నిజాయితీగా బతకాలన్న ఆకాంక్ష ఉంటే చాలు.. కోటి ఉపాయాలు తన్నుకొస్తాయి. అందులో ఏదో ఒకదానిని ఆచరణలో పెడితే బతుకు సాఫీగా సాగిపోతుంది. ఇందుకు నిదర్శనమే ఖాదర్. అనంతపురంలోని నందమూరి నగర్‌కు చెందిన ఖాదర్ చిరు వ్యాపారంతో కుటుంబాన్ని పోషించాలనుకున్నాడు. అద్దె గది కోసం వెదికాడు. రూ. వేలల్లో అడ్వాన్స్, అదే స్థాయిలో నెలవారీ అద్దె చెల్లించడం భారంగా భావించిన అతను తనకొచ్చిన ఆలోచనను కార్యరూపంలోకి పెట్టాడు.
తన వద్ద ఉన్న పాత మోపెడ్‌కు వెనుక తోపుడుబండిని అమర్చుకుని, అందులో గుండుసూది మొదలు.. వివిధ రకాల గృహోపకరణాలు, వంట సామగ్రి, ప్లాస్టిక్ వస్తువులు, ఆట బొమ్మలు, జ్యువెలరీ, గొడుగులు, లేడీస్ బ్యాగ్‌లు... ఇలా ప్రతి ఒక్క వస్తువునూ తీసుకెళ్లి వీధుల్లో విక్రయించడం మొదలు పెట్టాడు. రోడ్డుపై రయ్యిమంటూ దూసుకెళ్లే దుకాణాన్ని చూసిన ప్రతి ఒక్కరూ అదిరిందయ్యా ఖాదరూ అంటూ అభినందిస్తున్నారు. చూసేందుకు చిత్రంగా ఉన్న ఈ దుకాణంలో వస్తు, సామగ్రి కొనుగోలు చేసేందుకు మహిళలు ఉత్సాహం చూపుతున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment