతుకుదెరువు కోసం ఇల్లిల్లూ తిరిగి కూరగాయలు అమ్ముకున్నా, పెద్దగా ఫలితం లేకపోయింది. జగనన్న ఇచ్చిన చేయూత పథకం సొమ్ము రూ.18,750కి తోడు కొంత పొదుపు రుణం తీసుకుని ఇంటి వద్దే కిరణా దుకాణం ప్రారంభించింది. మెప్మా ఇచ్చిన ప్రోత్సాహంతో ఇప్పుడు రోజుకు రూ.500 నుంచి రూ.800 వరకు సంపాదిస్తోంది. నర్సీపట్నంలో ఉంటున్న పెదపూడి అరుణకుమారి, లక్ష్మి తోడికోడళ్లు. వీరి భర్తలు ఎన్నో ఏళ్లుగా రైతులకు అవసరమైన యంత్ర పరికరాలు తయారు చేస్తుంటారు. ప్రభుత్వం వీరికి చేయూత, ఆసరా, రైతు భరోసా కింద ఇచ్చిన నగదును వర్క్‌షాప్‌లో పెట్టుబడిగా పెట్టారు. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న వీరికి బ్యాంకు రూ.5 లక్షలు రుణంగా మంజూరు చేసింది. పొదుపు నుంచి కొంత మొత్తం అప్పుగా తీసుకున్న వీరు వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. ‘మా పని రైతులతో ముడి పడింది. ఆర్డరు రాగానే డబ్బులు ఇవ్వరు.. ముందు పెట్టుబడి పెట్టాలి. అందుకు ప్రభుత్వం ఇచ్చిన సాయం ఉపయోగపడింది. ప్రభుత్వం నుంచి ఇంతగా సాయం గతంలో ఎప్పుడూ అందలేదు’ అని తెలిపారు. ఇలా ఒక్క నర్సీపట్నంలోనే ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందినవారు 10,071 మంది ఉంటే, వారిలో 4,067 మంది చిరు వ్యాపారాలతో ఉపాధి పొందుతున్నారు. విశాఖ, నర్సీపట్నం నుంచి నానాజీ అంకంరెడ్డి, సాక్షి ప్రతినిధి: అసలే పట్టణాలు.. ఆపై అదనపు ఖర్చులు.. ఇంట్లో ఇద్దరు ముగ్గురు సంపాదిస్తేనే ఇల్లు గడిచే పరిస్థితి.. ప్రతి ఖర్చుకు ఓ లెక్క.. అవసరమైన వస్తువు కొనాలంటే మరో అవసరాన్ని వాయిదా వేసుకోవాలి.. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి.. మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తూ అడుగులు ముందుకు వేశారు. ఇందులో భాగంగా అమలు చేస్తున్న ‘వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా’ పథకాలను మహిళా లబ్ధిదారులు సమర్థవంతంగా వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వం ‘చేయూత’గా ఇస్తున్న రూ.18,750కు తోడు, పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా) ద్వారా బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి వారిని స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహిస్తున్నారు. వయసు పైబడిందని, కుంటుంబానికి భారంగా మారామని కుంగిపోతున్న మహిళలు సైతం ఇప్పుడు సంపాదన మార్గంలో పయనిస్తున్నారు. దాంతో సగటున ఒక్కో మహిళ నెలకు రూ.10 వేల నుంచి రూ.25 వేలకు పైగా సంపాదిస్తోంది. పెద్ద చదువులు లేకపోయినా తోచిన చిరు వ్యాపారం చేస్తూ ఆదాయం ఆర్జిస్తున్నారు. ఇప్పుడా మహిళల కళ్లల్లో కుటుంబానికి అండగా నిలబడగలిగామన్న సంతృప్తి కనిపిస్తోంది. ఒక్క గ్రేటర్ విశాఖపట్నంలో చేయూత, ఆసరా లబ్ధిదారులు 2,83,440 మంది ఉంటే, వారిలో 90,491 మంది ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో స్వయం ఉపాధి మార్గాల ద్వారా కుటుంబానికి అండగా ఉన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో మారిన రాతలు రాష్ట్ర ప్రభుత్వం 45 ఏళ్లు దాటిన పేద మహిళలకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఏటా రూ.18,750 ఆర్థిక సాయం అందిస్తోంది. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో ఈ తరహా ఆర్థిక సాయం పొందిన మహిళలు 5,32,393 మంది ఉన్నారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.998,23,68,750 చొప్పున మూడేళ్లలో దాదాపు రూ.3 వేల కోట్ల సాయం అందించింది. 2019 ఎన్నికల నాటికి డ్వాక్రా సంఘాల్లోని మహిళలు చెల్లించాల్సిన బ్యాంకు అప్పును ప్రభుత్వమే చెల్లిస్తుందని ఇచ్చిన హామీ మేరకు ఆ సాయాన్ని ‘ఆసరా’ రూపంలో చెల్లిస్తున్నారు. ఇలా పట్టణ ప్రాంతాల్లోని 1,54,921 స్వయం సహాయక సంఘాల్లో 14,75,883 మందికి గత మూడేళ్లల్లో రూ.3,300 కోట్లు చెల్లించారు. పట్టణ ప్రాంతాల్లోని మొత్తం 20,08,276 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా) అధికారులు స్థానిక యూఎల్బీలో స్వయం ఉపాధి మార్గాలపై సదస్సులు, సమావేశాలు నిర్వహించారు. ఆసక్తి గల వారికి వ్యాపార నిర్వహణ, స్వయం ఉపాధి మార్గాలపై శిక్షణనిచ్చారు. అసరమైన వారికి మెప్మా రుణాలు ఇప్పించింది. ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో వైఎస్సార్ చేయూత పథకం ద్వారా లబ్ధి పొందిన వారిలో 2,56,959 మంది, ఆసరా లబ్ధిదారుల్లో 5,19,400 మంది మొత్తం 7,76,359 మంది చిరు వ్యాపారాలు, స్వయం ఉపాధి మార్గాలు ఎంచుకున్నారు. సమర్థవంతమైన సీఎం జగన్ పాలన వల్లే అక్కచెల్లెమ్మలు ఈ విజయం సాధించారని, ఆర్థికంగా నిలదొక్కుకుని తల రాతలు మార్చుకున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. జగనన్న చలవతో నిలదొక్కుకున్నా నా భర్త చనిపోయాడు. ఉన్న ఒక్క బిడ్డను పోషించుకునేందుకు నాకు వచ్చిన టైలరింగ్‌ను వృత్తిగా ఎంచుకున్నాను. ఆర్టర్లు లేక ఇబ్బంది పడుతున్న సమయంలో ‘చేయూత’ వరంగా మారింది. వచ్చిన రూ.18,750కు తోడు మెప్మా రుణం తీసుకుని ఎన్ఏడీ సెంటర్లో పళ్ల దుకాణం ఏర్పాటు చేసుకున్నా. ఈ వ్యాపారంలో రోజుకు రూ.400 నుంచి రూ.500 వరకు ఆదాయం వస్తోంది. నా కాళ్లమీద బతకగలనన్న భరోసా కలిగింది. వ్యాపారాన్ని ఇంకా విస్తరిస్తాననే నమ్మకం ఉంది. ఇదంతా జగనన్న చలవే. – మళ్ల అన్నపూర్ణ, ఎన్ఏడీ గౌరీనగర్, విశాఖపట్నం ఆత్మవిశ్వాసం పెరిగింది గతంలో నేను కూలి పనులకు వెళ్లేదాన్ని. ఇప్పుడు సత్తువ తగ్గిపోయింది. పనులకు పిలవడం లేదు. కుటుంబానికి భారం అవుతాననుకున్నాను. స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిగా ఉన్నాను. చేయూత డబ్బులతో రోడ్డు పక్కన కూరగాయల దుకాణం ఏర్పాటు చేసుకున్నా. ఇప్పుడు నేను రోజూ రూ.400 సంపాదిస్తున్నా. ఎంతో ఆత్మవిశ్వాసంగా ఉన్నా. ఇదంతా జగనన్న ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహమే. – కరణం లక్ష్మి, ఎన్ఏడీ గౌరీనగర్, విశాఖపట్నం -
వ్యాపారవేత్తలుగా వృత్తి పనివాళ్లు
న్యూఢిల్లీ: వృత్తి పనివాళ్లకు, చిన్న వ్యాపారాలకు మరింత తోడ్పాటు అందించాల్సిన అవసరముందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. బడ్జెట్ వెబినార్లలో చివరిదైన ‘పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్’ పథకంపై ఆయన శనివారం మాట్లాడారు. గ్రామ స్థాయిలో ప్రతి వృత్తినీ విభాగాన్నీ బలోపేతం చేయడం దేశ ప్రగతి ప్రయాణానికి చాలా కీలకమన్నారు. ఇందుకోసం డెడ్లైన్లు పెట్టుకుని ఉద్యమ స్ఫూర్తితో పని చేయాల్సిన అవసరముందన్నారు. గొప్పవైన మన పురాతన సంప్రదాయాలను కాపాడటంతో పాటు చిన్న వ్యాపారాలను వాటిలో భాగస్వాములుగా ఉండే వృత్తి పనివాళ్లకు ఇతోధికంగా సాయం అందించడమే పీఎం విశ్వకర్మ సమ్మాన్ పథకం లక్ష్యమని చెప్పారు. సులభ రుణాలు, నైపుణ్య వృద్ధికి అవకాశాలు, సాంకేతిక, డిజిటల్ సాయం, బ్రాండ్ ప్రమోషన్, మార్కెటింగ్, ముడి సరుకు లభ్యత తదితరాల్లో వారికి ఈ పథకం అండగా నిలుస్తుందన్నారు. వృత్తి పనివాళ్లకు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు అన్ని అవకాశాలూ కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. మార్చి 13 నుంచి పార్లమెంటు మలి దశ బడ్జెట్ సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో మోదీ శనివారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో భేటీ అయ్యారు. మోదీ తల్లి స్మృతులపై మైక్రోసైట్ మోదీ మాతృమూర్తి హీరాబెన్ స్మృతుల సమాహారంగా ‘మా’ పేరిట మైక్రోసైట్ ఆయన అధికార వెబ్సైట్లో ప్రారంభమైంది. ఇటీవల మరణించిన ఆమెకు నివాళిగా దీన్ని తీర్చిదిద్దినట్టు అధికారులు తెలిపారు. ‘‘బిడ్డలకు హీరాబెన్ నేర్పిన విలువలు తదితరాల విశేషాలు సైట్లో ఉంటాయి. హీరాబా జీవితం, ఫొటోలు, వీడియోలు, ఆమె వందో పుట్టినరోజు సందర్భంగా మోదీ రాసిన బ్లాగ్, ఆమె మృతిపై పలు దేశాధినేతల స్పందన, నివాళులు కూడా ఉంటాయి’’ అని వివరించారు. -
చిరు వ్యాపారుల కోసం ముత్తూట్ ఫిన్‌కార్ప్ రుణాలు
హైదరాబాద్: చిరు వ్యాపారులు మొదలుకుని స్వయం ఉపాధి పొందుతున్న వారి వరకు వివిధ వ్యాపార వర్గాలకు రుణాలను అందించడంపై ముత్తూట్ ఫిన్‌కార్ప్ దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా అదనపు హామీ అవసరం ఉండని వ్యాపార్ మిత్ర బిజినెస్ లోన్స్‌ను ప్రవేశపెట్టింది. దీనితో ఆదాయ పన్ను రిటర్న్ పత్రాలు లేదా సిబిల్ స్కోర్ రికార్డులు మొదలైనవి అందించకుండానే వ్యాపార రుణాలను పొందవచ్చని సంస్థ తెలిపింది. రోజువారీ చెల్లింపుల అవకాశాన్ని అందిస్తున్నామని, ముందస్తు చెల్లింపు చార్జీలేమీ ఉండవని పేర్కొంది. దేశవ్యాప్తంగా 3,600 పైచిలుకు ముత్తూట్ ఫిన్‌కార్ప్ శాఖల్లో ఈ రుణాలు పొందవచ్చని వివరించింది. -
పెనాల్టీల తగ్గింపును స్వాగతించిన బుగ్గన
సాక్షి, అమరావతి: చిన్న వ్యాపార సంస్థలకు విధించే పెనాల్టీలను తగ్గించడం, అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటులో రాష్ట్ర సూచనలను పరిగణనలోకి తీసుకోవడంపై రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ హర్షం వ్యక్తం చేశారు. శనివారం న్యూఢిల్లీ విజ్ఞానభవన్‌లో జరిగిన 49వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర అధికారులతో కలిసి బుగ్గన పాల్గొన్నారు. రాష్ట్రం సూచించిన విధంగానే రూ.20 కోట్ల వ్యాపార పరిమాణం ఉన్న సంస్థలు రిటర్నులు ఆలస్యంగా దాఖలు చేసినప్పుడు విధించే పెనాల్టీల సవరణకు కౌన్సిల్ అంగీకరించినట్లు తెలిపారు. అప్పిలెట్ ట్రిబ్యునల్స్‌లో తీసుకోవాల్సిన సవరణల కోసం మంత్రుల కమిటీ సూచనలకు కౌన్సిల్ ఆమోదం తెలిపిందని, కమిటీలో తాను కూడా సభ్యుడిగా ఉన్నానని, ట్రిబ్యునల్‌లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి చోటు కల్పించడంతో పాటు, త్వరగా ఏర్పాటు చేయాలన్న సూచనలకు కౌన్సిల్ అంగీకరించిందని వెల్లడించారు. జూన్, 2022 వరకు రాష్ట్రాలకు చెల్లించాల్సిన రూ.16,982 కోట్ల పరిహార బకాయిల చెల్లింపునకు కౌన్సిల్ అంగీకరించిందని, ఇందులో రాష్ట్రానికి సుమారు రూ.689 కోట్లు రావాల్సి ఉందన్నారు.సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి(వాణిజ్య పన్నులు) ఎన్.గుల్జార్, రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ ఎం.గిరిజా శంకర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
అదిరిందయ్యా.. రోడ్డుపై రయ్యిమంటూ దూసుకెళ్లే దుకాణం
నిజాయితీగా బతకాలన్న ఆకాంక్ష ఉంటే చాలు.. కోటి ఉపాయాలు తన్నుకొస్తాయి. అందులో ఏదో ఒకదానిని ఆచరణలో పెడితే బతుకు సాఫీగా సాగిపోతుంది. ఇందుకు నిదర్శనమే ఖాదర్. అనంతపురంలోని నందమూరి నగర్‌కు చెందిన ఖాదర్ చిరు వ్యాపారంతో కుటుంబాన్ని పోషించాలనుకున్నాడు. అద్దె గది కోసం వెదికాడు. రూ. వేలల్లో అడ్వాన్స్, అదే స్థాయిలో నెలవారీ అద్దె చెల్లించడం భారంగా భావించిన అతను తనకొచ్చిన ఆలోచనను కార్యరూపంలోకి పెట్టాడు. తన వద్ద ఉన్న పాత మోపెడ్‌కు వెనుక తోపుడుబండిని అమర్చుకుని, అందులో గుండుసూది మొదలు.. వివిధ రకాల గృహోపకరణాలు, వంట సామగ్రి, ప్లాస్టిక్ వస్తువులు, ఆట బొమ్మలు, జ్యువెలరీ, గొడుగులు, లేడీస్ బ్యాగ్‌లు... ఇలా ప్రతి ఒక్క వస్తువునూ తీసుకెళ్లి వీధుల్లో విక్రయించడం మొదలు పెట్టాడు. రోడ్డుపై రయ్యిమంటూ దూసుకెళ్లే దుకాణాన్ని చూసిన ప్రతి ఒక్కరూ అదిరిందయ్యా ఖాదరూ అంటూ అభినందిస్తున్నారు. చూసేందుకు చిత్రంగా ఉన్న ఈ దుకాణంలో వస్తు, సామగ్రి కొనుగోలు చేసేందుకు మహిళలు ఉత్సాహం చూపుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
చిన్న సంస్థల ఎగుమతులకు ప్రభుత్వ సహకారం
న్యూఢిల్లీ: చిన్న వ్యాపార సంస్థలు, ఎంఎస్ఎంఈలు మరిన్ని ఎగుమతులు చేసేందుకు వీలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఎంఎస్ఎంఈ రంగం తన సామర్థ్యం మేరకు ఎగుమతులు చేసేందుకు నూతన విధానాలను రూపొందిస్తున్నట్టు చెప్పారు. ‘ఉద్యమి భారత్’ కార్యక్రమం ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోదీ, ఎంఎస్ఎంఈ రంగానికి పలు చర్యలను ప్రకటించారు. భారత దేశ ఎగుమతులు పెరిగేందుకు, మరిన్ని మార్కెట్లకు భారత ఉత్పత్తులు చేరుకునేందుకు ఎంఎస్ఎంఈ రంగం బలంగా ఉండడం అవసరమని చెప్పారు. ‘‘మీ సామర్థ్యాలు, అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. కొత్త విధానాలను రూపొందిస్తోంది. ఇవన్నీ ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించడం, వాటి నాణ్యతను పెంచడం కోసమే. భారత ఎంఎస్ఎంఈల ఎగుమతులు పెంచాలి. ఈ దిశగా పనిచేయాలని విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలకు చెప్పాం. భారత మిషన్స్.. వాణిజ్యం, టెక్నాలజీ, టూరిజం అనే మూడు అంశాల ఆధారంగా పనిచేస్తుంది’’అని ప్రధాని వివరించారు. రుణాలకు సమస్యలు.. గ్యారంటీలు లేకుండా రుణాలు పొందలేని విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు. ఇది సంస్థలను స్థాపించాలని భావించే బలహీన వర్గాల ఆకాంక్షలకు అతిపెద్ద అవరోధంగా పేర్కొన్నారు. అందుకనే తాము ప్రధానమంత్రి ముద్రా యోజన పథకాన్ని తీసుకొచ్చినట్టు చెప్పారు. దీని కింద ప్రతి భారతీయుడు సులభంగా వ్యాపారం ప్రారంభించొచ్చన్నారు. ఈ పథకం కింద ఇప్పటికే రూ.19 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఇలా రుణ సాయాన్ని పొందిన వారి నుంచి ఏడు కోట్ల మంది మొదటిసారి వ్యాపారులుగా మారినట్టు వివరించారు. ముద్రాయోజన కింద 36 కోట్ల రుణ ఖాతాలను మంజూరు చేయగా, అందులో 70% మహిళలకు ఇచ్చినవే ఉన్నాయని చెప్పారు. ఎంఎస్ఎంఈల పనితీరును పెంచే పథకం ‘ఆర్‌ఏఎంపీ’, మొదటిసారి ఎగుమతి చేసే ఎంఎస్ఎంఈల సామర్థ్య నిర్మాణం కోసం ‘సీబీఎఫ్‌టీఈ’ పథకాలను ప్రధాని ప్రారంభించారు. -
ఫేస్బుక్ లోన్లు.. హైదరాబాదీలకు అవకాశం
Small Business Loan Initiative: చిరు వ్యాపారులు, స్టార్టప్‌లకు అండగా నిలిచేందుకు ఫేస్బుక్ ముందుకు వచ్చింది. వీరికి తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేసింది. ఆగస్టు 20 నుంచి ఈ లోన్లు ఇస్తామని ఫేస్బుక్ ఇండియా ప్రకటించింది. స్మాల్ బిజినెస్ లోన్ స్టార్టప్ కంపెనీగా ప్రారంభమై ఈ రోజు అతిపెద్ద సంస్థల్లో ఒకటిగా నిలిచింది ఫేస్బుక్. లక్షల కోట్ల రూపాయల సంపద ఈ రోజు ఫేస్బుక్ సొంతం. దీంతో తనలాగే ఎదుగుతోన్న స్టార్టప్‌లు చిరు వ్యాపారులకు అండగా నిలిచేందుకు స్మాల్ బిజినెస్ లోన్ పేరుతో గతేడాది 100 మిలియన్ డాలర్లతో ప్రత్యేక నిధిని ఫేస్బుక్ ఏర్పాటు చేసింది. వీటితో 30 దేశాల్లోని మైక్రో, మీడియం బిజినెస్‌లో ఉన్న సంస్థలకు సాయం చేయాలని నిర్ణయించింది. ఇండియాఫై ద్వారా స్మాల్ బిజినెల్ లోన్ పథకం అమలు చేసేందుకు ఇండిఫై సంస్థతో ఫేస్బుక్ ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం ఇండిఫై సంస్థ చిరు వ్యాపారులకు లోన్లు అందించే సంస్థగా పని చేస్తోంది. ఫేస్బుక్ స్మాల్బిజినెస్ లోన్లు పొందాలనుకునేవారు ఇండియాఫై ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్‌లో కూడా స్మాల్ బిజినెస్ లోన్ పథకంలో భాగంగా ఇండియాకు 4 మిలియన్ డాలర్లు కేటాయించింది. వీటితో దేశంలో ఉన్న 200 పట్టణాల్లోని చిరు, మధ్యతరహా వ్యాపారులకు లోన్లు ఇవ్వనున్నారు. కనిష్టంగా రూ. 5 నుంచి గరిష్టంగా రూ.50 లక్షల వరకు లోన్లు ఇస్తారు. తొలివిడతగా ఆగస్టు 20వ తేది నుంచి ఈ పథకాన్ని హైదరాబాద్, న్యూఢిల్లీ, గురుగ్రామ్, ముంబై, బెంగళూరులలో అమలు చేయనున్నారు. కనీసం మూడు వేల మందికి అయినా లోన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తక్కువ వడ్డీ ఫేస్బుక్లో ప్రకటనలు ఇవ్వడానికి వస్తున్న అనేక స్టార్టప్ కంపెనీలు పెట్టుబడి దొరక్క ఇబ్బందులు పడుతున్నట్టు గుర్తించాం. అందుకే వారికి అండగా నిలిచేందుకు స్మాల్ బిజినెస్ లోన్ పథకానికి శ్రీకారం చుట్టినట్టు ఫేస్బుక్ ఇండియా, వైస్‌ప్రెసిడెంట్ అజిత్ మోహన్ అన్నారు. స్మాల్బిజినెస్ ద్వారా ఇచ్చే లోన్‌కి నామమాత్రపు వడ్డీ తీసుకుంటామన్నారు. ఇక మహిళా వ్యాపారులకయితే వడ్డీలో అదనంగా 0.20 శాతం రాయితీతో రుణాలు ఇస్తామన్నారు. - సాక్షి, వెబ్‌డెస్క్ చదవండి: దక్షిణాదిలోనే ఎత్తయిన నివాస సముదాయం..హైదరాబాద్‌లోనే -
రామప్పకు వారసత్వ హోదా: చిరు వ్యాపారుల్లో టెన్షన్ టెన్షన్
సాక్షి, వెంకటాపురం(వరంగల్): చారిత్రాత్మక రామప్ప దేవాలయానికి వారసత్వ హోదా వచ్చిందని సంతోషించాలో.. బాధపడాలో తెలియని పరిస్థితుల్లో స్థానిక చిరు వ్యాపారులు ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా ఆలయం ముందు చిరు వ్యాపారాలు పెట్టుకొని జీవనం కొనసాగిస్తున్న వారికి యునెస్కో ప్రతిపాదన జీవనోపాధి దూరం చేసింది. ఆలయానికి సుమారు 100 మీటర్ల దూరంలో ఎలాంటి దుకాణాలు, కట్టడాలు ఉండకూడదనేది యునెస్కో ప్రధాన నిర్ణయం. ఈ ఆంశం ఆధారంగానే వేయిస్తంభాలగుడి, వరంగల్ కోట కట్టడాలు తిరస్కరణకు గురయ్యాయి. రామప్ప ఆలయాన్ని యునెస్కో గుర్తింపు కోసం కేంద్రం డోషియార్ (రామప్ప సమగ్ర వివరాలతో కూడిన పుస్తకం)ను తయారు చేసి ప్రతిపాదించింది. ఈ క్రమంలో డోషియార్‌లో పొందుపరిచిన విషయాలను క్షేత్రస్థాయిలో పరీశీలించేందుకు 2019 సెప్టెంబర్‌లో యునెస్కో ప్రతినిధి వాసు పోశ్యానందన పర్యటన ఖరారైంది. దీంతో రామప్ప ఆలయం ముందు ఉన్న చిరు వ్యాపారుల కట్టడాలను కూల్చివేసి దుకాణాలను తొలగించారు. యునెస్కో ప్రతినిధి పర్యటన పూర్తయ్యాక ఆలయానికి దగ్గరలో ఉన్న పార్కింగ్ స్థలంలో తాత్కాలికంగా దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు అధికారులు అనుమతించారు. ఆలయానికి వచ్చిన పర్యాటకులు పార్కింగ్ స్థలంలో ఉన్న దుకాణాల వద్దకు వెళ్లి కోనుగోలు చేయకపోవడంతో వ్యాపారం సరిగా జరగలేదు. దీంతో ఆలయం ముందు దుకాణాలు ఏర్పాటు చేసుకునేలా అనుమతి ఇవ్వాలని, లేదా తూర్పు ముఖద్వార రోడ్డు వద్ద పర్మనెంటుగా స్థలాలను కేటాయించాలని జిల్లా కలెక్టర్‌తోపాటు మంత్రులకు మొరపెట్టుకున్నప్పటికి ఫలితం లేకుండాపోయింది. ప్రస్తుతానికి కొంతమంది ఆలయం ముందు తాత్కాలికంగా దుకాణాలు ఏర్పాటు చేసుకొని కాలం వెళ్లదీస్తుండగా, మరికొంతమంది కూలీ పనులకు వెళుతూ జీవనం సాగిస్తున్నారు. స్థలం కేటాయించాలి రామప్పకు యునెస్కో ప్రతిపాదన పంపడంతో అధికారులు దుకాణాలను తీసివేయించారు. రెండేళ్లుగా వ్యాపారం చేయకుండా తీవ్రంగా నష్టపోయాం. దుకాణాలను తొలగించే సమయంలో పర్మినెంట్‌గా దుకాణాదారులకు స్థలాలు కేటాయిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఇప్పటికైనా అధికార యత్రాంగం స్పందించి రామప్పలోని చిరువ్యాపారులకు రామప్ప తూర్పు ముఖద్వారం వైపు స్థలాలు కేటాయించాలి. – పిల్లలమర్రి శివ, రామప్ప చిరువ్యాపారుల సంఘం అధ్యక్షుడు కూలీ పనులకు వెళుతున్నా.. రామప్పకు వచ్చే పర్యాటకులకు బొమ్మలు అమ్ముతూ కుటుంబాన్ని పోషించేవాడిని. ఆలయం ముందు ఉన్న దుకాణాన్ని తొలగించడంతో కూలీ పనులకు వెళుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. పర్యాటకులను నమ్ముకొని 28 మంది చిరు కుటుంబాలకు జీవనోపాధి దొరికేది. ప్రస్తుతం వీరంతా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వ అధికారులు మాకు ఒక శాశ్వత పరిష్కారం చూపాలి. – పోశాల రాజమౌళి, బొమ్మల దుకాణదారుడు, రామప్ప -
సైకిల్ మీద బ్రెడ్డు, గుడ్లు అమ్మిన సోనూసూద్!
ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపద్బాంధవుడు. కష్టాల్లో ఉన్నవారికి చేయూతనిచ్చే మంచి మనసున్న వ్యక్తి సోనూసూద్. వలస కార్మికులను సొంత గూటికి తరలించి వారి పాలిట దేవుడిగా మారిన సోనూసూద్ తాజాగా గుడ్లు, బ్రెడ్డు అమ్ముతూ కనిపించాడు. ఈ మేరకు సోనూ ఓ వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. ఇందులో సోనూ కూర్చున్న సైకిల్ మీద గుడ్లు, బ్రెడ్డు, పావ్‌తో పాటు మరిన్ని సరుకులు ఉన్నాయి. ఈ సైకిల్‌ను సోనూ.. సూపర్ మార్కెట్‌గా అభివర్ణించాడు. 10 గుడ్లు కొంటే ఒక బ్రెడ్డు ఫ్రీ అని ఆఫర్ ప్రకటించాడు. హోమ్ డెలివరీ కూడా ఉచితమే అని చెప్పాడు. ఇంతకీ ఇదేదో సినిమా షూటింగ్ అనుకునేరు, కానే కాదు.. చిరు వ్యాపారులను ప్రోత్సహించమని చెప్పేందుకు సోనూ ఈ వీడియో చేశాడు. View this post on Instagram A post shared by Sonu Sood (@sonu_sood) చదవండి: ఊహించాడు.. అచ్చుం అలాగే చనిపోయాడు! -
అమెజాన్ స్మాల్ బిజినెస్ డేస్.. డేట్ వచ్చేసింది!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా జూలై 2–4 తేదీల్లో స్మాల్ బిజినెస్ డేస్‌ను నిర్వహిస్తోంది. కోవిడ్–19 కారణంగా వ్యాపారాలకు అంతరాయం కలిగిన నేపథ్యంలో.. వ్యాపారాలను తిరిగి గాడిలో పెట్టేందుకు ఈ సేల్‌ను చేపడుతున్నట్టు వెల్లడించింది. జూలై 2 అర్ధరాత్రి నుంచి ప్రారంభమై.. జూలై 4వ తేదీ అర్ధరాత్రి 11.59 గంటల వరకు స్మాల్ బిజినెస్ డేస్ కొనసాగుతాయని తెలిపింది. లక్షలాది తయారీదారులు, చిన్న బ్రాండ్స్ యజమానులు, 1,000కిపైగా స్టార్టప్స్, 6.8 లక్షల మంది మహిళా వ్యాపారులు, 12 లక్షలపైచిలుకు చేతివృత్తులవారు, చేనేతకారులు, 50,000 దాకా స్థానిక దుకాణదారులు ఇందులో పాలుపంచుకుంటారని కంపెనీ వివరించింది. చదవండి: డీమోనిటైజేషన్: ఆవి డబ్బులే, వివరణ అవసరం లేదు అత్యధికంగా విరాళాలు ఎవరు ఇచ్చారో తెలుసా..? బిల్‌గేట్స్ మాత్రం కాదు.. -
బాబాకా ధాబాకు క్యూ కట్టిన కస్టమర్లు
-
సోషల్ మీడియానా మజాకా: వైరల్ వీడియో
సాక్షి, న్యూఢిల్లీ: చిన్నపిల్లలనుంచి వృద్ధుల దాకా సోషల్ మీడియా విపరీతమైన ప్రభావాన్ని పడవేస్తోంది. ఆధునిక టెక్నాలజీ యుగంలో సోషల్ మీడియా ప్రపంచ దిశ దశను మారుస్తోంది. రాజకీయాలు నుంచి వంటింటి దాకా సోషల్ మీడియానా మజాకా అనిపిస్తోంది. ఢిల్లీలో చోటు చేసుకున్న ఒక సంఘటన గురించి తెలుసుకుంటే.. సోషల్ మీడియా మీద ఒకింత కోపంగా ఉన్న వారు కూడా ఔరా అనక మానరు. ఢిల్లీలోని మాలవీయనగర్‌లో ఉన్న బాబాకా ధాబా గురించి ట్విటర్లో ఒక వీడియో పోస్ట్ అయింది. కరోనా, లాక్డౌన్ కారణంగా డిమాండ్ లేక షాపు యజమాని కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలో షేర్ చేశారు. దాదాపు 80 ఏళ్ళ వృద్ధాప్యంలో జీవనం కోసం ఆ జంట పడుతున్న ఆరాటాన్ని చూపించారు. అంతేకాదు వీరిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతే క్షణాల్లో ఈ వీడియో వైరల్ గా మారింది. పిల్లల అనాదరణకు గురైన ఈ వృద్ధ దంపతుల పోరాట కథ పలువురి హృదయాలను కదిలించింది. బాలీవుడ్ నటులు సునీల్ శెట్టి, రవీన్ టాండన్, సోనమ్ కపూర్, రవీనా టాండన్, జర్నలిస్టు, నటి స్వర భాస్కర్, క్రికెటర్ ఆర్ అశ్విన్ లాంటి సెలబ్రిటీలతో పలువురు దీన్ని లైక్ చేసి, షేర్ చేశారు. దీంతో నెటిజనుల నుంచి స్పందన భారీగా వచ్చింది. సపోర్ట్ లోకల్ అంటూ స్థానికులు బాబా కా ధాబాకు క్యూ కట్టారు. ఫుడ్ స్టాల్ లో లభ్యమయ్యే భోజనం, చపాతీలకు ఇబ్బడి ముబ్బడిగా ఆర్డర్లు ఇవ్వడం మొదలు పెట్టారు. బాబా చేతి వంట మటర్ పనీర్ ఆసాంతం లొట్టలేసుకుంటూ ఆరగించేశారు. సెల్ఫీలతో సందడి చేశారు. దీంతో సంతోషంతో ఉక్కిరి అయిపోవడం యజమాని వంతైంది. అంతేకాదు మాలవీయ నగర్ బాబాకా ధాబా ఒక ల్యాండ్ మార్క్ గా నిలిచింది. ఈ వీడియో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతిని కూడా కదిలించింది. బాబా కా ధాబాను తాను సందర్శించానని, వారి జీవితాల్లో సంతోషం కోసం తాను చేయగలిగింది తాను చేస్తానంటూ ట్వీట్ చేశారు. కాగా ఈ వీడియోను బ్లాగర్ గౌరవ్ వాసన్ చిత్రీకరించారు. బాబా కా దాబా ఓనరు పేరు కాంత ప్రసాద్. భార్య పేరు బాదామి దేవి. .@RICHA_LAKHERA .@VasundharaTankh .@sohitmishra99 .@sakshijoshii .@RifatJawaid .@ShonakshiC .@TheDeshBhakt Visited "Baba Ka Dhaba" n hv done d needful to bring SMILE on their faces as promised. Will take care of them n I am starting a drive 2 take care of similarly placed people. pic.twitter.com/S9A94AmJxK — Adv. Somnath Bharti (@attorneybharti) October 8, 2020 -
అమ్మ కోసం అన్నీ ఇష్టంగానే చేస్తా..
బేల్దారి పనులతో మా అమ్మ ఎంతో కష్టపడుతోంది. కరోనా కారణంగా పనిలేకుండా పోయింది. కష్టాలు చుట్టుముట్టాయి. ఇల్లు గడవటం కష్టంగా మారింది. అందుకే అమ్మకు సాయంగా ఉంటున్నా.. ఇది నాకు ఏమాత్రం కష్టం కాదు. – ఓ పదకొండేళ్ల కుర్రాడు చెప్పిన జీవిత పాఠం ఆ చిన్నారికి నిండా పదకొండేళ్లు లేవు. తన వయస్సు పిల్లలంతా టీవీ చూడ్డమో.. సెల్ఫోన్లో గేమ్స్ ఆడుకోవడమో చేస్తుంటారు. కానీ ఆ బడతడు ఆటలకు దూరమయ్యాడు. తండ్రి దూరమై తల్లడిల్లుతున్న తల్లికి తోడయ్యాడు. కరోనా కష్టకాలంలో కుటుంబ బాధ్యతను నెత్తికెత్తుకున్నాడు. ఇళ్లిళ్లూ తిరుగుతూ కూరగాయలు విక్రయిస్తున్నాడు. తల్లి, ఇద్దరు అక్కలకు ఆర్థిక ఆసరానిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. వయస్సులో చిన్నోడయినా బాధ్యత నెత్తికెత్తుకోవడంలో అందరికన్నా మిన్న. అందుకే అందరూ శభాష్ సుదర్శనా అంటున్నారు. ఎవరీ చిన్నారి..ఏమా కష్టం..తెలుసుకుందాం.. స్ఫూర్తి పొందుదాం. గుత్తి: గుత్తి పట్టణంలోని గాంధీ నగర్ కాలనీలో వెంకటేష్, సుజాత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి యశోద, వెంకట లక్ష్మి, రమణి, పద్మావతి, సుదర్శన్ అనే ఐదుగురు సంతానం. ఈ దంపతులు కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. విధి వక్రించడంతో ఆరేళ్ల క్రితం వెంకటేష్ మరణించాడు. దీంతో సుజాత కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషించింది. ముగ్గురు కుమార్తెలకు వివాహాలు కూడా చేసింది. ఈ క్రమంలో కుటుంబం గడవడం కష్టంగా మారగా... పదకొండేళ్ల కుమారుడు సుదర్శన్ తల్లికి తోడుగా నిలిచాడు. మూడు సంవత్సరాలుగా తల్లితో పాటు శ్రమిస్తున్నాడు. తల్లి తయారు చేసిన దోశలు, ఇడ్లీలు, వడలు బకెట్లో పెట్టుకుని ఊరంతా తిరుగుతూ విక్రయిస్తూ వచ్చిన కొద్దిపాటి మొత్తంతో కుటుంబానికి ఆర్థిక చేయూతనిస్తున్నాడు. మరోపక్క చదువు కూడా కొనసాగించాడు. అంతా బాగుందనుకుంటున్న తరుణంలో ఆ కుటుంబానికి కొత్త కష్టం వచ్చి పడింది. సుదర్శన్ వద్ద ఆకుకూరలు కొంటున్న మహిళలు.. కరోనా కష్టాలతో జీవితం తలకిందులు.. కరోనా కారణంగా ఐదు మాసాలుగా లాక్డౌన్ విధించగా...వీరి జీవితం తలకిందులైంది. దోశలు, వడలు, ఇడ్లీలు విక్రయించడం కష్టమైంది. ఆర్థిక పరిస్థితి దిగజారగా ఇళ్లు గడవడం ఇబ్బందిగా మారింది. దీంతో సుదర్శన్ నిత్యావసరాలైన కూరగాయలు, ఆకుకూరలు విక్రయించాలనే నిర్ణయానికి వచ్చాడు. ఓ సైకిల్లో ఆకుకూరలు, కూరగాయల బుట్ట పెట్టుకుని ఊరంతా తిరుగుతూ విక్రయిస్తున్నాడు. రోజూ రూ.150 నుంచి రూ.200 దాకా సంపాదిస్తూ కుటుంబానికి అండగా నిలుస్తున్నాడు. ఇప్పటి వరకూ బాగానే ఉన్నా...రేపు పాఠశాలలు తిరిగి తెరిస్తే సుదర్శన్ జీవితం ప్రశ్నార్థంగా మారనుంది. కుటుంబ బాధ్యతా..? భవిష్యత్ వైపు అడుగులా తేల్చుకోలేని కష్టం ఎదురుకానుంది. మనసున్న మనుషులు కాస్త చేయూతనిస్తే ఇంటిపెద్దగా మారిన ఈ చిన్నారి జీవితం ఒడ్డునపడుతుంది. నాన్న చనిపోవడం బాధించింది.. మేము ఐదుగురు సంతానం. అనారోగ్యంతో నాన్న చనిపోవడం నన్ను ఎంతగానో బాధించింది. అప్పుడు నా వయస్సు ఐదేళ్లు. ఏడవద్దని అమ్మను మేమంతా ఓదార్చాం. అమ్మ ఎంతో కష్టపడి ముగ్గురు అక్కలకు పెళ్లిళ్లు చేసింది. మూడు సంవత్సరాల క్రితం నుంచి అమ్మకు తోడుగా నేనూ చిరు వ్యాపారం చేస్తున్నా. అమ్మచేసే ఇడ్లీలు, వడలు, దోశలు ఊరంతా తిరిగి అమ్ముతున్నా. కరోనా వల్ల వ్యాపారం లేక... బుట్టలో కూరగాయలు, ఆకుకూరలు పెట్టుకొని విక్రయిస్తున్నా. నేను బరువు మోయలేనని అమ్మ ఈ మధ్యనే చిన్న సైకిల్ కొనిచ్చింది. నేను చిన్న పిల్లోడిని కావడంతో అందరూ నా వద్దే కొంటున్నారు. ప్రస్తుతం నేను కోట ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నా. బడి తెరిచినా..కూరగాయలు విక్రయించడం కష్టమవుతుందేమో...అయినా అమ్మ కోసం అన్నీ ఇష్టంగానే చేస్తా. సాయం చేయాలనుకుంటే.. సుజాత, సుదర్శన్ జాయింట్ అకౌంట్ అకౌంట్ నెం.31262250092754 ఐఎఫ్ఎస్సీ కోడ్ : SYNB0003126 సిండికేట్ బ్యాంకు, గుత్తి అర్బన్ -
చిన్న వ్యాపారాల నుంచి రూ. 2.32 లక్షల కోట్ల డిఫాల్ట్‌ల ముప్పు: సిబిల్
