![Disha Case: CP Sajjanar at site of the accused killed in encounter - Sakshi](/styles/webp/s3/article_images/2019/12/6/encounter_4.jpg.webp?itok=aVN-ea88)
సాక్షి, హైదరాబాద్ : దిశ హత్యకేసు నిందితుల ఎన్‌కౌంటర్ జరిగిన సంఘటనా స్థలానికి సైబరాబాద్ సీపీ సజ్జనార్ చేరుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. ఎన్‌కౌంటర్‌పై మరికాసేపట్లో అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాగా దిశను చంపిన ప్రాంతంలోనే నిందితులు ఎన్‌కౌంటర్ అయ్యారు.
దిశ కేసు దర్యాప్తును సైబరాబాద్ పోలీసులు సవాల్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు నిందితులను షాద్ నగర్ పోలీసులు పది రోజుల కస్టడీకి తీసుకున్నారు. దిశ అత్యాచారానికి గురైన ప్రాంతం తొండుపల్లి టోల్‌ప్లాజా సర్వీసు రోడ్డు నుంచి పెట్రోల్, డీజిల్ పోసి మృతదేహాన్ని కాల్చిన చటాన్‌పల్లి అండర్‌పాస్ ప్రాంతంలో క్రైమ్ సీన్‌ను రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో ఈ కేసులో ఏ-1 మహ్మద్ ఆరిఫ్, ఏ-2 శివ, ఏ-3 నవీన్, ఏ-4 చెన్నకేశవులను పోలీస్ ఎన్‌కౌంటర్ చేశారు. తెల్లవారుజామున 3.30 గంటలకు ఈ కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది.
చదవండి: దిశ నిందితుల ఎన్‌కౌంటర్
Comments
Please login to add a commentAdd a comment