ముంబై: కోవిడ్–19 ప్రభావంతో చిన్న వ్యాపార సంస్థలు తీసుకున్న రుణాల్లో దాదాపు రూ.2.32 లక్షల కోట్లు డిఫాల్ట్ అయ్యే తీవ్ర పరిస్థితి నెలకొందని సిబిల్ పేర్కొంది. ప్రత్యేకించి రూ.10 లక్షలలోపు రుణం ఉన్న లఘు పరిశ్రమలు తీవ్రంగా కరోనా ప్రభావానికి గురవుతాయని బుధవారంనాడు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ పేర్కొంది. రూ.10 లక్షల లోపు రుణం ఉన్న చిన్న సంస్థల మొత్తం రుణ పరిమాణం దాదాపు రూ.93,000 కోట్లయితే, ఇందులో రూ.13,600 కోట్లు మొండిబకాయిల ఖాతాలోకి వెళ్లొచ్చని అంచనావేసింది. చిన్న పరిశ్రమలను ఆదుకోవాలి.. ఐబీఏ: కాగా ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలను (ఎంఎస్ఎంఈ) ఆదుకోవాలని కేంద్రం, ఆర్బీఐలకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) విజ్ఞప్తి చేసింది. ఈ రంగానికి సంబంధించి రుణ బకాయిల చెల్లింపులపై ఆరు నెలల మారటోరియం, క్రెడిట్ గ్యారంటీ స్కీమ్, వన్‌టైమ్ లోన్ రిస్ట్రక్చరింగ్ వంటి కొన్ని కీలక సిఫారసులు ఐబీఏ జాబితాలో ఉన్నాయి. ఎంఎస్ఎంఈలు, బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలుసహా పలు పారిశ్రామిక విభాగాలు ఎదుర్కొంటున్న సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలపై ఐబీఏ కీలక సిఫారసులు చేసింది. -
వీధి విక్రయదారులకు ప్రత్యేక గుర్తింపు!
• పట్టణాల్లో 3 రకాల జోన్ల ఏర్పాటు • ప్రకటిత జోన్లలోనే వ్యాపారానికి అనుమతులు • లైసెన్స్‌లు, గుర్తింపుకార్డులు • జారీ చేయనున్న మున్సిపల్ అధికారులు • పదిమంది సభ్యులతో పొదుపుసంఘం ఏర్పాటు • సభ్యులకు బ్యాంక్ లింకేజీ రుణాలిచ్చి ప్రోత్సాహం • సుప్రీంకోర్టు ఆదేశాలతో అధికారుల ఏర్పాట్లు మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పట్టణాల్లో చిరువ్యాపారం చేసుకుంటూ కాలం గడుపుతున్న వీధి విక్రయదారులకు ప్రత్యేక గుర్తింపు లభించనుంది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా మున్సిపల్‌శాఖ కసరత్తు ప్రారంభించింది. అధికారులు ప్రధానంగా పట్టణాలలోని వీధి విక్రయదారులను గుర్తించడంతోపాటు వ్యాపారం చేసుకునేందుకు అనువైన స్థలాలను ఎంపిక చేయడం, లైసెన్స్‌లు జారీ చేయడం.. సంఘాల ద్వారా బ్యాంక్ లింకేజీ రుణాలను అందజేసి ప్రోత్సహించనున్నారు. మహబూబ్‌నగర్, బాదేపల్లి, నారాయణపేట మున్సిపాలిటీల్లో మెప్మా సిబ్బంది ఇప్పటికే సర్వే పూర్తి చేసి 1784 మంది వీధి విక్రయదారులు ఉన్నట్లు గుర్తించారు. ఈ సర్వే రిపోర్టు ఆధారంగా బాదేపల్లి మున్సిపాలిటీ పరిధిలో 311 మంది, మహబూబ్‌నగర్‌లో 1191 మంది, నారాయణ పోటలో 282 మంది వీధి విక్రయదారులు ఉన్నట్లు తేలింది. ఇలా ప్రతి ఐదేళ్లకు ఒకసారి సర్వే నిర్వహించనున్నారు. లైసెన్స్‌లు జారీ మెప్మా సిబ్బంది నిర్వహించిన సర్వే ఆధారంగా గుర్తించిన వీధి విక్రయదారులకు టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులు త్వరలో లైసెన్స్‌లు జారీ చేయనున్నారు. వీరికి వ్యాపారాలు సాగించేందుకు స్థలాలను కేటాయించనున్నారు. లైసెన్సులు కలిగిన వారు ఇకనుంచి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా వ్యాపారాలు సాగించే అవకాశం ఉంటుంది. సంఘాల ఏర్పాటుకు కసరత్తు జిల్లాలోని పురపాలికల్లో ఇప్పటికే గుర్తించిన వీధి విక్రయదారులతో సంఘాలు ఏర్పాటు చేసేందుకు మున్సిపల్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. వీరికి గుర్తింపుకార్డులు అందజేస్తారు. ప్రతి 10మంది విక్రయదారులతో ఒక పొదుపు సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. ఇలా జిల్లాలోని మూడు మున్సిపాలిటీల పరిధిలో 170కి పైగా సంఘాలను ఏర్పాటు చేయనున్నారు. ఇçప్పటికే మహబూబ్‌నగర్‌లో 15పొదుపు సంఘాలను అధికారులు ఏర్పాటు చేయడంతోపాటు పట్టణ వీ«ధి విక్రయదారుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇలా మూడు మున్సిపాలిటీల పరిధిలో మార్చి నెలాఖరు వరకు సంఘాలను ఏర్పాటు చేసే ప్రక్రియను పూర్తి చేయనున్నారు. వీటిలో నమోదైన సభ్యులకు బ్యాంక్ లింకేజీ రుణాలు పొందే అవకాశాన్ని కల్పించనున్నారు. -
సంస్కృతుల సమ్మిళితం...
కన్నడిగుల సౌ‘భాగ్య’నగరం నిజాంల కాలంలోనే భాగ్యనగరానికి వలస వచ్చిన కన్నడిగులు ఇక్కడి ప్రజలతో మమేకమై జీవనం సాగిస్తున్నారు. ఇడ్లీ, దోశ వంటి తినుబండారాల చిరు వ్యాపారాలు మొదలుకొని ట్రాన్స్పోర్ట్, వస్త్ర, బంగారు, వెండి ఆభరణాల వంటి బడా వ్యాపారాలు చేస్తున్న వారు కొందరైతే, ప్రైవేటు ఉద్యోగాల్లో కుదురుకున్న వారు ఇంకొందరు. ఉపాధి కోసం ఎలాంటి వృత్తి వ్యాపారాల్లో కొనసాగుతున్నా, కన్నడిగులు తమ సంప్రదాయాలను చెక్కుచెదరకుండా కాపాడుకుంటూ ప్రత్యేకత చాటుకుంటున్నారు. 1972లో భారీ వలసలు... కన్నడిగుల్లో కొందరు నిజాం కాలంలోనే నగరానికి వలస వచ్చి స్థిరపడ్డారు. అయితే, 1972లో కర్ణాటకలోని బీదర్, గుల్బర్గా తదితర జిల్లాలతో పాటు సరిహద్దుల్లోని మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో తీవ్రమైన కరువు వాటిల్లినప్పుడు పెద్దసంఖ్యలో కన్నడిగులు నగరానికి వలస వచ్చారు. నగరంలోని గుల్జార్‌హౌస్, చార్‌కమాన్, మామాజుమ్లా పాఠక్, కోకర్‌వాడీ, చేలాపురా, గౌలిపురా, ఛత్రినాక, ఫిసల్‌బండ, బహదూర్‌పురా, జియాగూడ, బేగంబజార్, మిధాని, దిల్సుఖ్నగర్, కాచిగూడ, అత్తాపూర్, రాజేంద్రనగర్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. శాకాహారం... శైవాచారం... కన్నడిగుల్లో వీరశైవులు, లింగాయత్‌లు శివలింగానికి పూజచేయడంతో దినచర్య ప్రారంభిస్తారు. జొన్నరొట్టెలు, గోధుమరొట్టెలను ప్రధానంగా స్వీకరించే వీరు పూర్తిగా శాకాహారులు. విందు, వినోదాల్లో సైతం మాంసాహారానికి దూరంగా ఉంటారు. వీరశైవులకు జగద్గురు రేణుకాచార్య కులగురువు కాగా, లింగాయత్‌లకు మహాత్మా బసవేశ్వర కులగురువు. కన్నడిగుల్లో యువతరం ఆధునిక వస్త్రధారణకు అలవాటు పడినా, వయసు మళ్లిన వారు మాత్రం ఇప్పటికీ సంప్రదాయ వస్త్రధారణతోనే తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ప్రత్యేక పండుగ ‘యాడమాస్’ ఉగాది, దసరా, దీపావళి, నాగపంచమి పండుగలను తెలుగువారి మాదిరిగానే జరుపుకొనే కన్నడిగులు, ‘యాడమాస్’ పండుగను ప్రత్యేకంగా జరుపుకొంటారు. పంటలు చేతికొచ్చే సమయంలో జనవరిలో నిర్వహించే ఈ పండుగకు నగరంలోని కన్నడిగులందరూ తప్పనిసరిగా తమ తమ స్వస్థలాలకు వెళతారు. జొన్నరొట్టెలతో పాటు పిండివంటలు చేసుకుని, తమ తమ పొలాలకు వెళ్లి, చేతికొచ్చిన పంటలకు ప్రత్యేక పూజలు చేసి, అక్కడే సామూహికంగా విందుభోజనాలు చేసి, సాయంత్రం ఇళ్లకు చేరుకుంటారు. ఇక లింగాయత్‌లు తమ కులగురువైన మహాత్మా బసవేశ్వర జయంతిని వేడుకగా జరుపుకొంటారు. ఆ సందర్భంగా పతాకావిష్కరణ, అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. పెళ్లిళ్లలో తలపాగా... కన్నడిగుల పెళ్లిళ్లలో తలపాగా మర్యాద తప్పనిసరి. పెళ్లికి వచ్చిన బంధుమిత్రుల్లో పురుషులందరికీ తప్పనిసరిగా తలపాగా కడతారు. మహిళలందరికీ చీర, పసుపు కుంకుమలు ఇస్తారు. వరుడి ఇంట్లో కార్యక్రమం జరిగినప్పుడు వధువు తరఫు బంధుమిత్రులందరికీ ఈ మర్యాదలు చేస్తారు. ఇందులో చిన్నా పెద్దా తారతమ్యాలు ఉండవు. - పిల్లి రాంచందర్ కన్నడిగులకు రిజర్వేషన్లు కల్పించాలి కన్నడిగులను లింగ్విస్టిక్ మైనారిటీలుగా గుర్తించి, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలి. నగర శివార్లలో మహాత్మా బసవేశ్వర ఆశ్రమ నిర్మాణానికి మూడెకరాల ఖాళీ స్థలాన్ని కేటాయించాలి. నగరంలోని ప్రధాన కూడలిలో బసవేశ్వర శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. కన్నడిగుల కోసం ప్రత్యేక శ్మశానవాటిక స్థలాన్ని కేటాయించాలి. - నాగ్నాథ్ మాశెట్టి, అధ్యక్షుడు, ఏపీ బసవ కేంద్రం,హైదరాబాద్ -
ఈ రోజులు మాకొద్దు.. ‘చిరు’ బతుకుల్లో చీకట్లు
కరెంటొస్తే.. మోటారు రిపేరు చేసుకోవాలని మెకానిక్‌లు.. కరెంటొస్తే.. నాలుగు జిరాక్స్‌లు తీసి ఈపూట కడుపునింపుకోవాలని చిరువ్యాపారులు.. కరెంటొస్తే.. గజం బట్ట నేసి ఈపూట కూలి సంపాదించుకోవాలని ఓ నేతన్న.. కానీ.. రాదే, కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నా.. కనికరించదే గంటల తరబడి వేచిచూసినా గంటైనా ఉండదే.. కరెంటొస్తే పనుంటది.. పనిచేస్తే కూలొస్తది.. కూలొస్తే బుక్కెడు బువ్వొస్తది.. కానీ.. కరెంటూ రాదు.. కడుపూ నిండదు.. అయినా తప్పని ఎదురుచూపు, ఏ క్షణాన్నయినా రాకపోతుందా.. ఒక జిరాక్స్ తీయకపోతామా, గజం బట్ట నేయలేకపోతామా, ఒక్క మోటారన్నా మరమ్మతు చేయలేకపోతామా అన్న ఆశ. మూసుకుపోతున్న కనురెప్పలకు సర్దిచెప్పుకుని, కాలుతున్న కడుపును అదిమిపట్టుకుని ఎదురు చూసి.. చూసి.. ఇక భరించడం మా వల్ల కాదు.. కరెంటు రాని.. కడుపు నిండని ఈ రోజులు మాకు వద్దంటే వద్దు.. అని తెగేసి చెబుతున్నారు ఈ బడుగుజీవులు. -ఎలక్షన్ సెల్